Lic New Pension Plus Plan in Telugu
LIC New Pension Plus Plan 867
దేశంలోనే అతిపెద్ద మరియు అందరికీ తెలిసిన జీవిత బీమా సంస్థ మరో కొత్త పెన్షన్ ప్లాన్(Lic New Pension Plan) ను సెప్టెంబర్ 5 2022 న ప్రారంబించింది. ఎల్. ఐ సి న్యూ పెన్షన్ ప్లాన్ లో పెన్షన్ లేదా రెగ్యులర్ ఆదాయం పొందడం కొరకు వ్యక్తి 60 సంవత్సరాల కాలం వరకూ నిరీక్షించిన అవసరం ఉండదు, 25 సంవత్సరాల వ్యక్తి 35 వ సంవత్సరం నుంచి స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు దీనితో పాటుగా గారెంటే ఎడిషన్ బోనస్(Guaranteed Additional bonus), మొదలగు కొన్ని కొత్త అనువర్తనాలను జోడించడం జరిగింది వాటి కోసం వివరంగా తెలుసుకుందాము.
ఇది నాన్ పార్టిసిపేట్ మరియు యూనిట్ లింక్డ్ ప్లాన్ (అంటే అనుభవం గా వ్యక్తులచే mutual fund, stock market లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.)వ్యక్తిగత ( Individual) ప్లాన్.
ఎల్. ఐ సి కొత్త పెన్షన్ ప్లాన్ తీసుకోవడం ద్వారా ముత్యువల్ ఫండ్ రిటర్న్స్, ఇన్సూరెన్స్ కవరేజీ మరియు జీవితాంతం పెన్షన్ ను పొందవచ్చును.
మనం కొంత కాలం పాలసీ సమయాన్ని నిర్ణయించుకోవాలి, సింగిల్ ప్రీమియం లేదా రెగ్యులర్ ప్రీమియం ద్వారా ప్లాన్ ను పూర్తి చేసిన తరువాత ముత్యువల్ ఫండ్ లో లభించే రిటర్న్స్, ఎల్. ఐ సి గ్యారెంటీ బోనస్ కలిపి మెచ్యూరిటీ గా లభిస్తాయి. ఈ అమౌంట్ తో జీవితాంతం పెన్షన్ కోసం యాన్యుటీ ప్లాన్ ను కొనుగోలు చేస్తారు.
మనకు లభించే 100 శాతం మత్యురిట్ లో 50% లేదా 60% withdrawal చేసుకొని మిగిలిన అమౌంట్ తో యాన్యుటీ ప్లాన్ ను తీసుకొని జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ ను పొందవచ్చును.
అర్హతలు (Eligibility):
కనీస ప్రవేశ వయసు : 25 సం,,లు
గరిష్ట ప్రవేశ వయసు : 75 సం,, లు
ప్రీమియం చెల్లింపు (premium paying):
2 రకాల –
A) సింగిల్ ప్రీమియం అంటే బీమా మొత్తానికి ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించే పద్ధతి.
B) రెగ్యులర్ ప్రీమియం అంటే నెలకు, 3 నెలలకు, 6 నెలలకు మరియు సంవత్సరానికి ప్రీమియం చెల్లించే పద్ధతి.
కనీస బీమా సమయం(Term) : 10 సం,,లు
గరిష్ట బీమా సమయం(Term) : 42 సం,,లు
ప్రాథమిక వేసగ్(Vesting) వయసు : 35 సం,, లు
గరిష్ట వెస్తింగ్(Vesting) వయసు : 85 సం,, లు
(Vesting): బీమా తీసుకున్న వ్యక్తి వయసు, మత్యూరిటీ తీసుకునే సమయానికి 35 నుండి 85 సంవత్సరాలు వుండాలి.
ఉదాహరణ -1 రాజు బీమా తీసుకునే సమయం లో అతని వయసు 25 సంవత్సరాలు, పాలసీ సమయం 10 సంవత్సరాలు తీసుకుంటే వెస్తింగ్ వయసు : 35 సం,,లు.
కనీస ప్రాథమిక బీమా( Minimum Basic Sum Assured):
సింగిల్ ప్రీమియం – లక్ష రూపాయలు,
రెగ్యులర్ ప్రీమియం తీసుకుంటే –
సంవత్సరానికి :30000 రూపాయాలు,
అర్ధ సంవత్సరానికి : 16000 రూపాయాలు,
3 నెలలకు : 9000 రూపాయాలు,
నెలకు : 3000 రూపాయాలు చెల్లించాలి.
పాక్షిక విరమణ(Partial withdrawal):
Lic New Pension Plan లో 5 సంవత్సరాలు లాకింగ్(Locking) పీరియడ్ వుంటుంది.
అంటే ప్లాన్ తీసుకున్న ప్రారంభం నుండి అమౌంట్ ను 5 సంవత్సరాల వరకు తీయలేరు మరియు సరెండర్ కూడా చేయలేరు.
పాక్షిక విరమణ(Partial withdrawal) రూపం లో క్రింది 4 సందర్బాలలో కొంత అమౌంట్ ను తీసుకోవచ్చును. అవి:
1) పిల్లల విద్య(Children Education),
2) వివాహం (children marriage),
3) ఇల్లు నిర్మాణం ( Own house construction),
4) అనారోగ్యానికి గురైనప్పుడు(Critical illness treatment).
మొత్తం ప్లాన్ సమయం లో 3 సార్లు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
Regular premium policies: Annual Premium | % of Unit Fund Value |
Less than Rs.50,000/- | 10% |
Rs.50,000/- and above but less than Rs.1,00,000/- | 15% |
Rs.1,00,000 and above | 25% |
Single Premium Policies: Single Premium | % of Unit Fund Value |
Less than Rs.2,00,000/- | 10% |
Rs.2,00,000/- and above but less than Rs.5,00,000/- | 15% |
Rs.5,00,000 and above | 25% |
ఈ ప్లాన్ ద్వారా వచ్చిన అమౌంట్ ను 4 రకాల ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ (Investment) చేస్తారో తెలుసుకుందాము.
Fund Type | Investment in Government/ Government Guaranteed Securities | Short-term investments such as money market instruments | Investment in Listed Equity Shares | Risk Profile |
Pension Bond Fund | 60% to 100% | 0% to 40% | Nill | Low Risk |
Pension Secured | 50% to 90% | 0% to 40% | 10% to 50% | Lower to Medium Risk |
Pension Balanced Fund | 30% to 70% | 0% to 40% | 30% to 70% | Medium Risk |
Pension Growth Fund | 0% to 60% | 0% to 40% | 40% to 100% | High Risk |
మీకు స్టాక్ మార్కెట్ మరియు ముతువల్ ఫండ్స్ లో పరిజ్ఞానం వుంటే మీరే మంచి ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదా ఎల్. ఐ సి సంస్థే ఈ పక్రియ కొనసాగిస్తుంది.
సంవత్సరానికి 4 సార్లు మాత్రమే ఫండ్ స్విచ్చింగ్ ( Fund Switching) ఉచితంగా చేసుకోవచ్చు.
అంటే మార్కెట్ కు అనుగుణంగా వేర్వేరు ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 4 సార్లు కంటే ఎక్కువ అయితే 100 రూపాయలు చెల్లించాలి.
గ్యారెంటీ అడిషనల్ బెనిఫిట్( Guaranteed Addition Benefit):
ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే రిటర్న్స్ తోపాటుగా Lic అదనంగా యూనిట్స్ రూపంలో పాలసీ సమయం మొత్తం గ్యారెంటీ ఎడిషన్ ను అందిస్తుంది.
రెగ్యులర్ మరియు సింగిల్ ప్రీమియం చెల్లింపు పాలసీ దారుడికి వేర్వేరు గా వుంటుంది.
End of Policy Year | Guaranteed Additions per annum (as a percentage of one Annual premium) | Guaranteed Additions per annum (as a percentage of single premium) |
6th | 5.00% | 4.00% |
10th | 10.00% | 5.00% |
11th to 15th | 4.00% | 1.25% |
16th to 20th | 5.50% | 1.50% |
21th to 25th | 7.00% | 2.00% |
26th to 30th | 8.75% | 2.50% |
31th to 35th | 10.75% | 3.00% |
36th to 40th | 13.00% | 3.75% |
41th to 42th | 15.50% | 4.50% |
ప్లాన్ యొక్క 6 వ సంవత్సరం నుండి 42 వ సంవత్సరం వరకు ఎల్. ఐ సి గ్యారెంటీ అడిషనల్ ను యూనిట్స్ ( Units) రూపంలో అంధిస్తుంది. వాటిపై లభించే రిటర్న్స్ కూడా మెచ్యూరిటీ తో కలిపి ఇస్తుంది.
ఉదాహరణ:
రాజు వయసు : 30 సం,,లు, రెగ్యులర్ ప్రీమియం ఎంపిక చేసుకొని నెలకు : 3000 చెల్లిస్తూ, పాలసీ సమయాన్ని 20 సం,,లకు తీసుకుంటే…
మొత్తం చెల్లించిన ప్రీమియం: 7,20,000 రూపాయలు,
రిటర్న్ + గ్యారెంటీ అడిషనల్ = మెచ్యూరిటీ లభిస్తుంది.
ఈ మెచ్యూరిటీ (maturity) నే ఫండ్ వల్యూ అంటారు.
కేవలం పెన్షన్ కోసమే తీసుకున్నవారు మెచ్యూరిటీ మొత్తం అమౌంట్ తో పెన్షన్ ను కొనుగోలు చేయవచ్చు లేదా కొంత అమౌంట్ withdrawal చేసుకొని మిగిలిన అమౌంట్ తో పెన్షన్ స్కీమ్ తీసుకోవచ్చు.
ఉదాహరణ:
రాజు కు మెచ్యూరిటీ లో 30 లక్షల రూపాయలు వచ్చాయి అనుకుంటే : ఇప్పుడు పెన్షన్ ఎలా వస్తుందో తెలుసుకుందాము.
Lic లో 2 రకాల పెన్షన్లు వున్నాయి.
A) Immediate pension: ఈ పెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే తరువాత నెల నుండి పెన్షన్ వస్తుంది.
Ex: జీవన్ అక్షయ్ పాలసీ.
B)Deferred pension: ఈ ప్లాన్ ను ఎంపిక చేసుకుంటే కొంత నిర్ణీత కాలం తరువాత నుండి రెగ్యులర్ పెన్షన్ రావడం జరుగుతుంది.
Ex: జీవన్ శాంతి పాలసీ.
డెత్ బెనిఫిట్ (Death Benefit):
ప్లాన్ చెల్లించే క్రమం లో పాలసీ దారుడు మరణిస్తే : అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మరియు దాని పై లభించే రిటర్న్స్ లేదా అతను చెల్లించిన ప్రీమియం కి 105% ఏది ఎక్కువ అయితే అది నామినీ కి ఇచ్చి ప్లాన్ ముగిస్తారు.
Premium allocation charges:
అన్ని ULIP (Unit Linked insurance Plan) వలె ఈ ప్లాన్ లో కూడా ప్రీమియం ఆలోకేషన్ చార్జెస్ యధావిధిగా వర్తిస్తాయి. చార్జెస్ వివరాల కొరకు LIC Official Website ను సంప్రదించండి.
Mortality: ఎటువంటి ఛార్జ్ లేదు.
(mortality అంటే ప్లాన్ లో మనకు లభించే ఇన్సూరెన్స్ కవరేజీ).
ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ (Fund management charge) – 1.35% యూనిట్ ఫండ్ విలువ పై.
పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ : అన్ని రకాల ప్లాన్స్ లో వలె ఈ ప్లాన్ లో కూడా సింగిల్, రెగ్యులర్ ప్లాన్ లపై చార్జెస్ వర్తిస్తాయి.
గ్రేస్ పీరియడ్ (Grace Period):
గ్రేస్ పీరియడ్ యధావిధిగా వర్తిస్తుంది. సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి మరియు 3 నెలలకు ప్రీమియం చెల్లించే వారికి ప్రీమియం చెల్లించ వలసిన సమయం నుండి 30 రోజుల వరకు అదనపు పెనాల్టీ లేకుండా కేవలం ప్రీమియం మాత్రమే చెల్లించ వచ్చును, నెలకు చెల్లించే వారికి 15 రోజులు గ్రేస్ పీరియడ్ వుంటుంది.