Post Office Senior Citizens Saving Scheme In Telugu – “అత్యధిక వడ్డీని అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ పథకం” వీరికి మాత్రమే

                 Post office senior citizens saving scheme in Telugu

Post Office interest rate april 2023

. పోస్ట్ ఆఫీస్ SCSS పథకం అంటే ఏమిటి? ( What is Post Office  SCSS Scheme?)

60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు రెగ్యులర్ ఆదాయం అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి.
కేవలం సీనియర్ సిటిజన్స్ కోసమే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గా రూపొందించిన స్కీం పోస్ట్ ఆఫీస్ SCSS స్కీం. SCSS అంటే సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం.అత్యధిక వడ్డీని అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి.

సామాన్య వ్యక్తులు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం ఉండదు, కాబట్టి మీ కుటుంబంలో ఉండే అమ్మమ్మ, తాతయ్య పేరుమీద అకౌంట్ ఓపెన్ చేసి, నామినీ గా మిమ్మల్ని నియమించుకోవడం ద్వారా సామాన్యులు కూడా ఈ స్కీం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.

 

•SCSS పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, పనిచేసే విధానం? ( How does SCSS Scheme Work? )

ఈ పథకంలో ఒక్కసారే కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చెయ్యవలసి ఉంటుంది. డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని ప్రతీ 3 నెలలకు ఒకసారి మీకు రెగ్యులర్ ఆదాయం లభిస్తుంది, స్కీం చివరి వరకు.
స్కీం యొక్క సమయం ముగియగానే ప్రారంభంలో జమా చేసిన డిపాజిట్ అమౌంట్ యాదవిధిగా రిటర్న్ లభిస్తుంది.

 

• SCSS  పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు? ( Good Benefits Of  SCSS Scheme?)

1. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసమే రూపొందించబడింది.

2. గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది.  100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది.

3. క్రమం తప్పకుండా ప్రతీ 3 నెలలకు వడ్డీ డైరెక్టుగా మీ ఖాతాలో జామచేయబడుతుంది.

3. ప్రత్యేక ఇన్కమ్ టాక్స్ మినహాయింపు కూడా ఈ స్కీం లో లభిస్తుంది.

4. ఎక్కువ మొత్తంలో అమౌంట్ కలిగిన వారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ స్కీం లో డిపాజిట్ చేసి ప్రశాంత జీవితం కొనసాగించవచ్చు.

5. మిగిలిన సేవింగ్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుంది.

6. నామినీ మరియు ప్రీ మెట్యూర్ క్లోజర్ ఫెసిలిటీలు అందుబాటులో ఉంటాయి.

 

•పోస్ట్ ఆఫీస్ SCSS పథకానికి అర్హులు ఎవరు? (Post Office Senior Citizens Saving Scheme)
•కేవలం భారతదేశ నాగరికత కలిగిన వారికి మాత్రమే ఈ పథకం ఇవ్వబడుతుంది.

•60 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఈ సేవింగ్ పథకంలో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

• NRI ( Non Resident Indians ) HUF ( Hindu  Undivided Family) లకు  అంటే భారతీయులు కాని వారికి ఈ స్కీం వర్తించదు.

•ఒక వ్యక్తి  ఒకటి కంటే ఎక్కువ SCSS అకౌంట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.కానీ అత్యధిక డిపాజిట్ లిమిట్ ని మించి డిపాజిట్ చెయ్యలేరు.అలాగే రెండవ వ్యక్తి భార్య లేదా భర్త అయ్యివుండాలి.

1. భర్త మరియు భార్య కలసి జాయింట్ అకౌంట్ ని ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

2. అలాగే 55 సంవత్సరాలకే  VRS తీసుకొన్న గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

3.ఆర్మీ, మిలిటరీ వంటి  భద్రతా రంగాల్లో రిటైర్డ్ అయిన 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కూడా ఈ స్కీం లో అకౌంట్ ని ఓపెన్ చెయ్యవచ్చు.

 

• SCSS పథకం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ అమౌంట్ ఎంత? ( Deposit Limits Of SCSS  Scheme?)

కనీస డిపాజిట్ అమౌంట్ ( Minimum Deposit )           = Rs 1,000/-
అత్యధిక డిపాజిట్ అమౌంట్  (  Maximum  Deposit )  = Rs 15 lakhs

కాబట్టి SCSS పథకంలో కనీసం Rs=1,000/- రూపాయలు దగ్గర నుంచి  అత్యధికముగా 15 లక్షలు డిపాజిట్ చెయ్యవచ్చు.

ముఖ్య గమనిక  :- ఇక్కడ డిపాజిట్ అమౌంట్ 1000 ని జోడిస్తూ జామచేయవచ్చు.
ఉదాహరణకి 2,000 రూ ||లు , 3,000 రూ ||లు, 4,000 రూ ||లు, 5,000 రూ ||లు  ఇలా అన్నమాట.

 

• పోస్ట్ ఆఫీస్ SCSS పథకంలో ప్రస్తుతం వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( Rate Of Interest % SCSS )

పోస్ట్ ఆఫీస్ SCSS  పథకంలో మీకు ప్రతీ 3 నెలలకు

ఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రకటిస్తుంది. వెంటనే అదే నెల మీ ఖాతాలో జమా చెయ్యడం జరుగుతుంది.

( మార్చ్, జూన్, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలలో..)

ప్రస్తుతం SCSS స్కీం లో 8.20% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్లను గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి  క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

Post Office Monthly Income Scheme In Telugu – ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం కొరకు ఒక్కసారే ఎంత డిపాజిట్ చెయ్యాలి?

• SCSS పథకం మెట్యూరిటీ సమయం? ( Maturity Period Of  SCSC Scheme?)

ఈ సేవింగ్ పథకం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 5 వ సంవత్సరo మొత్తం డిపాజిట్ అమౌంట్ ని ఒక్కసారే మీరు పొందవచ్చు.

ఒకవేళ కావాలనుకొంటే మరొక  సంవత్సరాలు స్కీం యొక్క సమయాన్ని3 పెంచుకోవచ్చు.

 

Example :-

 

•SCSS పథకం యొక్క మెట్యూరిటీ మరియు టాక్స్ ప్రయోజనాలను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం!

 

పేరు  ( Name )                  = Mr. రమణ
వయసు ( Age )                    = 60 సంవత్సరాలు
డిపాసిట్  ( Deposit )          = 5 లక్షలరూపాయలు
ప్రస్తుతం వడ్డీ ( Interest )   = 8.20%

Mr. రమణ కి ప్రతీ 3 నెలలకి Rs.10250/- చొప్పున 5 సంవత్సరాల వరకూ లభించడం జరుగుతుంది.

( 10,250 × 20 = Rs. 2,05,000/- మొత్తం వడ్డీ )

డిపాజిట్ అమౌంట్ 5 లక్షలు యధావిధిగా Mr. రమణ కి స్కీం యొక్క 5 వ సంవత్సరం రిటర్న్ లభిస్తాయి.

 

• SCSS టాక్స్ సదుపాయం  ( Tax Benefits Of SCSS )

ఈ స్కీం లో డిపాజిట్ అమౌంట్ పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80c  వర్తిస్తుంది, కాబట్టి Rs.1,50,000/- వరకూ  టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.

. అలాగే స్కీం లో లభించే వడ్డీ రేట్ సంవత్సరానికి Rs.50,000/- కంటే ఎక్కువ అయితే నియమానుసారంగా TDS charges వర్తిస్తాయి.

.ఒకవేళ సంవత్సరంలో స్కీం ద్వారా లభించే ఆదాయం Rs. 50,000/- కంటే తక్కువ ఐతే ఎటువంటి TDS చార్జెస్ కట్ చెయ్యడం జరగదు.

 

 • లోన్ సదుపాయం? ( Loan Facility?)

SCSS స్కీం లో  మీకు ఎటువంటి లోన్ సదుపాయం లభించడం జరగదు.

• SCSS స్కీంలో వడ్డీ లభించే విధానం?( Interest Credit Process ?)

ఈ స్కీంలో మీకు కాంపౌండ్ ఇంటరెస్ట్ లభించదు, సింపుల్ ఇంటరెస్ట్ లభిస్తుంది. ఈ వడ్డీ డైరెక్ట్ గా మీ సేవింగ్ ఖాతాలో ఇమ్మీడియేట్ గా  ఎప్పటికప్పుడు డిపాజిట్ చెయ్యడం జరుగుతుంది.

కావాలనుకొంటే  ఈ అమౌంట్ ని చెక్ రూపంలో లేదా మనీ ఆర్డర్ రూపంలో కూడా పొందవచ్చు.

 

• ప్రీ మెట్యూరిటీ సదుపాయం? ( Pre Mature Closer Of SCSS Scheme?)

అంటే మెట్యూరిటీ సమయం కంటే ముందే కావాలంటే మీరు మధ్యలోనే SCSS స్కీంని నిలిపివేసి డిపాజిట్ అమౌంట్ ని పొందవచ్చు.

ముఖ్య గమనిక :-

1. స్కీం యొక్క 2సంవత్సరాల లోపు
కనుక అకౌంట్ ని బంద్ చేస్తే డిపాజిట్ అమౌంట్ లో 1.5% ని సర్వీస్ చార్జెస్ రూపంలో కట్ చేసి మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది.

అంటే  Rs.5,00,000/- కి 1.5% శాతం  = Rs.7,500/-

2. ఒకవేళ  స్కీమ్ తీసుకొన్న 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలమధ్య  కనుక అకౌంట్ ని బంద్ చేస్తే డిపాజిట్ అమౌంట్ లో  1% ని సర్వీస్ చార్జెస్ రూపంలో కట్ చేసి మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది.

అంటే  Rs.5,00,000/- కి 1 శాతం  = Rs.5,000/-

 

• నామినీ ఫెసిలిటీ? ( Nominee Facility Of SCSS Scheme?)

ఈ పథకంలో  అమౌంట్ డిపాసిట్ చేసిన వ్యక్తి, పథకం మధ్యలో ఏదైనా కారణంగా అంటే  సాధారణంగా కానీ లేదా ఆక్సిడెంట్ కారణంగా గాని మరణిస్తే, డిపాజిట్ ను నామినీకి పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఆ తర్వాత ఈ పథకం నిలిపివేయబడుతుంది.

• SCSS సేవింగ్ పథకాన్ని ఎక్కడ ఓపెన్  చెయ్యాలి?( How to Open ?)

మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ శాఖలో అయినా   సరే  SCSS అకౌంట్ ని సులభంగా ఓపెన్ చెయ్యవచు.

గుర్తింపు పొందిన అన్ని జాతీయ బ్యాంకుల్లో ( All Nationalised Banks )

ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ స్కీం ని ఓపెన్ చెయ్యవచ్చు.  (  Available In All Private Banks)

 

•SCSS పథకానికి  కావలసిన డాకుమెంట్స్ ఏమిటి? ( Documents Required?)

• SCSS అప్లికేషన్ ఫారం      (SCSS Form )
     •   గుర్తింపు వివరాలకై          (  Identity  Proof )
1. ఓటర్ ఐడి                      ( Voter ID )
2. పాన్ కార్డు                       ( PAN Card )
3. పాసుపోర్టు                     ( passport )
4. డ్రైవింగ్ లైసెన్స్          (Driving License )

( వీటిలో ఏదో ఒకటి  ఉంటే సరిపోతుంది )

2  పాస్ పోర్ట్ సైజు ఫోటోలు              ( Recent Photos )
పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై      ( Address Proof )
1. కరెంటు బిల్                                ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్                             ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్                       ( Bank Statement )

 

• ఖాతా బదిలీ సదుపాయం? ( Transfer Facility Of SCSS Scheme?)

SCSS అకౌంట్ ని మీరు ఒక పోస్ట్ ఆఫీస్  బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్ కి  అతి సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

 

https://www.indiapost.gov.in/

 

   ప్రశ్నలు – సమాధానాలు ( Question &Answers )

 

SCSS స్కీం ఆన్లైన్లో తీసుకొనే సదుపాయం ఉంటుందా? ( Can SCSS scheme be taken online ?)

Ans:    ఉంటుంది, Yes. అయినప్పటికీ పోస్ట్ ఆఫీస్ ను లేదా బ్యాంకును ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది.

 

2. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ SCSS అకౌంట్స్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చా? ( Can a person take more than one SCSS accounts?)

Ans:   వర్తించదు. No.

 

3. ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చేయడానికి యొక్క అత్యధిక వయసు ఎంత? ( What is the maximum age of SCSS scheme? )

Ans:   60 సంవత్సరాలు పైబడిన వారందరూ అర్హులే.( Above 60 years )

4. భార్య మరియు భర్త విడివిడిగా అకౌంట్స్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చా? ( Can the spouse deposit the amount in this scheme Separately?)

Ans:   చెయ్యవచ్చు. Yes.

5. SCSS స్కీంలో లభించే వడ్డీమీద TDS ( Tax Deduction Charges ) వర్తిస్తాయా? ( Are TDS charges applicable on interest in SCSS scheme?)

Ans:   వర్తిస్తాయి. Yes  ఈ స్కీం ద్వారా సంవత్సరానికి Rs  10,000/- కంటే ఎక్కువ వడ్డీ మీరు పొందుతున్నట్లయితే TDS చార్జలు వర్తిస్తాయి.

6. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన వారిలో ఒకవ్యక్తి మరణిస్తే అకౌంట్ కొనసాగుతుందా? ( Will the account continue if the person dies in the joint account ?)

Ans:   కొనసాగుతుంది. Yes.

7. SCSS స్కీం యొక్క సమయాన్ని 5 సంవత్సరాల తర్వాత పొడిగించవచ్చా? ( Is the scheme period extended in this scheme ?)

Ans:   ఖచ్చితంగా 3 సంవత్సరాల వరకూ పొడిగించవచ్చు. Yes.

8. భారతీయులు కానీ వారికి ఈ స్కీం వర్తిస్తుందా? ( Does this scheme apply to NRI’s?)

Ans:   వర్తించదు. No.

9. SCSS స్కీం లో ఆదాయం ఏవిధంగా లభిస్తుంది? ( How to earn income in this SCSS Scheme ?)

Ans:  ప్రతీ 3 నెలలకి ఒకసారి. ( Every 3 Months )

10. పోస్ట్ ఆఫీస్ తో పాటుగా ఇతర బ్యాంకుల్లో ఈ స్కీం యొక్క అకౌంట్ ఓపెన్ చేయవచ్చా? ( Can i open a SCSS account in other banks ?)

. Yes.

 

 

 

 

ముగింపు  ( Conclusion )

పోస్ట్ ఆఫీస్  SCSS స్కీం కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *