LIC Jeevan Shanti Policy details (858) In Telugu
LIC Jeevan Shanti 858 Telugu
ఎల్. ఐ. సి కొత్త జీవన్ శాంతి ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటేడ్ ఇండివిడ్యుఅల్ , జాయింట్ లైఫ్ డిఫెరెడ్ పెన్షన్ ప్లాన్ ( LIC Jeevan Shanti 858 Non linked non participated Individual & joint life Deferred Annuity Scheme ) అంటే స్కీమ్ లో అమౌంట్ డిపాజిట్ చేసిన 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల మధ్య మీకు అనుగుణంగా సమయాన్ని నిర్ణయం చేసుకోవచ్చు, అప్పటి నుండే పెన్షన్ రావడం జరుగుతుంది.ఇందులో ముఖ్యంగా 2 ఆప్షన్ అందుబాటులో ఉంటాయి.
జీవన్ శాంతి ప్లాన్ టేబుల్ నెంబర్ 850 ను క్లోజ్ చేసి దాని స్థానంలో 2020 అక్టోబర్ 1 న ఎల్. ఐ. సి సంస్థ కొత్త జీవన్ శాంతి ప్లాన్ ( Table No – 858 )ను ప్రారంభం చేసింది. అయితే ఎల్. ఐ. సి సంస్థ కొత్త జీవన్ శాంతి పాలసీని తీసుకోవడం మంచిదేనా? ఎవరికి మంచిది? ఎంత అమౌంట్ ఒక్కసారే డిపాజిట్ చేస్తే ప్రతి నెల రెగ్యులర్ పెన్షన్ ఎంత పొందవచ్చు ? ఇలా పాలసీకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!
పెన్షన్ పాలసీలు రెండు రకాలు – Types of Pensions
1. ఇమ్మీడియేట్ పెన్షన్ ( Immediate Pension )
ఇమ్మిడియట్ అంటే వెంటనే, పాలసీదారుడు పెన్షన్ ఖరీదు చేసాడు తను నిర్ణయం చేసుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా ( నెల, వార్షిక, అర్ధవార్షిక మరియు త్రయ్ మాసిక) వెను వెంటనే పెన్షన్ రావడం జరుగుతుంది.
2. డిఫెరెడ్ పెన్షన్ – వాయిదా ( Deferred Pension )
పాలసీదారుడు పెన్షన్ ఖరీదు చేసాడు, కానీ కొంత కాలం తర్వాత నుంచి పెన్షన్ పొందాలనుకొంటున్నాడు.
అంటే ఈ రోజు పాలసీని ఖరీదు చేసి 2, 4, 8, మరియు 12 సంవత్సరాల తర్వాత పెన్షన్ కావాలనుకోవడం.
1. డిఫెరెడ్ పెన్షన్ సింగల్ లైఫ్ ( Deferred Pension for Single Life )
కేవలం పాలసీని ఖరీదు చేసిన వ్యక్తి కి మాత్రమే జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ రావడం జరుగుతుంది.
2. డిఫెరెడ్ పెన్షన్ జాయింట్ లైఫ్ ( Deferred Pension for Joint Life )
భీమాదారునితో పాటుగా అతని జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లి, తండ్రి, ఇలా ఎవరో ఒకరిని జాయింట్ లైఫ్ గా జత చేసుకోవచ్చు విస్తరంగా ముందు చూద్దాం.
• మరణ ప్రయోజనం ( Death Benefit )
పాలసీ తీసుకొన్న వ్యక్తి జీవిత పర్యంతంలో ఎప్పుడోకప్పుడు మరణించక తప్పదు ఈ సందర్భంలో పాలసీదారుని కుటుంబానికి డెత్ బెనిఫిట్ ఈ క్రింద విధంగా లభించడం జరుగుతుంది.
# ప్రారంభ డిపాజిట్ మొత్తం + అడిషనల్ బెనిఫిట్ – మొత్తం యాన్యూటీ అమౌంట్
లేదా
# ప్రారంభంలో పెన్షన్ ఖరీదు చేసిన అమౌంట్ కి 105%, అంటే 10 లక్షలతో పెన్షన్ ప్లాన్ను కొనుగోలు చేసిన వ్యక్తి మరణిస్తే 10 లక్షల 50 వేలు అతని కుటుంబానికి రావడం జరుగుతుంది.
ఈ విధంగా లభించే అమౌంట్ ను ఎల్. ఐ. సి జీవన్ శాంతి 585 మూడు రకాలుగా పొందవచ్చు.
1. లంప్ సమ్ ( Lump sum )
ప్లాన్ లో లభించే మొత్తం అమౌంట్ ను ఒక్కసారే నామినీ పొందేలా!
2. పెన్షన్ ఖరీదు ( Purchase Pension )
నామినీ అమౌంట్ ని ఒక్కసారే పొందకుండా ఆ అమౌంట్ తో తిరిగి పెన్షన్ ప్లాన్ని ఖరీదు చెయ్యడం!
2. వాయిదా పద్దతి ( Installments )
మొత్తం ఒక్కసారే కాకుండా 5,10, మరియు 15 సంవత్సరాల సమయం ఇంస్టాల్మెంట్ రూపంలో మీకు నచ్చిన విధంగా( వార్షిక, అర్ధవార్షిక, ట్రై మాసికం, నెల నెల ) పొందవచ్చు.
• లోన్ సదుపాయం ( Loan Facility )
ప్లాన్ లో కనీసం 3 నెలలు గడిచిన తర్వాత డిపాజిట్ అమౌంట్ లో 80% వరకూ అత్యవసర సమయంలో లోన్ గా లభిస్తుంది.
• సరెండర్ వాల్యూ ( Surrender Facility )
ప్లాన్ తీసుకొన్న నుంచి ఏ సమయంలో నైనా పాలసీను సరెండర్ చేసి మీరు అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు.ఏదైనా పాలసీని సరెండర్ చెయ్యడం ద్వారా ఎక్కువ మొత్తం లో పాలసీదారుడు డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు – Eligibility
Eligibility | Minimum | Maximum |
Age at Entry | 30 Years | 79 Years |
Deferment Period | 1 Years | 12 Years |
Vesting Age | 31 Years | 80 Years |
Purchase Mode | Offline | Online |
Loan | Available | Available |
Pension Purchse Price | Rs 1,50,000 | No Limit |
• పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 30 సం ||లు
అత్యధిక వయస్సు( Maximum Age ) = 79 సం ||లు
• పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది?
ఒక్కసారి కొనుగోలు చెయ్యడం ద్వారా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
• భీమా పరిమితులు? – Sum Assured
కనీస భీమా ఖరీదు = Rs 1, 50, 000/- రూపాయలు.
అత్యధిక భీమా ఖరీదుకికి ఎటువంటి అవధి లేదు.
లక్ష 50 వేల రూపాయలు నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు.
• డిఫెర్మెంట్ పీరియడ్ ( Deferment Period )
కనీస డిఫెర్మెంట్ పీరియడ్ – 1 సంవత్సరం .
అత్యధిక డిఫెర్మెంట్ పీరియడ్ – 12 సంవత్సరాలు.
అంటే పాలసీని ఖరీదు చేసిన తర్వాత 1 నుంచి 12 ( 1, 4, 6,…12 ) సంవత్సరాల సమయం వరకు మాత్రమే మీరు పెన్షన్ ని తీసుకోవడం నిరోదించగలరు.
• వేస్టింగ్ బెనిఫిట్ ( Vesting Benefit )
కనీస వేస్టింగ్ సమయం ( Min Vesting ) – 31 Years
అత్యధిక వేస్టింగ్ సమయం ( Max Vesting ) – 80 Years
అంటే పెన్షన్ తీసుకొనే సమయానికి పాలసీదారుని యొక్క కనీస వయసు 31 సం ||లు నుంచి అత్యధికముగా 80 సంవత్సరాల లోపు ఉండేట్లు చూసుకోవాలి.
• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? ( PPT )
ఎల్. ఐ. సి కొత్త జీవన్ శాంతి ప్లాన్ ( Table No – 858 ) సింగల్ ప్రీమియం డిపాజిట్ ప్లాన్ కాబట్టి మొత్తం ప్లాన్లో ఒక్కసారి అమౌంట్ డిపాజిట్ చేసి జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ పొందవచ్చు.
• పెన్షన్ చెల్లింపులు విధానం – Pension Mode
4 రకాలు….
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా – Monthly
ఈ విధంగా పెన్షన్ ని పొందవచ్చు.
ఎల్. ఐ. సి కొత్త జీవన్ శాంతి ఉదాహరణ – LIC Jeevan Shanti 858 Example
A. పాలసీదారుని పేరు ( Name ) – Mr. సతీష్
వయసు ( Age ) – 45 Years
భీమా ( Sum Assured ) – 10లక్షలు
పెన్షన్ మోడ్ ( Mode ) – ప్రతి నెలా
ఈ విధంగా పెన్షన్ పొందడానికి Mr. సతీష్ ఒక్కసారే సింగిల్ డిపాజిట్ రూపంలో Rs 10,18,000/- ప్రీమియం చెల్లించాలి.
1. డిఫెరెడ్ పెన్షన్ సింగల్ లైఫ్ ( Deferred Pension for Single Life )
కేవలం పాలసీని ఖరీదు చేసిన Mr. సతీష్ కి మాత్రమే జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ రావడం జరుగుతుంది, అతని మరణానంతరం 10 లక్షల డిపాజిట్ అమౌంట్ నామినికి లభిస్తుంది.
డెత్ బెనిఫిట్ ( LIC Jeevan Shanti 858 Death Benefit )
వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడు మరణింంచినా 105% అఫ్ బేసిక్ సమ్ అస్సుర్డ్ అంటే 10 లక్షల 50 వేల వరకూ డెత్ బెనిఫిట్ నామినికి రావడం జరుగుతుంది.
B. పాలసీదారుని పేరు ( Name ) – Mr. సతీష్
వయసు ( Age ) – 45 Years
భీమా ( Sum Assured ) – 10 లక్షలు
పెన్షన్ మోడ్ ( Mode ) – ప్రతి నెల
భార్య వయసు ( Wife Age ) – 40 Years
ఈ విధంగా పెన్షన్ పొందడానికి Mr. సతీష్ ఒక్కసారే సింగిల్ డిపాజిట్ రూపంలో Rs 10,18,000/- ప్రీమియం చెల్లించాలి.
2. డిఫెరెడ్ పెన్షన్ జాయింట్ లైఫ్ ( Deferred Pension for Joint Life )
భీమాదారునితో పాటుగా అతని జీవిత భాగస్వామిని జాయింట్ లైఫ్ గా చేర్చుకోవడం జరిగింది, కాబట్టి ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే వారికి రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది, రెండవ వ్యక్తి కూడా కాలం చేస్తే డిపాజిట్ అమౌంట్ మొత్తం నామినీ గా పిల్లలకి లేదా నియమించిన వారికి అందివ్వడం జరుగుతుంది.
• పెన్షన్ వడ్డీ రేట్లు – Jeevan Shanti New Interest Rates
జీవన్ శాంతి పాలసీ డిఫెరెడ్ పెన్షన్ స్కీం అందువల్ల పాలసీదారుడు నిర్ణయం చేసుకొన్న వాయిదా సమయం పై ఆధారపడిఉంటుంది.
కనీసం 5.90% నుంచి అత్యధికముగా 11.0% వరకూ వడ్డీ అందివ్వడం జరుగుతుంది.
• టాక్స్ ప్రయోజనాలు ( Tax Benefits )
1. ప్లాన్ లో చెల్లించే డిపాజిట్ అమౌంట్ పై సెక్షన్ 80 C వర్తించడం ద్వారా టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
2. ప్లాన్ లో లభించే పెన్షన్ టాక్స్ వర్తిస్తుంది.
3. డెత్ బెనిఫిట్ క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా 10 D లభించడం జరుగుతుంది.
• ఫ్రీ లుక్ పీరియడ్ ( Free Look Period )
పాలసీ తీసుకొన్న 15 రోజులోపు పాలసీకి సంబందించిన నియమాలపై మీరు అసంతృప్తి చెందితే వెంటనే పాలసీని క్లోజ్ చెయ్యడం ద్వారా మొత్తం డిపాజిట్ ను యధావిదిగ పొందవచ్చు, ఒకవేళ ఈ సమయం దాటితే కనీస సర్వీస్ చార్జలు విధించబడును.