LIC Jeevan Labh Policy 936 Details Telugu
LIC Jeevan Labh Policy 936
LIC Jeevan Labh 936 – జీవన్ లాబ్ అత్యధిక బోనస్ ని అందించే పాలసీల్లో ఒకటి , ఈ ప్లాన్ ద్వారా మంచి పొదుపు తోపాటు లైఫ్ ప్రొటెక్షన్ పాలసీదారునికి లభించడం జరుగుతుంది . లిమిటెడ్ ప్రీమియం ( ప్లాన్ సమయం కంటే తక్కువ సం||లు ) మరియు నాన్ లింక్ ( షేర్ మార్కెట్ తో సంబంధం లేని ) ఇటువంటి విభిన్న ప్రయోజనాలను పాలసీదారునికి అందించే ఎండోమెంట్ స్కీమ్ . దీనితో పాటుగా మెట్యూరిటీ, డెత్ బెనిఫిట్స్ తోపాటు అడిషనల్ బెనిఫిట్ రైడర్స్ ను నచ్చిన విధంగా పాలసీదారుడు నిర్ణయం చేసుకొనే వీలుంటుంది.
• LIC జీవన్ లాబ్ పాలసీ ఎలా పనిచేస్తుంది – How Does LIC Jeevan Labh Works?
టేబుల్ నెంబర్ – 936, పాలసీ సమయం నిర్ణయం చేసుకొని దానికంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. వ్యక్తి కి రిస్క్ జరగకపోతే పాలసీ సమయం ముగియగానే మెట్యూరిటీ, ఒకవేళ మధ్యలో రిస్క్ జరిగితే డెత్ బెనిఫిట్స్ లభించడం జరుగుతుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ లభిస్తుంది.
అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? – Key Features
1. ఈ ఒక్క పాలసీ ద్వారానే పాలసీదారునికి ఇన్వెస్ట్మెంట్ + ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
2. మెట్యూరుటి మరియు మరణ ప్రయోజనాలు లభిస్తాయి.
3. పాలసీదారునికి లిమిటెడ్ ప్రీమియం(Limited Premium Payment ) చెల్లించే అవకాశం ఉంటుంది
మరియు భీమా, ప్రీమియం పై రిబేట్ లభిస్తుంది.
4. పాలసీలో బోనస్ రెవేసినరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ ( Reversionary Bonus + Final Additional Bonus ) రూపంలో LIC అందిస్తుంది.
5. అతితక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా 4 బెనిఫిట్ రైడర్స్ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు టాక్స్, సరెండర్, లోన్, సెటిల్మెంట్ ఇలా విభిన్నబెనిఫిట్స్ వర్తించడం జరుగుతుంది.
LIC New Jeevan Labh Benefits -విభిన్నబెనిఫిట్స్ 936
• ప్రస్తుత బోనస్ – Bonus Rate
LIC బోనస్ రేట్లను సంవత్సరానికి ఒకసారి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు అందిస్తుంది.
బోనస్ రేట్స్ వేరు వేరు పాలసీలకు వేరే వేరు గా లభిస్తాయి మరియు లభించే బోనస్ పాలసీ యొక్క సమయం పై ఆధారపడి ఉంటాయి.
పాలసీ సమయం బోనస్ ( 2021 – 2022)
16 సంవత్సరాలు – 40/1000
16 నుంచి 21 సం||ల మధ్య – 44 /1000
21 సంవత్సరాలు పైబడి – 47/1000
ఇక్కడ బోనస్ ప్రతీ 1000 రూపాయలు కి లభిస్తుంది, లక్ష రూపాయల పాలసీని 20 సంవత్సరాలకు తీసుకొంటే 1,00,000 ÷ 1000 × 44 =Rs 4400/-.
ఈ సంవత్సర బోనస్ అవుతుంది.
LIC Jeevan Lakshya Plan In Telugu విద్యా,వివాహం ,వ్యాపారానికి అద్భుతమైన పాలసీ అర్హతలు ఇవే !
LIC Jeevan Amar 855 Telugu – అద్భుతమైన పాలసీ రోజుకి 18/- రూ ||లకే 25 లక్షల భీమా!
• అర్హులు ఎవరు? – LIC Jeevan Labh Eligibility
Eligibility | Minimum | Maximum |
Age | 8 Years | 59 Years |
Policy Period | 16 Years | 25 Years |
Sum Assured | 2,00,000 | No Limit |
Premium Paying | 10 Years | 16 Years |
Maximum Maturity Age | 75 Years | 75 Years |
టేబుల్ వివరాలు:-
పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =08 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) వచ్చి..
59 సం||లు – 16 సంవత్సరాల పాలసీ సమయం
54 సం||లు – 21 సంవత్సరాల పాలసీ సమయం
50 సం||లు – 25 సంవత్సరాల పాలసీ సమయం.
• పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? – Policy Term
కనీస పాలసీ సమయం వచ్చి (Minimum Policy Period ) = 16 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం ( Maximum Policy Period ) = 25 సంవత్సరాలు.
అందువల్ల ఈ పాలసీ యొక్క సమయాన్ని 15 నుంచి 35 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.
• భీమా పరిమితులు? – Sum Assured
ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి =Rs 1, 00, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి కి ఎటువంటి అవధి లేదు.
లక్ష రూపాయలు నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు.
• గరిష్ట మెట్యూరిటీ సమయం ? – Maximum Maturity Age
ఈ పాలసీయొక్క అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 75 సంవత్సరాలు గా ఉంటుంది.
అంటే ఈ పాలసీ, మనకి 75 సంవత్సరాలు వచ్చే లోపు ముగిసేలా పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి.
• ప్రీమియం చెల్లింపులు – Premium Paying Mode
ఈ పాలసీలో 4 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా
• ప్రీమియంపై డిస్కౌంట్ ఎంత లభిస్తుంది? – Rebate
1. సంవత్సరానికి ఒకసారి – Yearly = 2%
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly = 1%
3. 3 నెలలకు ఒకసారి – Quarterly = Nil
4. ప్రతినెలా
ఈ పాలసీలో సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.
• పాలసీలో భీమాపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? – Rebate On Sum Assured?
భీమా ( Basic Sum Assured ) రిబేట్
1. 2, 00, 000 నుంచి 4, 90, 000 = Nil
2. 5, 00, 000 నుంచి 9, 90, 000 = 1.25%
3. 10, 00, 000 నుంచి14, 90, 000 = 1.50%
4. 15, 00, 000 నుంచి అత్యధికముగా = 1.75%
ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో మీకు రిబేట్ లభిస్తుంది.
అడిషనల్ బెనిఫిట్ రైడర్స్ – LIC Jeevan Labh Policy 936 Benefit Riders
1. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ Premium Waiver Benefit Rider – UIN 512B204V03
జీవన్ లాబ్ పాలసీని 18 సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకొన్నప్పుడు ఈ ప్రయోజనం లభిస్తుంది.పాలసీ తీసుకొనే సమయంలోనే ఈ రైడర్ ను తీసుకోవాల్సి ఉంటుంది మధ్యలో లభించదు.
పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ప్రపోసర్ గా ఉంటాడు, పిల్లలు పాలసీదారులు అవుతారు.
పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ఏదైనా కారణం చేత మరణించినా లేక క్రిటికల్ ఇల్నెస్ కి గురిఅయిన భవిష్యత్ ప్రీమియం అంతా కంపెనీ మాఫీ చేస్తుంది, అయినప్పటికీ పాలసీ యొక్క అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
2. ఆక్సిడెంట్ డెత్ మరియు డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ – Accidental Death And Disability Benefit Rider – UIN 512B209V02
రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.
ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.
పాలసీదారునికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ ఇది మొదటి ప్రయోజనం.
ముఖ్య గమనిక : ఈ ప్రయోజనం కొరకు ఆక్సిడెంట్ జరిగిన 180 రోజులు లోపు మీరు సంస్థకి సమాచారాన్ని అందివ్వాల్సివుంటుంది
ఆక్సిడెంట్ లో మరణించలేదు, డిజాబిలిటీ కి గురయ్యాడు ఈ సందర్భంలో కూడా పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది, దీనితోపాటుగా ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని పాలసీదారునికి ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు అందివ్వడం జరుగుతుంది.
3. టర్మ్ రైడర్ – Term Rider – UIN 512B210V01
ఈ రైడర్ను పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.
పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే తీసుకొన్న భీమాకి సమానమైన అమౌంట్ నామినీకి అదనంగా లభిస్తుంది.
4. కొత్త క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ – Critical Illness Benefit Rider – UIN 512A212V01
ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో ఆరోగ్య భీమా ప్రయోజనం కలిగిస్తుంది. పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.
దీనికోసం LIC సంస్థ గంభీరమైన వ్యాధులకు సంబందించిన ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
ఈ రైడర్ నిమిత్తము కొద్దిగా ప్రీమియంని అదనంగా చెల్లించాలి.
•సెటిల్మెంట్ చెల్లింపులు – Installment Amount
స్కీమ్ లో లభించే మెట్యూరిటీ లేదా మరణ ప్రయోజనాలను ఒక్కసారే లేకపోతే వాయిదాల పద్దతిలో కనీసం ఈ కింద విధంగా పొందవచ్చు.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly = Rs 50,000
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly = Rs 25,000
3. 3 నెలలకు ఒకసారి – Quarterly = Rs 15,000
4. ప్రతినెలా
ఈ విధంగా నామినీ సెటిల్మెంట్ ఆప్షన్ ని చేసుకోవచ్చు.
LIC జీవన్ లాబ్ ఉదాహరణ – LIC Jeevan Labh Policy 936
పాలసీదారుని పేరు – Mr.రతన్
వయసు – 30 సంవత్సరాలు
పాలసీ సమయం – 25 సంవత్సరాలు
జీవన్ ఆనంద్ భీమా – 5 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం – ప్రతినెలా
నెలసరి ప్రీమియం – Rs 1,988/-( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి )
Mr. రతన్ 25 సంవత్సరాల పాలసీ సమయం నిర్ణయం చేసుకుకొన్నాడు కాబట్టి 16 సంవత్సరాలు మాత్రమే ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తాడు!
ఈ పాలసీలో చెల్లించే ప్రీమియంపై 30% టాక్స్ డెడక్షన్ లభిస్తుంది, అందువల్ల ప్రతి సంవత్సరం టాక్స్ డేడిక్షన్ క్లెయిమ్ = Rs 7,166/- చేసుకోవచ్చు.
అదేవిధంగా పాలసీలో 16 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 3,74,483/-
• మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit
జీవన్ లాబ్ ప్లాన్లో మెట్యూరిటీ ఈ కింద విధంగా లభిస్తుంది.
మెట్యూరిటీ = ప్రాథమిక భీమా + వెస్టెడ్ బోనస్ + ఫైనల్ బోనస్
“Maturity = Basic Sum Assured + Reversionary Bonus + Final Additional Bonus ”
ప్రాధమిక భీమా ( Sum Assured ) = Rs 5, 00, 000
రెవేసినరీ బోనస్ = Rs 5,87,500
( Simple Bonus )
ఫైనల్ అడిషనల్ బోనస్ = Rs 2, 25, 000
( Final Additional Bonus )
మొత్తం కలిపి =Rs 13,12,500 /– Mr. రతన్ కు ఈ పాలసీలో మెట్యూరిటీగా లభిస్తాయి. ఎల్. ఐ. సి. జీవన్ లాబ్ పిల్లలు భవిష్యత్ కి మార్గదర్శకంగా భావించవచ్చు.
. మరణం ప్రయోజనం – Death Benefit
పాలసీ సమయంలో పాలసీదారునికి ఏమైనా రిస్క్ జరిగితే నామినీ కి రిస్క్ కవర్ ఈ విధంగా లభిస్తుంది.
1. ప్రాథమిక భీమా 5 లక్షలు,
2. చెల్లించే వార్షిక ప్రీమియం కి 7 రేట్లు,
3. చెల్లించిన మొత్తం ప్రీమియం కి 105% వీటిలో ఏది ఎక్కువగా ఉంటే అది నామినీ కి అందివడం జరుగుతుంది, పాలసీదారునికి రిస్క్ ఎప్పుడు జరిగినా ఇదేవిధంగా ప్రయోజనం వర్తిస్తుంది.
• లభించే టాక్స్ ప్రయోజనాలు – Tax Benefits?
చెల్లించే ప్రీమియంపై టాక్స్ స్లాబ్ అండర్ సెక్షన్ 80c వర్తించడం ద్వారా ప్రతీ సంవత్సరo 1,50,000/- వరకూ టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.
అలాగే పాలసీలో లభించే మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది, కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు మొత్తం అమౌంట్ టాక్స్ రహితంగా అందివ్వడం జరుగుతుంది.
• మెట్యూరిటీ సెటిల్మెంట్ విధానం – Maturity Settlement
1. ఈ విధానం ద్వారా మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.
2. లేదా వాయిదాల పద్దతిలో 5, 10, మరియు 15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి లభించేలా నిర్ణయించుకొనే సదుపాయం ఉంటుంది. నిర్ణయించుకొన్న విధంగా నే విధంగానే మీకు రెగ్యులర్ గా ఈ మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.
ముఖ్య గమనిక : ఈ ఎంపికను పాలసీదారుడు పాలసీ సమయం 3 నెలలు మిగిలి ఉండగానే సంస్థకి తెలియచేయాల్సి ఉంటుంది.
• జీవన్ లాబ్ పాలసీని ఎలా తీసుకోవాలి? కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటీ? – How to Apply & Documents Required?
ఈ పాలసీని మీరు LIC ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా
ఆఫ్ లైన్ లో ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.
• కావలసిన పత్రాలు – Documents
1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం.
2. ఆధార్ కార్డు – ( Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు – ( Address Proof )
4. పాన్ కార్డు – ( KYC Verification )
5. మెడికల్ రిపోర్ట్ – ( Health Condition )
• లోన్ సదుపాయం – Loan Facility
పాలసీదారుడు కనీసం 2 సంవత్సరాలు అంతరాయం లేకుండా పూర్తి ప్రీమియం చెల్లిస్తే , అత్యవసర పరిస్థితుల్లో జమ చేసిన ప్రీమియం పై లోన్ పొందవచ్చు.
• గ్రేస్ పీరియడ్ – Grace Period
ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది. ఈ పాలసీలో సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
గమనిక : ఈ సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించడం గాని, ఇన్సూరెన్స్ కవరేజ్ కోల్పోవడం గాని జరగదు.
• పాలసీకి పైడ్ అప్ వేల్యూ – Paid UP Value
LIC జీవన్ లాబ్ పాలసీలో రెగ్యులర్ గా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించి, తర్వాత ఏదైనా కారణంగా పాలసీలో ప్రీమియం చెల్లించడం మానివేసినప్పటికీ ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన ప్రీమియంని ఆధారంగా చేసుకొని పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి లభించడం జరుగుతుంది.
గమనిక :- ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఉండాలి.
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ – Revival Facility
పాలసీదారుడు ఏదైనా కారణంగా పాలసీలో 5 సంవత్సరాలు వరుసగా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది అదేవిధంగా ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
• ఫ్రీ లుక్ పీరియడ్ 15 రోజులు – Free Look Period
పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై మీరు అసంతృప్తి చెందినట్లైతే వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన మీ ప్రీమియంని వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు విధించబడవు.
ముఖ్య గమనిక : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే ప్రీమియం పై సర్వీస్ చార్జీలు వసూలుచేయబడతాయి.
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ – Surrender Value
పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే జీవన్ లాబ్ పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకుకట్టిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.
కానీ పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది.
వెబ్సైటు ను సందర్శించినందుకు ధన్యవాదములు .