Senior Citizens Savings Scheme new rules 2023
SCSS new rules 2023
పోస్ట్ ఆఫీస్ బెస్ట్ సేవింగ్స్ స్కీం లో ఒకటైన సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం లో 7 కొత్త మార్పులను (SCSS new rules 2023) కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ స్కీం లో పెట్టుబడి పెట్టి వున్నవారైనా లేదా కొత్త గా పెట్టుబడి పెట్టేవారైనా ఈ మార్పులను తెలుసుకోకపోతే అధిక మొత్తం లో నష్టపోయే అవకాశం వుంది.
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం ఈ విధంగా పని చేస్తుంది , ఈ స్కీం లో మీరు ఒక్కసారే అమౌంట్ డిపాజిట్ చేస్తారు డిపాజిట్ అమౌంట్ ఆధారంగా చేసుకుని ప్రతీ 3 నెలలకి ఒకసారి చొప్పున వచ్చే 5 సంవత్సరాల పటు క్రమం తప్పకుండా రెగ్యులర్ అమౌంట్ ని అందిస్తుందిఅలాగే 5 వ సంవత్సరం మీరు పూర్తి అమౌంట్ ను యధావిధిగా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది.
ఇది వరకు ఈ స్కీం లో అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యాలంటే వ్యక్తి యొక్క వయస్సు ఖచ్చితంగా 60 సంవత్సరాలు ధాటి ఉండాలి కానీ ఇప్పుడు ఎవరైతే 55 నిండి 60 సంవత్సరాల లోపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వారికీ 60 సంవత్సరాలు నిండకుండానే ఎర్లీ టైం లో ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసి మంచి ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు.
SCSS New Changes of Government Employees
1)పదవీ విరమణ ప్రయోజనాలను పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ సమయం ( Long Time to Invest )
ఇది వరకు ఈ స్కీం లో అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యాలంటే వ్యక్తి యొక్క వయస్సు ఖచ్చితంగా 60 సంవత్సరాలు ధాటి ఉండాలి కానీ ఇప్పుడు ఎవరైతే 55 నిండి 60 సంవత్సరాల లోపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వారికీ 60 సంవత్సరాలు నిండకుండానే ఎర్లీ టైం లో ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసి మంచి ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు.
2) ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామి ద్వారా పెట్టుబడి ( Investment by spouse of government employee )
3) పదవీ విరమణ ప్రయోజనాల స్కోప్ నిర్వహణ ( Scope of Retirement Benefits Defined )
పదవీ విరమణ ప్రయోజనాల పరిధి గురించి స్పష్టంగా వివరించబడింది . ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, పదవీ విరమణ ప్రయోజనం , పదవీ విరమణ కారణంగా వ్యక్తి అందుకున్న ఏవైనా ఆర్థిక చెల్లింపులు, ఇందులో ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు, మరణ గ్రాట్యుటీ, పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, రిటైర్మెంట్ సమయంలో యజమానికి చెల్లించే గ్రూప్ సేవింగ్స్ లేదా లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోని పొదుపు మొత్తం, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద రిటైర్మెంట్-కమ్-ఉపసంహరణ (విత్ డ్రాయల్) ప్రయోజనాల వంటివి మరియు స్వచ్ఛంద లేదా ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద పొందిన ఎక్స్ గ్రేషియా చెల్లింపులు కూడా వర్తిస్తాయి.
4) ముందస్తు ఉపసంహరణపై మినహాయింపు ( Deduction on Premature Withdrawal )
కొత్త నియమం ప్రకారం, మీరు డిపాజిట్ చేసిన ఒక సంవత్సరం కి ముందు ఖాతాను మూసివేసినట్లయితే, ఇప్పుడు డిపాజిట్లో 1 శాతం మినహాయింపు వర్తిస్తుంది కానీ మునుపటి నిబంధనల ప్రకారం, ఒక సంవత్సరం ముగిసేలోపు ఖాతాను మూసివేస్తే, ఖాతాలోని డిపాజిట్‌పై చెల్లించిన వడ్డీని కట్ చేసి మొత్తం బ్యాలెన్స్ ఖాతాదారుకు చెల్లించబడుతుంది.
Post Office NSC Scheme In Telugu తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ అందించే పథకం
5) SCSS పొడిగింపుపై పరిమితి లేదు ( No limit on the extension of SCSS )
ఇప్పుడు ఖాతాదారులు ఎన్ని బ్లాక్లకైనా ఖాతాను పొడిగించవచ్చు, ఒక్కో బ్లాక్ మూడు సంవత్సరాల పాటు ఉంటుంది. గతంలో, ఈ పొడిగింపు అనేది కేవలం ఒకసారి మాత్రమే అనుమతించబడింది. అయితే, అకౌంటును పొడిగించిన ప్రతిసారి దరఖాస్తును సమర్పించాలి.
6) స్కీమ్ డిపాజిట్ పొడిగింపుపై వడ్డీ ( Interest on extension of scheme deposit )
మెచ్యూరిటీపై SCSS ఖాతాను పొడిగించే సందర్భంలో, డిపాజిట్ మెచ్యూరిటీ తేదీ లేదా పొడిగించిన మెచ్యూరిటీ తేదీలో పథకానికి వర్తించే వడ్డీ రేటును అందిస్తారు.
7) గరిష్ట డిపాజిట్ మొత్తం ( Maximum Deposit Amount )
ఈ నోటిఫికేషన్ ప్రకారం, “ఖాతా తెరిచే సమయంలో చేసిన డిపాజిట్ ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత లేదా మూడు సంవత్సరాల ప్రతి బ్లాక్ వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించబడుతుంది . ఈ నియం ప్రకారం సింగల్ అకౌంట్ రూపంలో Rs 30లక్షలు , జాయింట్ అకౌంట్ రూపంలో 60 లక్షలు అత్యధికముగా డిపాజిట్ చెయ్యవచు .