Post Office NSC Scheme In Telugu – తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ అందించే పథకం

               Post office NSC scheme in Telugu

Post Office interest rate april 2023

 

నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా పెట్టుబడుల విషయంలో చాలా ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం మీరు మీ ఆర్థిక లక్ష్యాల ప్రకారం ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.  నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లేదా NSC పేరుతో పిలవబడే ఈ  పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్రొడక్ట్ బాగా ప్రచారం పొందిన మరియు ప్రజల ఆదరణ పొందిన ఒక ప్రధాన ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే  తక్కువ రిస్క్ తో కూడిన పెట్టుబడిగా, ఇది అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది ఒక స్థిరమైన  ఆదాయం అందించే ఒక మంచి ఆర్ధిక పరమైన పెట్టుబడి పథకం. మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ శాఖలో ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాను తీసుకోవచ్చు. ఈ పథకం ను  భారత ప్రభుత్వం ప్రత్యేకంగా  చొరవ తీసుకుని అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ప్రవేశపెట్టింది. ప్రధానంగా చిన్న స్థాయి నుండి మధ్య స్థాయి ఆదాయ పెట్టుబడిదారులు మరియు ఆదాయపు పన్నును ఆదా చేసేవారు  పెట్టుబడి పెట్టడానికి ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.

ఈ పథకం కూడా తక్కువరిస్క్ మరియు  స్థిరమైన ఆదాయ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. మీరు ఈ NSC యొక్క ఖాతా కోసం సమీప పోస్టాఫీసు నుండి, మైనర్ పేరుతో  లేదా  వయోజనుడి పేరుతో విడిగా లేదా జాయింట్ అకౌంట్ పేరుతో  నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కొనుగోలు చేయవచ్చు.

ఈ NSC పథకం ఐదు సంవత్సరాల స్థిరమైన మెచ్యూరిటీ కాలాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ NSC ల కొనుగోలుపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు, కానీ రూ .1.5 లక్షల వరకు పెట్టిన పెట్టుబడులు మాత్రమే మీకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు.  నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లు స్థిరమైన వడ్డీని అందిస్తున్నాయి.  NSC యొక్క వడ్డీ రేటు ప్రస్తుత సంవత్సరానికి 6.8% చొప్పున ఉన్నది.  ఈ వడ్డీ రేటును ప్రభుత్వం క్రమం తప్పకుండా సవరిస్తూ ఉంటుంది.

 

Post Office NSC Scheme In Telugu - తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ అందించే పథకం

 

• పోస్ట్ ఆఫీస్ NSC పథకం అంటే ఏమిటి? ( What is The Post Office NSC Scheme?)

NSC అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో ఇది కూడా ఒకటి . ఈ పథకంలో  పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఒక సర్టిఫికెట్ లభిస్తుంది.
ఎవరైతే మంచి రిటర్న్ తోపాటు టాక్స్ సేవింగ్ చెయ్యాలనుకుంటున్నారో వారికి ఇది మంచి సేవింగ్ స్కీం.

 

•NSC పథకం యొక్క  ముఖ్య ఉద్దేశం, పనిచేసే విధానం? ( How does Post Office  NSC Scheme Work? )

ఈ పథకంలో ఒక్కసారే కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చెయ్యడం ద్వారా మీకు  NSC సర్టిఫికెట్ లభిస్తుంది.
మెట్యూరిటీ సమయంలో ప్రారంభంలో మీరు  డిపాజిట్ చేసిన( అమౌంట్  + మొత్తం వడ్డీని) కలిపి మీకు పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది.

 

• NSC  పథకం ముఖ్య ప్రయోజనాలు? ( Good Benefits Of NSC Scheme?)

1. గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది.  100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది.

2. క్రమం తప్పకుండా సమయానికి వడ్డీ జామచేయబడుతుంది.ప్రతీ సంవత్సరం లభించే వడ్డీ పై కూడా తర్వాత సంవత్సరం వడ్డీ లభిస్తుంది.

3. ఒక చిన్న అమౌంట్  ద్వారానే  మధ్యతరగతివారు సురక్షితంగా పొదుపును  ప్రారంభించవచ్చు.

4. ఈ NSC సర్టిఫికెట్ ద్వారా అత్యవసర సమయలో బ్యాంకులు మీకు లోన్ కూడా అందిస్తాయి.

5. ప్రత్యేకంగా ఇన్కమ్ టాక్స్ మినహాయింపు కోసం ఈ  పథకం రూపొందించబడింది.

 

•పోస్ట్ ఆఫీస్ NSC పథకానికి అర్హులు ఎవరు? ( Who can Open The Account? )

.కేవలం భారతదేశ నాగరికత కలిగిన వారికి మాత్రమే ఈ పథకం ఇవ్వబడుతుంది.

.ప్రతీ ఒక్కరూ ఈ సేవింగ్ పథకాన్ని Open    చేసే    సదుపాయం ఉంటుంది.

.ఒక వ్యక్తి కటికంటే ఎక్కువ NSC అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యవచు.

.10 సంవత్సరాలలోపు పిల్లలు  మరియు చెవిటి, మూగ సమస్యలు కలిగిన పిల్లలకు తండ్రి ద్వారా ఖాతాని  నిర్వహించడం జరుగుతుంది.

.అలాగే 3 వ్యక్తుల వరకూ అత్యధికంగా జాయింట్ అకౌంట్ ని కూడా  ఓపెన్ చెయ్యవచ్చు.

.NRI ( Non Resident Indians ) HUF ( Hindu  Undivided Family) లకు  అంటే భారతీయులు కాని వారికి ఈ స్కీం వర్తించదు.

• NSC పథకం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ అమౌంట్ ఎంత? ( Deposit Limits Of NSC Scheme?)

కనీస డిపాజిట్ అమౌంట్       ( Minimum Deposit )     – 1,000/-
అత్యధిక డిపాజిట్ అమౌంట్( Maximum Deposit )    – పరిధి లేదు.

కాబట్టి NSC పథకంలో కనీసం 1,000 రూపాయలు దగ్గర నుంచి అత్యధికముగా ఎంతైనా డిపాజిట్ చెయ్యవచ్చు.

ముఖ్య గమనిక  :- ఇక్కడ డిపాజిట్ అమౌంట్ 100 ని జోడిస్తూ జామచేయవచ్చు.
ఉదాహరణకి 1,100 రూ ||లు , 1,200 రూ ||లు, 1,300 రూ ||లు, 1,400 రూ ||లు…ఇలా అన్నమాట.

 

• పోస్ట్ ఆఫీస్ NSC పథకంలో ప్రస్తుతం వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( Rate Of Interest % )

పోస్ట్ ఆఫీస్ NSC  పథకంలో మీకు ప్రతీ 3 నెలలకుఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రకటిస్తుంది.ఈ వడ్డీమొత్తం సంవత్సరానికి ఒక సారి జమా అవుతుంది.

 

( మార్చ్, జూన్, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలలో..)                         

ప్రస్తుతం NSC స్కీం లో 7.70% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్లను గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి  క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.

 

Post Office Monthly Income Scheme In Telugu – ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం కొరకు ఒక్కసారే ఎంత డిపాజిట్ చెయ్యాలి?

Sukanya Samriddhi Yojana In Telugu – ఆడపిల్లల విద్యా, వివాహానికి అద్భుతమైన గవర్నమెంట్ స్కీం Rs 2,50/- రూ ||ల కే

• NSC పథకం మెట్యూరిటీ సమయం? ( Maturity Period Of  NSC Scheme?)

ఈ సేవింగ్ పథకం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 5 వ సంవత్సరo మొత్తం మెట్యూరిటీడబ్బులను ఒక్కసారే మీరు పొందవచ్చు.

 

NSC Scheme Example

 

•NSC పథకం యొక్క మెట్యూరిటీ మరియు టాక్స్ ప్రయోజనాలను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం!

వయసు ( Age )                     = 30 సంవత్సరాలు
డిపాసిట్  ( Deposit )          = 5 లక్షలరూపాయలు
ప్రస్తుతం వడ్డీ ( Interest )  = 7.70%

మొత్తంమెట్యూరిటీవచ్చి ( Maturity)=Rs.7,24,517/-

Total Interest Received =Rs  224517

•NSC టాక్స్ సదుపాయం  ( Tax Benefits Of NSC?)

NSC పథకంలో మీరు డిపాజిట్ చేసే అమౌంట్ పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80c వర్తిస్తుంది.
    కాబట్టి అత్యధికముగా 1,50,000/- వరకూ టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.

అదేవిధంగా  డిపాసిట్ అమౌంట్ పై లభించే వడ్డీ రేట్ పై కూడా మొదటి 4 సంవత్సరాలు  క్రాస్ సెక్షన్ రూపంలో( 80c ) ఎటువంటి టాక్స్      విధించబడదు.

అంటే ప్రస్తుతం వడ్డీ రేట్ ప్రకారం మొదటి సంవత్సరం  5 లక్షల రూపాయలకి లభించే వడ్డీ + డిపాజిట్ ను ఆధారంగా చేసుకొని ఆ తర్వాత సంవత్సరం వడ్డీని అందిస్తారు. ఈ విధంగా కాంపౌండ్ ఇంటరెస్ట్ లభిస్తుంది.

5 వ సంవత్సరం మాత్రమే నియామనుసారంగా టాక్స్ వర్తిస్తుంది.

 

• లోన్ సదుపాయం? ( Loan Facility?)

ఈ పథకంలో లభించిన NSC సర్టిఫికెట్ ద్వారా అత్యవసర సమయంలో లోన్ పొందాలనుకుంటే, ఈ  సర్టిఫికెట్ ని బ్యాంకులో జమాచేసి లోన్ పొందవచ్చు.

ముఖ్య గమనిక :- NSC స్కీం మాట్యూరిటీ సమయంలో ఈ సర్టిఫికెట్ ను పోస్ట్ ఆఫీస్ లో కచ్చితంగా జమా చెయ్యాలి. అప్పుడే మీకు మెట్యూరిటీ లభిస్తుంది.

 

ప్రీ మెట్యూరిటీ సదుపాయం? ( Pre Mature Withdrawal Of NSC Scheme?)

అంటే మెట్యూరిటీ సమయం కంటే ముందే కావాలంటే మీరు మధ్యలోనే  NSC స్కీంని  నిలిపివేసి డిపాజిట్ అమౌంట్ ని పొందవచ్చు.
కేవలం రెండు సందర్భాలలో మాత్రమే ఈ ప్రీ మెట్యూర్ సదుపాయం ఉంటుంది.

• పాలసీదారుడు లేదా పాలసీదారులు ( జాయింట్ అకౌంట్ ) మరణించినప్పుడు.

• ఏదైనా ఆర్థిక లావాదేవిలా షరతులు ప్రకారం కోర్ట్ ఆదేశాన్ని జారీ చేసినప్పుడు.

ఈ రెండు సందర్భాలలో మాత్రమే ప్రీ మెట్యూర్ సదుపాయం ఉంటుంది.

 

• నామినీ ఫెసిలిటీ? ( Nominee Facility Post Office NSC Scheme?)

ఈ పథకంలో  అమౌంట్ డిపాసిట్ చేసిన వ్యక్తి, పథకం మధ్యలో ఏదైనా కారణంగా అంటే  సాధారణంగా కానీ లేదా ఆక్సిడెంట్ కారణంగా గాని మరణిస్తే, డిపాజిట్ అమౌంట్ + అప్పటివరకు లభించే వడ్డీ రేట్ ను కలిపి నామినీకి పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఆ తర్వాత ఈ పథకం నిలిపివేయబడుతుంది.

 

• NSC సేవింగ్ పథకాన్ని ఎక్కడ ఓపెన్  చెయ్యాలి?( Where do you open the NSC account?)

1.  మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ శాఖలో అయినా   సరే NSC అకౌంట్ ని సులభంగా ఓపెన్ చెయ్యవచు.

2. Private Sector Banks

3. Any Nationalised Banks

 

NSC Scheme Question & Answers

 

1. NSC కు  ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది?

జ. NSC  ఇష్యూ VIII కొనుగోలు చేసే వారికి    ఐదేళ్ల కాలపరిమితితో ఉంటుంది.

2. నేను నా NSC ID  తెలుసుకోవడం ఎలా?

జ. మీరు మీ NSC ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి లాగిన్ వివరాలు అవసరం.  ఈ వివరాల కోసం మీ NSC అకౌంట్ ఉన్న   బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌ని సంప్రదించాలి.

3. NSC  కొనుగోలు కోసం చెల్లించే కనీస మొత్తం ఎంత?

జ. NSC కొనుగోలు కోసం  అవసరమైన కనీస మొత్తం రూ .1,000.  ఒకవేళ మీరు అధిక మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే, మీరు దానిని రూ .100 యొక్క మల్టిపుల్స్‌లో చేయవచ్చు. ముఖ్యంగా  మీరు డిపాజిట్ చేసే మొత్తానికి గరిష్ట పరిమితి ఏమీ లేదు.

4. NSC అకౌంట్ ని ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ ఆఫీస్‌కు  బదిలీ ఎలా చేయాలి?

జ. NSC  ఖాతాను ఒక పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ నుండి మరొక పోస్ట్ బ్రాంచ్‌కు బదిలీ చేయడానికి, మీరు పాత బ్రాంచ్ లేదా కొత్త బ్రాంచ్‌లో అప్లికేషన్  ను అందజేయాలి. ఇంకా, జాయింట్ A లేదా B అకౌంట్ రకం విషయంలో NSC ఖాతా లో ఉన్న  ఖాతాదారులందరి సంతకాలతో కూడిన  అప్లికేషన్ ను ఇవ్వవలసి ఉంటుంది.

5. నేను NSC సర్టిఫికేట్ ఎలా పొందాలి?

జ. సరైన KYC డాక్యుమెంట్‌లతో పాటు NSC ఖాతాను తెరవడానికి మీరు అప్లికేషన్  ఫారమ్‌ను సమర్పించి, తర్వాత మీరు దాని కోసం అమౌంట్  చెల్లింపు చేయాలి. ఈ  ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత, పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మీకు NSC సర్టిఫికెట్‌ను అందిస్తుంది.

 

 •NSC పథకానికి  కావలసిన డాకుమెంట్స్ ఏమిటి? ( Documents Required?)

NSC అప్లికేషన్ ఫారం      (NSC Form )

  • గుర్తింపు వివరాలకై  (  Identity  Proof )

1. ఓటర్ ఐడి          ( Voter ID )
2. పాన్ కార్డు          ( PAN Card )
3. పాసుపోర్టు          ( passport )
4. డ్రైవింగ్ లైసెన్స్    (Driving License )

( వీటిలో ఏదో ఒకటి  ఉంటే సరిపోతుంది )

2 ఫోటోలు              ( Recent Photos )

 

• పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై   ( Address Proof )

1. కరెంటు బిల్      ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్     ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్  ( Bank Statement )

 

• ఈ పథకానికి పాస్ బుక్ సదుపాయం లభిస్తుందా? ( Available NSC Pass Book In Post Office?)

  లభిస్తుంది. ప్రారంభంలో మీకు అందిస్తారు.

 

• ఖాతా బదిలీ సదుపాయం? ( Transfer Facility Of NSC Scheme?)

NSC అకౌంట్ ని మీరు ఒక పోస్ట్ ఆఫీస్  బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్ కి  అతి సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

 

• NSC  పాస్ బుక్ ని ఏదైనా కారణంగా కోల్పోయినట్లయితే ఏం చెయ్యాలి? ( Loss Of  NSC Certificate??)

ఏదైనా కారణంగా మీరు ఈ NSC సర్టిఫికెట్ ని పోగొట్టుకున్నట్లయితే నకిలీ NSC పాసుబుక్ ని పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందవచ్చు. దీనికోసం కొద్దిగ కనీస చార్జెను  ని చెల్లించాల్సివుంటుంది.

https://www.indiapost.gov.in/

 

ముగింపు  ( Conclusion )

 

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *