SBI Simply Save Credit Card Details in Telugu
SBI Simply Save Credit
నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా రుచికరమైన భోజనం చేయడానికి ఇష్టపడే వారికి, నచ్చిన వస్తువు షాపింగ్‌ను ఇష్టపడే వారికి, మాల్స్ మరియు సినిమా థియేటర్‌లకు తరచుగా వచ్చే వారి అవసరాలను సులభతరం చేయడానికి మార్చి, 2018లో SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది. గతంలో ప్రవేశ పెట్టిన SBI యొక్క Simply CLICK క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపయోగపడేది. సరళంగా చెప్పాలంటే, SBI Simply CLICK ఆన్‌లైన్ షాపింగ్‌కు అనువైనది మరియు SBI simply save credit card ఆఫ్‌లైన్ షాపింగ్ కోసం అనువైనది.
SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ యొక్క ప్రధాన ఫీచర్స్ (Features):-
(which features in sbi simply save credit card?)
*SBI వార్షిక రుసుము INR 499 + ఇతర పన్నులు ఇది వన్-టైమ్ జాయినింగ్ ఫీజు.
*వార్షిక రుసుము లేదా రెన్యువల్ ఫీజు గా ప్రతి సంవత్సరం INR 499 + టాక్స్ చెల్లించాలి.
*క్రెడిట్ కార్డ్‌పై INR 1 లక్ష వరకు వార్షిక వ్యయం ఉంటే రెన్యువల్ ఫీజు ఉండదు.
ప్రయోజనాలు ( benefits) :
(which benefits in sbi simply save credit card?)
*మొదటి 60 రోజుల్లో INR 2,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, మీరు 2,000 బోనస్ రివార్డ్ పాయింట్‌లను పొందుతారు.
*అయితే ఈ ఆఫర్ కొత్త కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే అప్‌గ్రేడ్ చేయబడిన, మళ్లీ జారీ చేయబడిన, రీ-ప్లేస్ చేయబడిన మరియు రెన్యువల్ చేయబడిన కార్డ్‌లకు వర్తించదు.
*మీరు పొందిన బోనస్ పాయింట్‌లు అర్హత కలిగిన లావాదేవీల నుండి 60 రోజులలోపు మీ యొక్క SBI కార్డ్ ఖాతాకు జమ చేయబడతాయి.
ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కో SBI కార్డ్ ఖాతాకు గరిష్టంగా 2000 పాయింట్‌లను పొందవచ్చు.
కానుక పాయింట్లు (Reward points):
(how to get reward points in sbi simply save card?)
డైనింగ్, సినిమాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు మరియు కిరాణా ఖర్చులపై INR 100 ఖర్చుపై 10X రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి.
ఇంకా ఏదైనా ఇతర ఖర్చులపై, ప్రతి INR 100 ఖర్చుకు 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది.
రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడం ఎలా?
0ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్‌లో బాకీ ఉన్న బ్యాలెన్స్‌ని చెల్లించడానికి ఉపయోగించవచ్చు. లేదా మీరు SBI వెబ్‌సైట్‌లో లిస్ట్ ఔట్ చేయబడిన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఈ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించవచ్చు.
SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ కు ఎలా దరఖాస్తు చేయాలి:
(how to apply sbi simply save card?)
మీరు SBI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా నేరుగా SBI యొక్క ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ యొక్క అదనపు ప్రయోజనాలు:-
(which is the other benefits in sbi simply save card?)
*ఇంధన సర్‌ఛార్జ్ (అదనపు సుంకము) మినహాయింపు
INR 500 నుండి INR 3,000 మధ్య జరిగే లావాదేవీలపై ఇంధనంపై 1% సర్‌ఛార్జ్ విధించబడదు.
*యాడ్-ఆన్ కార్డ్‌లు
ఈ సదుపాయం 18 ఏళ్లు పైబడిన పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, లేదా తోబుట్టువులకు అందుబాటులో ఉంటుంది.
*EMIలపై బ్యాలెన్స్ బదిలీ:-
ఈ ఖచ్చితమైన సదుపాయం SBI Simply ClICK క్రెడిట్ కార్డ్‌తో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఇక్కడ కార్డ్ హోల్డర్‌లు ఇతర క్రెడిట్ కార్డ్‌ల యొక్క బకాయి బ్యాలెన్స్‌ను Simply SAVE కి బదిలీ చేయవచ్చు మరియు నిర్దిష్ట సమయానికి తక్కువ వడ్డీ రేటుతో డబ్బును తిరిగి చెల్లించవచ్చు.
ఈజీ మనీ ( Easy Money):-
అవసరమైన సమయంలో మెయిలింగ్ చిరునామాకు డెలివరీ చేయబడిన క్రెడిట్ పరిమితికి అనుగుణంగా మీరు చెక్‌ను పొందవచ్చు. ఇక్కడ వడ్డీ 2.45% + 1.5% లేదా INR 199, ఏది ఎక్కువైతే అది వసూలు చేయబడుతుంది. దీని కోసం మీ అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
SimplySAVE SBI క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:-
(necessary documents)
SimplySAVE క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ప్రతి కస్టమర్‌కు మారుతూ ఉంటాయి. ఈవిధమైన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితా క్రింద ఉంది.
ఏదైనా identity కార్డు
Address proof
PAN card
Passport size photograph
Income proof document
Bank Statement
ఆన్‌లైన్‌లో SBI సింప్లీసేవ్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
(how to apply sbi simply save credit card in online?)
ఆన్‌లైన్‌లో SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ప్రత్యామ్నాయంగా, మీరు ఆన్లైన్ ద్వారా కూడా కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఆకర్షణీయమైన భాగస్వామి (partnership) ఆఫర్‌లతో మిమ్మల్ని ఆనందపరుస్తుంది.
SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయడానికి ఈ సూచనలు పాటించాలి.
(follow the instructions)
1: పేజీలోని ‘అర్హతను చెక్ చేయి’ అనే బటన్‌పై క్లిక్ చేయండి.
2: కార్డ్ కోసం అప్లై చేయడానికి మీ అర్హతను తెలుసుకోవడానికి అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
3: అర్హత ఉన్న దరఖాస్తుదారుడు ఆన్‌లైన్ అప్లికేషన్ పేజీకి మళ్లించబడతారు.
4: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి తర్వాత ‘సబ్మిట్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
5: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత, మీరు మీ బ్యాంకు అకౌంట్ కు లింకు చేసిన మొబైల్ నంబర్‌లో అప్లికేషన్ IDతో పాటు రసీదు యొక్క సందేశాన్ని అందుకుంటారు. ఈ మెసేజ్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యొక్క స్టేటస్ ని ట్రాక్ చేయవచ్చు.
లాభాలు మరియు నష్టాలు (Credit card Disadvantages)
ఆఫ్‌లైన్ ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్స్
అన్ని రకాల ఆఫ్‌లైన్ ఆఫర్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రివార్డ్ పాయింట్‌లను పొందడానికి గరిష్ట పరిమితి లేదు.
ఆన్‌లైన్ షాపింగ్ కోసం కేవలం 1 రివార్డ్ పాయింట్ మాత్రమే ఉంది, ఇది చాలా తక్కువ.
వెల్కమ్ రివార్డ్ పాయింట్‌ని పొందడానికి, మీరు ముందుగా INR 2,000 ఖర్చు చేయాలి.
SBI SimplySAVE credit card కిరాణా, కూరగాయలు మరియు ఇతర వాటితో సహా ఆఫ్‌లైన్ కొనుగోళ్ల కోసం ఉపయోగించే ఒక సాధారణ పాయింట్-ఆధారిత క్రెడిట్ కార్డ్ గా ఉపయోగపడుతుంది.
1) SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డు పై వడ్డీ లేకుండా గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ?
A) క్లెయిమ్ బట్టి 20 నుండి 50 రోజులు వరకు ఉంటుంది.
A) క్లెయిమ్ బట్టి 20 నుండి 50 రోజులు వరకు ఉంటుంది.
2) SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డు లో రివార్డ్ పాయింట్ల గడువు ముగుస్తుందా?
A) SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డు లో మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్ల గడువు 2 సంవత్సరాల తరువాత ముగుస్తుంది.
A) SBI సింప్లీసేవ్ క్రెడిట్ కార్డు లో మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్ల గడువు 2 సంవత్సరాల తరువాత ముగుస్తుంది.
3) వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
A) నెలకు వడ్డీ రేటు Rs 25 లేదా 3.35% ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లించాల్సి ఉంటుంది.
A) నెలకు వడ్డీ రేటు Rs 25 లేదా 3.35% ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లించాల్సి ఉంటుంది.