LIC Dhan Rekha Plan Telugu 863 – “కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్ ” ధన్ రేఖ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చెయ్యండి.

       LIC Dhan Rekha Plan Details In  Telugu – 863

 

LIC సరికొత్త విధానంలో అద్భుతమైన పాలసీని డిసెంబర్ 2021 న ప్రారంభం చేసింది,ప్లాన్ పేరు LIC ధన్ రేఖ – టేబుల్ నెంబర్ 863 – పొదుపు కి 100% ఖచ్చితమైన రాబడి అందివ్వడం స్కీం యొక్క ముఖ్య ఉద్దేశ్యం .  ధన్ రేఖ ప్లాన్ నాన్ లింకేడ్, నాన్ పార్టిసిపేట్, ఇండివిడ్యుఅల్ సేవింగ్ & మనీ బ్యాక్ స్కీమ్ (Non Linked, Non Participating, Saving & Money Back Scheme ) స్టాక్ మార్కెట్ తో ఎటువంటి సంబంధం లేకుండా గ్యారెంటెడ్ అడిషన్, మనీ బ్యాక్ తో పాటుగా 100 శాతం సమ్ అస్సుర్డ్ రూపంలో మెట్యూరిటీ ని అందిస్తుంది.దీని
తోపాటుగా లిమిటెడ్ ప్రీమియం మరియు అత్యధిక ద్దీర్ఘ కాల భీమా ప్రొటెక్షన్, కనీసం 3 నెలల వయసు కలిగిన వారు కూడా పాలసీకి అర్హులు.

 

LIC Dhan Rekha Plan Telugu 863 - "కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్ " ధన్ రేఖ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చెయ్యండి.

 

 

• LIC ధన్ రేఖ పాలసీ ఏ విధంగా పనిచేస్తుంది – How Does LIC Dhan Rekha Works?

నిర్ణయించుకొన్న పాలసీ సమయంలో సగం సమయం మాత్రమే పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తాడు అయినప్పటికీ పాలసీ యొక్క మొత్తం ప్రయోజనాలు చివరివరకు వర్తిస్తాయి . పాలసీ మధ్యలో  ఒక నిర్నీత సమయం నుంచి ప్రాథమిక భీమా పై రెగ్యులర్ గా ఖచ్చితమైన మనీ బ్యాక్ ( Money Back ) లభిస్తుంది, దీనితోపాటుగా చివర్లో మెట్యూరిటీ యదావిధిగా అందివ్వడం జరుగుతుంది ఒకవేళ  పాలసీ మధ్యలో పాలసీదారునికి రిస్క్ జరిగితే డెత్ ప్రాధమిక భీమా కి 125% గా బెనిఫిట్ నామినీకి అందివ్వడం జరుగుతుంది.

 

     అతి ముఖ్యమైన  ప్రయోజనాలు ? -LIC Dhan Rekha Plan  Key Features

 

1.పురుషుల తో పోలిస్తే మహిళలకు ప్రీమియం తక్కువ ఉంటుంది.
2. సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం లో పాలసీ మీకు లభిస్తుంది.
3. సెటిల్మెంట్, లోన్, సరెండర్ తోపాటు టాక్స్ ప్రయోజనాలు ప్రత్యేకంగా పొందవచ్చు.
4. పాలసీలో లభించే బెనిఫిట్స్ సుమారుగా కాకుండా 100% గ్యారెంటెడ్.
5. పాలసీ యొక్క 6 వ సంవత్సరం నుంచే స్పెషల్ గ్యారెంటెడ్ బోనస్.
6.  ప్రీమియం పెయింగ్ కంప్లీట్ అయినప్పటికీ అత్యధికముగా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు.
7.  డెత్ బెనిఫిట్ అత్యధికముగా 125% అఫ్ ప్రాథమిక భీమా + గ్యారెంటెడ్ అడిషన్.
8.కనీసం 3 నెలల పిల్లలకి కూడా వర్తించేలా LIC ధన్ రేఖ రూపొందించబడింది మరియు పాలసిదారుని ఇస్టానుసరంగా నిర్ణయం చేసుకోవడానికి 5 బెనిఫిట్ రైడర్స్ లభించడం జరుగుతుంది.

 

ప్లాన్ ఆప్షన్    – Plan Options

1. సింగిల్ ప్రీమియం ( Single Premium )

ఈ ఆప్షన్ ద్వారా మొత్తం పాలసీకి సంబందించిన ప్రీమియం ఒక్కసారే చెల్లించవచ్చు.

2. లిమిటెడ్ ప్రీమియం ( Limited Premium )

పాలసీ సమయంలో సగం సమయం మాత్రమే రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించడం.

 

గ్యారెంటెడ్ అడిషన్ – Guaranteed Addition

 

SL No

Policy Term 

Starting 

G. Addition 

          1

          20

   6th Year 

Per 1000 /50

          2

          30

  21th Year 

Per 1000 /55

          3

          40

   31th Year 

Per 1000 /60

 

LIC ధన్ రేఖ వేరు వేరు పాలసీ సమయాలకు వేరు వేరుగా సంవత్సరానికి ఒకసారి ప్రతీ Rs 1,000/- రూపాయల కి గ్యారెంటెడ్ అడిషన్ ని అందిస్తుంది, సమయంతోపాటు ఈ గ్యారెంటెడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.

20 సంవత్సరాల పాలసీకి 6 వ సంవత్సరం నుంచి Rs 1,000 కి 50 రూపాయల చొప్పున,30 సంవత్సరాల పాలసీకి 21 టవ సంవత్సరం నుంచి Rs1,000 కి 55 రూపాయల చొప్పున మరియు 40 సంవత్సరాల పాలసీకి 31టవ సంవత్సరం నుంచి Rs1,000 కి 60 రూపాయల చొప్పున అందివ్వడం జరుగుతుంది.

ఉదాహరణ కి Mr. కుమార్,  40 సంవత్సరాలకు 10 లక్షల భీమా తీసుకొంటే, ప్లాన్ యొక్క 31 టవ సంవత్సరం నుంచి ప్రతీ 1,000 కి 60 రూపాయలు, అంటే 10 లక్షల భీమా కు సంవత్సరానికి =  Rs 60,000 గ్యారెంటెడ్ అడిషన్ లభించడం జరుగుతుంది.ఇదే విధంగా పాలసీ చివరివరకు లభిస్తుంది.

 

సర్వేవల్ ( మనీ బ్యాక్ ) – Money Back Facility

Policy Term 

% Of Sum Assured

Money Back

20

10%

10 & 15

30

15%

15,20 & 25

40

20%

 20,25 30 & 35

 

LIC ధన్ రేఖ మనీ బ్యాక్ సదుపాయం కూడా క్రింద విధంగా కల్పిస్తుంది.

20 సంవత్సరాల పాలసీ కి ప్రాథమిక భీమాలో 10% చొప్పున ప్లాన్ యొక్క 10 వ,15 వ సంవత్సరంలో మనీ బ్యాక్ పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది,

30 సంవత్సరాల పాలసీ కి ప్రాథమిక భీమాలో 15% చొప్పున ప్లాన్ యొక్క 15 వ,20వ  మరియు 25 సంవత్సరంలో మనీ బ్యాక్ పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది,

అదేవిధంగా 40 సంవత్సరాల పాలసీ కి ప్రాథమిక భీమాలో 20% చొప్పున ప్లాన్ యొక్క 20వ,25వ,30 మరియు 35 వ సంవత్సరంలో మనీ బ్యాక్ పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

ప్రాథమిక భీమా + పాలసీలో లభించే మొత్తం గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో,  మధ్యలో లభించే మనీ బ్యాక్ తో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పాలసీదారునికి లభిస్తుంది.

 

మరణ ప్రయోజనం – Death Benefit

1. సింగల్ ప్రీమియం ఆప్షన్

125% అఫ్ ప్రాథమిక భీమా + గ్యారెంటెడ్ అడిషన్

ముఖ్య గమనిక :- పాలసీ తీసుకొన్న మొదటి 5 సంవత్సరాల లోపు రిస్క్ జరిగితే గ్యారెంటెడ్ అడిషన్లభించడం జరగదు.

2. లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్

125% అఫ్ ప్రాథమిక భీమా లేదా వార్షిక చెల్లింపు ప్రీమియం కి 7 రేట్లు చొప్పున నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుంది.

 

LIC ధన్ రేఖ డిస్కౌంట్   – Discount Of High Sum Assured 

1.  సంవత్సరానికి ఒకసారి  – Yearly          = 2%
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly  = 1%
3. 3 నెలలకు  ఒకసారి        – Quarterly    =Nil
4. ప్రతినెలా                         – Monthly       =Nil

పాలసిలో చెల్లించే ప్రీమియం అమౌంట్ పై డిస్కౌంట్ అందివ్వడం జరుగుతుంది,  సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి  ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

భీమాపై ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? –  ( Rebate On high Basic Sum Assured

సింగల్ ప్రీమియం

భీమా ( Basic Sum Assured )                 రిబేట్
1. 2, 00, 000 నుంచి  4,75, 000             = Nil
2. 5, 00, 000 నుంచి  7,25, 000            = Rs 5
3. 7, 00, 000 నుంచి  9, 75, 000           = Rs 10
4. 10, 00, 000 నుంచి  అత్యధికముగా = Rs 15

 

లిమిటెడ్ ప్రీమియం

భీమా ( Basic Sum Assured )                 రిబేట్
1. 2, 00, 000 నుంచి  4,75, 000             = Nil
2. 5, 00, 000 నుంచి  7,25, 000            = Rs 1
3. 7, 00, 000 నుంచి  9, 75, 000           = Rs 2
4. 10, 00, 000 నుంచి  అత్యధికముగా = Rs 3

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో  మీకు  రిబేట్ లభిస్తుంది.

 

• LIC మెట్యూరిటీ సెటిల్మెంట్ –  Maturity Settlement

1.  ఈ విధానం ద్వారా పాలసీదారుడు మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని , నామినీ డెత్ ప్రయోజనాన్ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.

    లేదా

2. వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి పొందవచ్చు.

ముఖ్య గమనిక : ఈ ఎంపికను పాలసీదారుడు  కనీసం 3 నెలలు ఇంకా పాలసీ సమయం మిగిలి ఉండగానే సంస్థకి  తెలియచేయాల్సి ఉంటుంది.

 

లోన్ సదుపాయం – Loan Facility

సింగిల్ ప్రీమియం ఆప్షన్ లో ఇమ్మీడియేట్ గా ఎప్పుడైనా, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లో కనీసం 2 సంవత్సరాల తర్వాత లోన్ పొందే అవకాశం లభిస్తుంది.

 

1.   ఎల్. ఐ. సి ఈ స్కీం లో రోజుకి Rs 66/- రూ||లు పొదుపు చేస్తే, మెట్యూరిటీ సమయంలో 13 లక్షలు పొందవచ్చు, వివరాలు చెక్ చెయ్యండి

 

LIC Jeevan Lakshya Plan In Telugu 933 – “విద్యా,వివాహం ,వ్యాపారానికి అద్భుతమైన పాలసీ ” అర్హతలు ఇవే !

LIC ధన్ రేఖ పాలసీ అర్హతలు –  LIC Dhan Rekha Plan  Eligibility

 

Eligibility 

Minimum

Maximum

Entry Age 

90 Days 

55 & 60 = 20 Years Term      45 & 50 = 20 Years Term         

35 & 40 = 20 Years Term         

Policy Term 

20 Years 

40 Years 

Sum Assured 

2 Lakh 

No Limit

Premium Paying 

10 Years 

20 Years 

 

పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 90 రోజులు

అత్యధిక వయస్సు  (maximum Age ) వచ్చి.. లిమిటెడ్ ప్రీమియం & సింగిల్ ప్రీమియం

55 & 60 సం||లు   – 20 సంవత్సరాల పాలసీ సమయం
45 & 50  సం||లు   – 30 సంవత్సరాల పాలసీ సమయం
35 & 40 సం||లు   – 40 సంవత్సరాల పాలసీ సమయం.

 

• పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? –  Policy Term

కనీసం 20 సంవత్సరాలు, మరియు 30, అత్యధికముగా 40 సంవత్సరాలు.

• భీమా పరిమితులు? –  Sum Assured

ధన్ రేఖ పాలసీ కనీస భీమా పరిమితి = 2, 00, 000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి కి ఎటువంటి  అవధి లేదు.
లక్ష రూపాయలు నుంచి  అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు.

 

•   గరిష్ట మెట్యూరిటీ  సమయం ? –  Maximum Maturity Age

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి లిమిటెడ్ ప్రీమియం 75 సం||లు, సింగల్ ప్రీమియం 80 సం||లుగా ఉంటుంది.

 

ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? – Premium Paying Term

LIC ధన్ రేఖ ఒక లిమిటెడ్ ప్రీమియం పాలసీ.

20 సంవత్సరాల పాలసీ సమయం = 10 సంవత్సరాలు మాత్రమే

30 సంవత్సరాల పాలసీ సమయం = 15 సంవత్సరాలు మాత్రమే మరియు

40 సంవత్సరాల పాలసీ సమయం = 20 సంవత్సరాలు అంటే పాలసీ సమయంలో సగం మాత్రమే ప్రీమియం చెల్లించాలి.

 

• ప్రీమియం చెల్లింపులు –  Premium Paying Mode

4 రకాలుగా  ప్రీమియం చెల్లించవచ్చు.

1. సంవత్సరానికి ఒకసారి    – Yearly
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly
3. 3 నెలలకు  ఒకసారి        – Quarterly
4. ప్రతినెలా                         – Monthly

 

• LIC ధన్ రేఖ ఉదాహరణ – LIC Dhan Rekha Plan  Example

 

ఇది ఒక మనీ బ్యాక్ స్కీం.  పాలసి కొనసాగుతున్న సమయంలోనే మధ్యలో మనీ బ్యాక్ రూపంలో అమౌంట్ లభించును  మరియు చివర్లో మేట్యూరిటీ కూడా రావడం జరుగుతుంది.

తండ్రి పేరు                   – Mr. రఘు
అతని వయసు              – 30 సంవత్సరాలు
పాలసి సమయం          – 30 సంవత్సరాలు
భీమా                              = 10 లక్షలు
వార్షిక ప్రీమియం          = Rs 72,264/-

Mr. రఘు 30 సంవత్సరాలకి పాలసీని తీసుకోవడం జరిగింది కాబట్టి 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు.

ప్లాన్ లో చెల్లించిన మొత్తం = Rs 10,83,960/

 

                       మనీ బ్యాక్ ( Money Back ) – 15% Of BSA

ప్రాథమిక భీమా లో 15% చొప్పున పాలసీ యొక్క 15,20 మరియు 25 వ సంవత్సరం మనీ బ్యాక్ లభించడం జరుగుతుంది.

15  వ సంవత్సరం    = Rs 1,50,000/-
20 వ సంవత్సరం    = Rs 1,50,000/-
25 వ సంవత్సరం    = Rs 1,50,000/- గా మూడు సార్లు  Rs 4,50,000/- మధ్యలో మనీ బ్యాక్ రావడం జరుగుతుంది.

 

                     మెట్యూరిటీ ( Maturity Benefit )

100% బేసిక్  భీమా       = Rs 10,00,000/-
గ్యారెంటెడ్ అడిషన్    = Rs 13,00,000/-

ప్లాన్ యొక్క 30 వ సంవత్సరం ఒక్కసారే మెట్యూరిటీ లభిస్తుంది.

రిటర్న్   –  మనీ బ్యాక్ = Rs 4,50,000/-
– మెట్యూరిటీ               = Rs 23,00,000/-

ప్లాన్ లో లభించే మొత్తం = Rs 27,50,000/-

 

                  మరణ ప్రయోజనం – Death Benefit

మొత్తం పాలసీలో రఘు కి ఎప్పుడు రిస్క్ జరిగినా డెత్ బెనిఫిట్ నామినీకి ఈ కింద విధంగా లభిస్తుంది.

1. సింగల్ ప్రీమియం ఆప్షన్ లో  ప్రాథమిక భీమా పై 125% + గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో Rs 12,50,000/- రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్యారెంటెడ్ అడిషన్ పాలసీదారుని రిస్క్ 5 సంవత్సరాల తర్వాత జరిగినపుడు మాత్రమే లభిస్తుంది,5 సంవత్సరాలలోపు రిస్క్ జరిగితే లభించడం జరగదు.

2. లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లో  ప్రాథమిక భీమా పై 125% రూపంలో Rs 12,50,000/- రూపాయలు నామినీకి డెత్ బెనిఫిట్ గా లభిస్తాయి.

 

• కామెంసెమెంట్ అఫ్ రిస్క్ – Commencement Of Risk

1. 8 సంవత్సరాలలోపు పిల్లలకి ప్లాన్ తీసుకొన్న 2 సంవత్సరాల తర్వాత లేదా 8 సంవత్సరాలు వచ్చే వరకూ ఏది ముందు జరిగితే అప్పట్నుంచి రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.
2.8 సంవత్సరాలు పై బడిన పిల్లలకు ఇమ్మీడియేట్ గా రిస్క్ కవరేజ్ లభిస్తుంది.

 

    బెనిఫిట్ రైడర్స్ – Additional Benefit Riders

 

1. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ Premium Waiver Benefit Rider – UIN 512B204V03

ధన్ రేఖ పాలసీని 18 సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకొన్నప్పుడు ఈ ప్రయోజనం లభిస్తుంది.పాలసీ తీసుకొనే సమయంలోనే ఈ రైడర్ ను తీసుకోవాల్సి ఉంటుంది మధ్యలో లభించదు.

పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ప్రపోసర్ గా ఉంటాడు, పిల్లలు పాలసీదారులు అవుతారు.

పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ఏదైనా కారణం చేత మరణించినా లేక క్రిటికల్ ఇల్నెస్ కి గురిఅయిన భవిష్యత్ ప్రీమియం అంతా కంపెనీ మాఫీ చేస్తుంది, అయినప్పటికీ మనీ బ్యాక్ తోపాటుపాలసీ యొక్క అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

 

2. ఆక్సిడెంట్  డెత్ అండ్ టోటల్ పేర్మినెంట్ డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ –  Accidental Death  And Total Permanent Disability Benefit Rider – UIN  512B209V02

ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా  అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.
.
ఆక్సిడెంట్ లో మరణించలేదు, డిజాబిలిటీ కి గురయ్యాడు ఈ సందర్భంలో కూడా పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్  మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది, దీనితోపాటుగా  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :  ఈ  ప్రయోజనం కొరకు ఆక్సిడెంట్ జరిగిన 180 రోజులు లోపు మీరు సంస్థకి సమాచారాన్ని అందివ్వాల్సివుంటుంది.

 

3. టర్మ్ రైడర్  – Term Rider – UIN 512B210V01

ఈ రైడర్ను  పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.

పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది.

 

4. కొత్త  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ – Critical Illness Benefit Rider – UIN 512A212V01

ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో  ఆరోగ్య భీమా  ప్రయోజనం కలిగిస్తుంది. పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.

 

5. ఆక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ – Death Benefit Rider ( UIN 512B209VO1 )

పాలసీదారునికి రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే ప్రాథమిక భీమా Rs 12,50,000/-, దీనితోపాటుగా మరొక 10 లక్షలు ఈ రైడర్ ద్వారా నామినికి అదనంగా లభించడం జరుగుతుంది.

 

ఇతర ముఖ్య ప్రయోజనాలు –    Other Important Benefits 

టాక్స్ బెనిఫిట్స్ –    LIC Dhan Rekha Plan  Tax Benefits

చెల్లించే ప్రీమియం పై టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, లభించే మనీ బ్యాక్, మెట్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్ పై టాక్స్ వర్తించదు టాక్స్ రహితంగానే అమౌంట్ పొందవచ్చు.

 

•  గ్రేస్ పీరియడ్ ? – Grace Period

గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియం చెల్లించడానికి అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.
సంవత్సరానికి,6 నెలలకు  మరియు 3 నెలలకు ప్రీమియం చెల్లిస్తే వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ  సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు,
ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

• రివైవల్  పీరియడ్ ఫెసిలిటీ ?  Revival Facility

5 సంవత్సరాలు  రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం  ప్రీమియం పెనాల్టీతో కలిపి చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగవచ్చు.

• ఫ్రీ లుక్ పీరియడ్  అంటే ఏమిటి? ( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీ  నియమాలు మరియు షరతులు పై  అసంతృప్తి చెందినట్లైతే పాలసీని మూసివేసి  ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు,ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  : 15 రోజుల తర్వాత  పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ –  Surrender Value

1. సింగల్ ప్రీమియం ఆప్షన్స్ లో కనీసం 3 నెలల తర్వాత, లిమిటెడ్ ప్రీమియం లో కనీసం 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ ని సరెండర్ చెయ్యవచ్చు.

https://licindia.in/

 

• ధన్ రేఖ పాలసీని  ఎలా  తీసుకోవాలి మరియు డాకుమెంట్స్?  – ( How to Apply Documents )

ఈ పాలసీని  LIC ఆఫీసియల్ వెబ్సైటు లేదా ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా పొందవచ్చు.

• కావలసిన డాకుమెంట్స్

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్
2. ఆధార్ కార్డు
3. ఓటుగుర్తింపు కార్డు
4. పాన్ కార్డు
5.  మెడికల్ రిపోర్ట్

 

• ముగింపు  ( Conclusion )

LIC ధన్ రేఖ పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *