Sukanya Samriddhi Yojana In Telugu – ఆడపిల్లల విద్యా, వివాహానికి అద్భుతమైన గవర్నమెంట్ స్కీం Rs 2,50/- రూ ||ల కే

                       Sukanya Samriddhi Yojana Details  In Telugu

post office interest rate april 2023

• అసలు పోస్ట్ ఆఫిస్ SSY పథకం అంటే ఏమిటి? ( What Is Post Office SSY Scheme ?)

SSY అంటే సుకన్య సమృద్ధి యోజన( Sukanya Samriddhi Yojana ). బాలికల కొరకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ద్వారా నడుపబడే ఒక సేవింగ్ పథకం.

దేశంలో సామాన్య మరియు మధ్య తరగతి కుటుంబాలలో ఉండే ఆడ పిల్లల యొక్క విద్య మరియు వివాహం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం
22 జనవరి 2015 లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించింది.
ఈ స్కీం లో వడ్డీ రేట్ ఎప్పుడు లాభందయాకంగానే ఉంటుంది.

 

• సుకన్య సమృద్ధి యోజన పథకం ఎలా పనిచేస్తుంది? ( How Does Its Work )

ఈ స్కీం లో అతి తక్కువ అమౌంట్ తోనే ప్రతీ నెల కొద్దిగా అమౌంట్ ని అమ్మాయి పేరు మీద డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది.డిపాజిట్ అమౌంట్ పై సమయానుసరంగా పోస్ట్ ఆఫీస్ వడ్డీని అందివ్వడం జరుగుతుంది. పాలసీ సమయం ముగియగానే డిపాజిట్ అమౌంట్ + మొత్తం వడ్డీని కలిపి అందివ్వడం జరుగుతుంది.
అలాగే పాలసీ సమయం మొత్తం ఈ స్కీం లో అమౌంట్ చెల్లించవలసిన అవసరం ఉండదు.అయినప్పటికీ చివరి 6 సంవత్సరాలు వడ్డీ యధావిధిగా లభిస్తుంది.

 

సుకన్య సమృద్ధి యోజన పధకం వివరాలు ఇప్పుడు తెలుసుకొందాం !

 

• SSY స్కీం యొక్క ప్రయోజనాలు? ( Benefits Of SSY Scheme )

1. ఈ స్కీం లో లభించే వడ్డీ పై గాని ( Earned Interest ), మధ్యలో విత్ డ్రాల్ ( Withdrawal ) చేసే అమౌంట్ పై గాని ఎటువంటి TDS చార్జలు కట్ చెయ్యడం జరగదు.
అలాగే చివర్లో లభించే మెట్యూరిటీ అమౌంట్ కూడా 100% Tax రహితంగా అందివ్వడం జరుగుతుంది.

2. ప్రత్యేకంగా అమ్మాయిలు కోసమే ఈ స్కీం రూపొందించబడింది.
సామాన్యులు కూడా సంవత్సరానికి కనీసం Rs.250/- రూపాయలు మాత్రమే జమా చేసి స్కీం లో కొనసాగవచ్చు.

3. గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది. 100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది.

4. క్రమం తప్పకుండా ప్రతీ 3 నెలలకు వడ్డీ డైరెక్టుగా ఖాతాలో జామచేయబడుతుంది.

5. మిగిలిన సేవింగ్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుంది.

6. ఉన్నత చదువు మరియు వివాహం కొరకు మెట్యూరిటీ కంటే ముందుగానే నగదు విత్ డ్రా చెయ్యవచ్చు.

7. నామినీ మరియు ప్రీ మెట్యూర్ క్లోజర్ ఫెసిలిటీలు అందుబాటులో ఉంటాయి.

Eligibility Of SSY :-

 

• సుకన్య సమృద్ధి యోజన పథకానికి అర్హులు ఎవరు? ( Who can be The SSY Account?)

1. అప్పుడే జన్మించిన అమ్మాయి దగ్గర నుంచి అత్యధికముగా 10 సంవత్సరాలలోపు అమ్మాయిల వరకూ ఈ స్కీం వర్తిస్తుంది.

2. ఒక అమ్మాయికి కేవలం ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.

3.  ఒక కుటుంబంలో అత్యధికముగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.

4.  అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత SSY అకౌంట్ ని స్వయంగా మేనేజ్ చేసుకోవచ్చు.

5.  కేవలం ఒక్క సందర్భంలో మాత్రమే కుటుంబంలో అత్యధికముగా 3 బాలికలకు ఈ స్కీం వర్తిస్తుంది.

•6. రెండవ కాన్పులో కవలలు జన్మించినట్లయితే 3 డవ అమ్మాయి కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. కానీ మొదటి కాన్పులో కవలలు జన్మించి, రెండవ కాన్పులో అమ్మాయి జన్మిస్తే, మొదటి ఇద్దరికీ మాత్రమే స్కీం యొక్క ప్రయోజనం లభిస్తుంది.

7.  స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసే తల్లి తండ్రుల యొక్క వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

8.  NRI ( Non Resident Indians ) HUF ( Hindu Undivided Family) లకు అంటే భారతీయులు కాని వారికి ఈ స్కీం వర్తించదు.

9. దత్తత తీసుకోబడిన అమ్మాయిలకి కూడా స్కీం లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.
దత్తస్వీకార సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

 

• సుకన్య సమృద్ధి పథకం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ అమౌంట్ ఎంత? ( Deposit Limits Of Sukanya Samriddhi Yojana)

కనీస డిపాజిట్ అమౌంట్ సంవత్సరానికి       ( Minimum Yearly Deposit )       -Rs 2,50/-
అత్యధిక డిపాజిట్ అమౌంట్ సంవత్సరానికి ( Maximum Yearly Deposit )      -Rs 1,50,000/-

కాబట్టి SSY పథకంలో కనీసం Rs. 2,50/- రూపాయలు దగ్గర నుంచి అత్యధికముగా Rs.1, 50,000  డిపాజిట్ చెయ్యవచ్చు.

ముఖ్య గమనిక :- ఇక్కడ డిపాజిట్ అమౌంట్ ని నచ్చిన విధంగా సంవత్సరం లో ఎన్ని సార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కొద్దీ కొద్దిగా ఒక సంవత్సరం లో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్1, 50,000/- మించకూడదు.
ఉదాహరణకి 300 రూ ||లు , 400 రూ ||లు, 550 రూ ||లు, 5,000 రూ ||లు…ఇలా అన్నమాట…

 

SSY Scheme Period

 

Senior Citizens Saving Scheme In Telugu – “అత్యధిక వడ్డీని అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ పథకం” వీరికి మాత్రమే

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

 

• SSY స్కీం లో మనం ఎన్ని సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చెయ్యాలి? ( Amount Deposit Period of SSY )

ఈ స్కీం యొక్క సమయం( Scheme Period )= 21 సంవత్సరాలు.

2016 మార్చ్ కి ముందు 14 సంవత్సరాలు మాత్రమే ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసేలా నియమం ఉండేది, కానీ 2016 తర్వాత నుంచి 15 సంవత్సరాలు ఈ స్కీం లో అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది.

• స్కీం యొక్క చివరి 6 సంవత్సరాలు ఎటువంటి అమౌంట్ డిపాజిట్ చెయ్యవలసిన అవసరం ఉండదు.
అయినప్పటికీ చివరి 6 సంవత్సరాలు( 16 వ,17 వ,18 వ,19 వ,20 వ మరియు 21 వ )గవర్నమెంట్ వడ్డీని యధావిధిగా జమా చేస్తుంది.

 

• సుకన్య సమృద్ధి యోజన స్కీంలో ప్రస్తుతం వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( interest Rate Of SSY Scheme?)

ప్రస్తుతం ఈ స్కీం లో 8% గా వడ్డీరేట్ గవర్నమెంట్ అందివ్వడం జరుగుతుంది.

కానీ ఈ వడ్డీ రేట్ ఎప్పుడూ కచ్చితంగా ఉండదు. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ప్రతీ 3 నెలలకు ఒకేసారి వడ్డీని డిక్లేర్ చేస్తుంది. ఈ విధంగా సంవత్సరం మొత్తం లభించే వడ్డీని ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో జమాచేస్తుంది.

1. ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసే వారు తప్పకుండా ప్రతీ నెల 10 వ తారీకు లోపు మాత్రమే డిపాజిట్ చేసే ప్రయత్నం చెయ్యండి. 11 నుంచి 31 లోపు ఎప్పుడూ అమౌంట్ డిపాజిట్ చెయ్యవద్దు.

ఒకవేళ ఏదైనా నెలఈ సమయంలో అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోతే తర్వాత నెల జమా చెయ్యండి. ఎందుకంటే నెలలో 11 నుంచి 31 లోపు డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆ నెల మీకు వడ్డీ లభించదు.

 

ముఖ్య గమనిక : ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్లను గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.

 

Sukanya Samriddhi Yojana Example 

• పథకం యొక్క మెట్యూరిటీ ప్రయోజనాలను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం! ( Example )

తండ్రి పేరు ( Name )                           = Mr. రమణ
అమ్మాయి పేరు ( Name )                     = రాధ
వయసు ( Age )                                       = 5 సంవత్సరాలు
సంవత్సర డిపాసిట్ ( Deposit )          = లక్ష రూపాయలు
జమా చేయాల్సిన సమయం                = 15 సంవత్సరాలు

అంటే Mr. రమణ, 5 సంవత్సరాలు వయసు కలిగిన తన కుమార్తె కి ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చేస్తే 15 సంవత్సరాలు మాత్రమే అమౌంట్ డిపాజిట్ చేస్తాడు.

 

   ప్రస్తుతం వడ్డీ ( Interest ) = 7.60%

స్కీం లో డిపాజిట్ చేసిన మొత్తం డిపాజిట్ = Rs.15,00,00/-

స్కీం లో లభించే మొత్తం వడ్డీ = Rs. 31,53,397/-

మొత్తం మెట్యూరిటీ అమౌంట్ = Rs. 46,53,397/-

డిపాజిట్ అమౌంట్ కి 100% గవర్నమెంట్ గ్యారంటీ తోపాటు సుమారుగా డబల్ అమౌంట్ లభించే స్కీం సుకన్య సమృద్ధి యోజన.

దీనితోపాటుగా ఈ స్కీం లో లభించే వడ్డీ పై గాని , మధ్యలో విత్ డ్రాల్ చేసే అమౌంట్ పై గాని ఎటువంటి చార్జలు కట్ చెయ్యడం జరగదు.
అలాగే చివర్లో లభించే మెట్యూరిటీ అమౌంట్ కూడా 100% టాక్స్ రహితంగా అందివ్వడం జరుగుతుంది.

 

• పార్సియల్ విత్ డ్రాల్ ఫెసిలిటీ? ( Pre – Mature Withdrawal SSY?)

అంటే స్కీం మధ్యలో కొద్దిగా అమౌంట్ తీసుకొనే సదుపాయం. కేవలం రెండు సందర్భాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

అమ్మాయి యొక్క ఉన్నత చదువు( Higher Education ) మరియు వివాహం ( Marriage )కొరకు. అప్పుడు కూడా అమ్మాయి కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి లేకపోతే 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

• అత్యధికంగా 50% వరకూ అమౌంట్ విత్ డ్రాల్ చేసుకోవచ్చు. దీనికోసం విద్యాసంస్థలో అడ్మిషన్ కి సంబందించిన డాక్యుమెంట్ కచ్చితంగా జమాచెయ్యాలి.

ముఖ్య గమనిక :-
ఉదాహరణ కు మీకు 50 శాతం పార్సియల్ విత్ డ్రాల్ రూపంలో 5 లక్షలు తీసుకొనే అవకాశం ఉన్నప్పటికీ అమ్మాయి చదువు కై 2 లక్షలే అవసరం ఐతే, మీకు మొత్తం అమౌంట్ లభించడం జరగదు. ఫీజు వరకూ మాత్రమే అందివ్వడం జరుగుతుంది.

 

• ప్రీ – మెట్యూర్ క్లోజర్ ఫెసిలిటీ? ( Pre – Mature Closer Is Available In  Sukanya Samriddhi Yojana)

అంటే స్కీం యొక్క సమయం కంటే ముందే స్కీం క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందడం. దీనికోసం కింద షరతులు వర్తిస్తాయి

 

1.స్కీం సమయం మధ్యలో బాలిక మరణించినప్పుడు.

2.  స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యలేని పరిస్థితుల్లో.

3.  స్కీం మధ్యలో బాలిక విదేశీ నాగరికత పొందిన సందర్భాలలో ఈ స్కీం ని క్లోజ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది.

 

• SSY  సేవింగ్ పథకాన్ని ఎక్కడ ఓపెన్ చెయ్యాలి?( Where can you open account )

మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ శాఖలో అయినా సరే SSY అకౌంట్ ని సులభంగా ఓపెన్ చెయ్యవచు.

గుర్తింపు పొందిన అన్ని జాతీయ బ్యాంకుల్లో ( All Nationalised Banks )

ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ స్కీం ని ఓపెన్ చెయ్యవచ్చు. ( Available In All Private Banks)

 

• నామినీ ఫెసిలిటీ? ( Nominee Facility Of SSY Scheme?)

సుకన్య సమృద్ధి యోజన లో నామినీ ఫెసిలిటీ ఉండదు. బాలిక ఏ కారణంగా మరణించినా స్కీం క్లోజ్ చేసి తల్లి లేదా తండ్రి కి ఎవరైతే స్కీంలో అమౌంట్ చెల్లెస్తున్నారో వారికి అందివ్వడం జరుగుతుంది.

 

SSY ఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( SSY Documents Required?)
  1. 1.అప్లికేషన్ ఫారం ( Account Opening Form )
    2. రెండు పాసుపోర్టు ఫొటోలు ( 2 Photos )
    3.  ఆధార్ కార్డు ( Adar Card )
    4.  పాన్ కార్డు ( PAN Card )

• పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై ( Address Proof )

1. కరెంటు బిల్ ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్ ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్ ( Bank Statement )
4. పాస్ పోర్ట్ ( Passport )

 

https://www.indiapost.gov.in/Financial/Pages/Content/Post-Office-Saving-Schemes.aspx

 

• సుకన్య సమృద్ధి స్కీం లో రెగ్యులర్ గా అమౌంట్ చెల్లించకపోతే ఏమవుతుంది? ( In Active Account?)

సంవత్సరానికి Rs.50/- పెనాల్టీ ( Fine )చెల్లించి మళ్ళీ అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

 

ప్రశ్నలు – సమాధానాలు ( Question &Answers )

 

1. సుకన్య సమృద్ధి స్కీంa లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడం సరియైన నిర్ణయం? (  SSY investment is profitable ?)

Ans : ప్రస్తుతం గవర్నమెంట్ సెక్యూరిటీ తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. 8.6% వడ్డీరేట్ నుంచి 7.1% గా తగ్గిపోతూ వస్తుంది.

 

2. అమ్మాయిలకి కాకుండా ఇన్వెస్ట్మెంట్ కి ఈ స్కీం బెట్టరేనా? ( SSY good scheme for investment rather than girls ?)

Ans :   కాదు. No

 

3. SSY స్కీం కి అర్హులు ఎవరు? ( Who is eligible to SSY scheme ?)

Ans :    10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు.

 

4.  దీర్ఘాకాలం  పొదుపు చెయ్యడానికి PPF, SSY ఏది మంచిది? ( Which is the best investment option SSY or PPF?)

Ans :     SSY కేవలం ఆడపిల్లకి మాత్రమే వర్తిస్తుంది.
మంచి పొదుపుకై PPF బెటర్.

 

5. SSY స్కీం యొక్క కనీస డిపాజిట్ అమౌంట్ ఎంత? ( What is the minimum deposit of SSY?)

Ans :  కేవలం సంవత్సరానికి Rs 2,50/- మాత్రమే.

 

6. ఒకే వ్యక్తి PPF మరియు SSY అకౌంట్స్ లో అమౌంట్ డిపాజిట్ చేయవచ్చా?( Can a single person deposit amount in PPF & SSY ? )

Ans :  చెయ్యవచ్చు. Yes    అత్యధికముగా Rs 1,50,000/- సంవత్సరానికి.

 

7. చిల్డ్రన్స్ కి SBI life  స్మార్ట్ స్కాలర్ (Smart Scholar Plan ) మంచిదా లేక SSY? ( Which is the best plan to children SSY or Smart Scholar?)

Ans : ఈ రెండింటిలో SSY బెటర్, ఎందుకంటె స్మార్ట్ స్కాలర్ ULIP ప్లాన్ షేర్ మార్కెట్ తో సంబంధం కలిగివుంటుంది.

 

8. మాట్యూరిటీ కంటే ముందుగానే SSY స్కీం ని క్లోజ్ చేయవచ్చా? (  Pre-mature withdrawal is available in SSY ?)

Ans :  చెయ్యవచ్చు!.Yes

 

9. SSY స్కీం లో  అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి సరియైన సమయం ఏది? ( What is the best to invest SSY ?)

Ans : నెల ప్రారంభం నుంచి 10 వ తారీకు లోపు.

 

10. SSY అకౌంట్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఓపెన్ చేయడం ద్వారా భద్రత లోపిస్తుందా?(  Is SSY safe in private banks ?)

Ans : రిస్క్ ఉండదు, ఏ బ్యాంకులో జమాచేసిన అమౌంట్ అయినా గవర్నమెంట్ కే చేరుతుంది.

 

11. సామాన్య, మధ్యతరగతి వారికి SSY ఎంతవరకు బెనిఫిట్? ( Is SSY scheme good for ordinary ,middleclass people?)

Ans :  100% ప్రయోజనం ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది. కావాల్సిన సమయానికి డబ్బు ఖచ్చితంగా అందుతుంది.

 

12. దత్తత తీసుకోబడ్డ అమ్మాయి కి, దత్తత సర్టిఫికెట్ లేకపోతే స్కీంలో అమౌంట్ డిపాజిట్ చేయవచ్చా? ( Can an adopted girl enter without Adopt certificate?)

     Ans :  ఖచ్చితంగా ఉండాలి. No

 

13. SSY స్కీం లో తగ్గుతున్న వడ్డీరేట్ వల్ల లభించే మాట్యూరిటీ ఆ సమయంలో తక్కువ అవ్వచ్చు. సేవింగ్ చెయ్యడానికి మరొక ఆప్షన్ ఉందా?

Ans :  ఉంది. Yes    SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ( Systematic Investment Plan )

 

 

• ముగింపు ( Conclusion )

పోస్ట్ ఆఫీస్ SSY స్కీం కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *