LIC Bima Jyoti 860 -” బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ “

                                             LIC Bima Jyoti Details In Telugu

LIC Bima Jyoti

.   జ్యోతి పాలసీ అంటే ఏమిటి? ఏ విధంగా పనిచేస్తుంది? (What Is LIC Bima Jyoti Policy, How does It’s Work?)

LIC భీమా జ్యోతి ఒక నాన్ లింకేడ్ లిమిటెడ్ ప్రీమియం సేవింగ్ ఇన్సూరెన్స్ పాలసీ. (
Non Linked Limited Premium &
Saving Insurance Policy). ఈ పాలసీలో బోనస్ ను ఫిక్స్ గా 100% గ్యారెంటీ రూపంలో LIC పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది.

భీమా జ్యోతి పాలసీలో పాలసీదారుడు నిర్ణయించుకొన్న పాలసీ సమయం కంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు. పాలసీ పూర్తి అయిన తర్వాత బోనస్ తో కలిపి మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది. ఏదైనా కారణంగా పాలసీ సమయం మధ్యలో పాలసీదారుడు మరణించినట్లయితే నామినీ కి మరణ ప్రయోజనం రూపంలో డెత్ బెనిఫిట్ లభిస్తుంది.

 

LIC కొత్త భీమా జ్యోతి పాలసీ యొక్క టేబుల్ నెంబర్( Table No )   =   860
         2021 ఫిబ్రవరి 22 న LIC భీమా జ్యోతి పాలసీని ప్రారంభం చేసింది.

 

LIC Bima Jyothi -" బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ "

 

 

• పాలసీ లో ఉన్న అతి ముఖ్యమైన  ప్రయోజనాలు ఏమిటి?  ( Key Features Of LIC New Bima Jyoti )

1 .ఇది ఒక నాన్ లింక్డ్ పాలసీ( Non Linked Plan ),  అంటే ఈ పాలసీలో  మీరు చెల్లించే ప్రీమియం డబ్బులను  LIC సంస్థ షేర్ మర్కెట్స్ లో  ఇన్వెస్ట్మెంట్ చెయ్యదు, కాబట్టి  మీ డబ్బులు ఈ పాలసీలో  భద్రంగా ఉంటాయి.

2. భీమా జ్యోతి ఒక  లిమిటెడ్ ప్రీమియం పాలసీ ( Limited Premium Paying Policy ). కాబట్టి పాలసీ సమయం మొత్తం ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ ఇన్సూరెన్స్ మరియు బోనస్ ప్రయోజనాలు యధావిధిగా పాలసీ చివరి వరకూ లభిస్తాయి.

3.  మెట్యూరుటి మరియు మరణ ప్రయోజనాలు లభిస్తాయి.

4. పాలసీదారునికి  రెగ్యులర్ ప్రీమియం(Regular Premium Payment ) చెల్లించే అవకాశం ఉంటుంది.

5. 18 సంవత్సరాల లోపు పిల్లలుకి పాలసీ వర్తిస్తుంది మరియు ప్రీమియం వైవర్ బెనిఫిట్ లభిస్తుంది,అత్యధిక మరణ ప్రయోజనం 125% గా వర్తిస్తుంది.

6. అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండే విధంగా  అతి తక్కువ ప్రీమియం కే ఆక్సిడెంట్, ఆరోగ్య, టర్మ్, ప్రీమియం మాఫీ ఆదారిత 5 రైడర్ లను భీమా జ్యోతి పాలసీలో ప్రవేశపెట్టడం జరిగింది.వీటి గురించి ముందు విస్తరంగా తెలుసుకొందాం!

7. కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీల హెచ్చు తగ్గులతో ఎటువంటి సంబంధం లేకుండా బోనస్ 100 శాతం గ్యారెంటెడ్ అడిషన్ (Guaranteed Addition Bonus ) రూపంలో అందివ్వడం జరుగుతుంది.

8 .పాలసీలో డిపాజిట్  చేసే ప్రీమియంపై మరియు లభించే అమౌంట్ పై ( Maturity + Death ) ఇన్కమ్ టాక్స్ మినహాయింపు లభిస్తుంది,అత్యధిక భీమా మరియు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్ లభిస్తుంది.

 

•  LIC భీమా జ్యోతి పాలసీలో  ప్రస్తుతం మనకి ఎంత  బోనస్ లభిస్తుంది? (New Bonus Rates Of  LIC  Bima Jyoti ?)

LIC బోనస్ రేట్స్ ని సంవత్సరానికి ఒకసారి  ప్రతీ ఆర్థిక సంవత్సరంలో  పాలసీదారులకు  అందిస్తుంది.
బోనస్ రేట్స్ వేరు వేరు పాలసీలకు వేరే వేరు గా లభిస్తాయి మరియు లభించే బోనస్  పాలసీ సమయం పై  ఆధారపడి ఉంటాయి.
కానీ భీమా జ్యోతి పాలసీలో  బోనస్ గ్యారెంటీ అడిషన్( Guaranteed Addition )రూపంలో  పాలసీ సమయం మొత్తం హెచ్చు తగ్గులు లేకుండా ఒక్కలానే మీకు అందివ్వడం జరుగుతుంది.

 

భీమా జ్యోతి పాలసీలో ప్రతీ Rs.1,000/- రూపాయలు కి Rs.50 /-రూపాయలు గా బోనస్ నిర్దేశించడం జరిగింది.
బోనస్ లభించే విధానం  గురించి ముందు ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం.

 

LIC Bima Jyoti   Eligibility – అర్హులు ఎవరు?

 

•LIC భీమా జ్యోతి పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take This Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 90 రోజులు.
అత్యధిక వయస్సు  (maximum Age ) = 60 సంవత్సరాలు.

కనుక 3 నెలల వయసు ఉన్న చిన్న పిల్లల  నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

 

• ఈ పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? (  Policy Term Of  LIC Bima Jyoti ? )

కనీస పాలసీ సమయం వచ్చి  (Minimum Policy Period ) =  15 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం  ( Maximum Policy Period )    =   20 సంవత్సరాలు.

కాబట్టి మీరు  ఈ పాలసీ యొక్క సమయాన్ని   15 నుంచి  20 సంవత్సరాల మధ్య  నిర్ణయించుకోవచ్చు.

 

• భీమా జ్యోతి పాలసీ యొక్క  కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured Of Bima Jyoti )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి = Rs1, 00, 000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి కి ఎటువంటి  అవధి లేదు.

కనీసం లక్ష రూపాయలు నుంచి  అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు, కానీ ఇది మీయొక్క  వార్షిక  ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

 

 

• భీమా జ్యోతి పాలసీ యొక్క కనిష్ఠ మరియు గరిష్ట మెట్యూరిటీ  సమయం ఎంత? ( Maturity Age Of   Bima Jyoti ? )

ఈ పాలసీయొక్క కనిష్ఠ మెట్యూరిటీ కాల పరిమితి ( Minimum Maturity Age )= 18 సంవత్సరాలు గా  ఉంటుంది.
ఈ పాలసీయొక్క గరిష్ట మెట్యూరిటీ కాల పరిమితి ( Maximum Maturity Age )= 75 సంవత్సరాలు గా  ఉంటుంది.

అంటే ఈ పాలసీని మనం అత్యధికంగా 20 సంవత్సరాల వరకూ మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది,   కాని  60 సంవత్సరాల ఒక వ్యక్తికి  ఈ పాలసీ 15  సంవత్సరాలు  మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే  పాలాసియొక్క గరిష్ట  మెట్యూరిటీ  75 సంవత్సరాలు కాబట్టి.

 

• పాలసీ మధ్యలో అప్పటివరకు మనం చెల్లించిన  ప్రీమియంపై  లోన్ లభిస్తుందా?  లేదా? ( Loan Facility of LIC Bima Jyoti )

భీమా జ్యోతి పాలసీలో పాలసీదారుడు  కనీసం 2 సంవత్సరాలు  ఎటువంటి అంతరాయం లేకుండా  పూర్తి ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమా  చేసిన  ప్రీమియం పై  లోన్ కూడా పొందవచ్చు.

అది ఎంత అంటే మీయొక్క సరెండర్ వేల్యూకి 90% గా లోన్ లభిస్తుంది. లోన్ పై  వడ్డీరేటును  LIC సంస్థ నిర్ణయిస్తుంది. బ్యాంకు కంటే తక్కువ వడ్డీ ఈ లోన్ పై అందుబాటులో ఉండవచ్చు.

 

• భీమా జ్యోతి పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Payment Mode Of Bima Jyoti ?)

ఈ పాలసీలో  4 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి     – Yearly
2. 6 నెలలకు ఒకసారి           – Half Yearly
3. నెలలకు  ఒకసారి             – Quarterly
4. ప్రతినెలా                            – Monthly

ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో  నిర్ణయించుకొన్న  మోడ్ ఆధారంగా  ప్రీమియం చెల్లించవచ్చు.

ముఖ్య గమనిక : ఈ ప్రీమియంని చెల్లించడానికి  పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా  ఆన్ లైన్లో  గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు  ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం LIC సంస్థ కల్పించింది.

 

LIC Bima Ratna Plan 864 &ఎల్ .ఐ. సి కొత్త మనీ బ్యాక్ పాలసీ , మెట్యూరిటీ , 100 % గ్యారెంటీ బోనస్ ,పూర్తి వివరాలివే !

 

PNB MetLife Mera Term Plan Telugu &నెలాకు Rs 50 వేలు లభించేలా కుటుంబానికి భద్రత కల్పించండి, పూర్తి వివరాలు!

• భీమా జ్యోతి పాలసీలో చెల్లించే ప్రీమియంపై  డిస్కౌంట్ ఎంత లభిస్తుంది?  ( Premium  Rebate Of LIC New Bima Jyoti ? )

1.  సంవత్సరానికి ఒకసారి  – Yearly             = 2%
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly    = 1%
3. 3 నెలలకు  ఒకసారి        – Quarterly       = Nil
4. ప్రతినెలా                          – Monthly         = Nil

ఇక్కడ రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై కొద్దిగ డిస్కౌంట్ రూపంలో తగ్గించడం జరుగుతుంది. ఈ పాలసీలో సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి  ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

• భీమా జ్యోతి పాలసీలో తీసుకొనే భీమాపై  ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? ( Rebate On The  high basic Sum Assured? )

   భీమా ( Basic Sum Assured )                     రిబేట్
1. 1, 00, 000 నుంచి  2, 75, 000                  = Nil
2. 3, 00, 000 నుంచి  4, 75, 000                 = 4%
3. 5, 00, 000 నుంచి  9, 75, 000                  = 5%
4. 10, 00, 000 నుంచి  అత్యధికముగా           = 6%

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో మీకు  రిబేట్ లభిస్తుంది.

 

ఉదాహరణ : 1     LIC Bima Jyothi  Example

• భీమా జ్యోతి పాలసీలో ఎంత భీమాకి మెట్యూరిటీ ఎంత లభిస్తుంది?  ఒకవేళ పాలసీదారుడు  పాలసీ మధ్యలో ఏ కారణంచేత  మరణించినా  నామినీ కి  ఎటువంటి ప్రయోజనాలు LIC సంస్థ అందిస్తుందన్న విషయాన్నీ ఒక సరళమైన  ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం !
        >(  What is The   LIC Bima Jyoti Maturity and Deaths Benefits? )

 

పాలసీదారుని పేరు(  Name )                                 – Mr. హరిప్రసాద్
వయసు (Age )                                                           – 35 సంవత్సరాలు
పాలసీ సమయం( Period )                                     – 20 సంవత్సరాలు
భీమా  ( Bhima )                                                        – 5 లక్షలు
ప్రీమియం చెల్లించవలసింది(  Paying )               – 15 సంవత్సరాలు
చెల్లించే విధానం( Mode )                                        – ప్రతినెలా

నెలసరి ప్రీమియం   – Rs 3,700/-( ఈ  ప్రీమియం GST  మరియు Term Rider చార్జీలతో కలిపి )

హరిప్రసాద్ ప్రతినెలా ఈ పాలసీలో  Rs.3,700/- రూపాయలు చొప్పున 15 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  = Rs 6,34,605/- అవుతుంది..

 

• మెట్యూరిటీ ప్రయోజనం (Maturity  Benefit ):-

 

హరిప్రసాద్ పాలసీ చివరివరకు జీవించి ఉన్నట్లైతే ఈ విధంగా మెట్యూరిటీ లభిస్తుంది.

మెట్యూరిటీ = ప్రాథమిక భీమా + గ్యారెంటెడ్ అడిషన్

“Maturity = Basic Sum Assured + Guaranteed Addition ”

కాబట్టి  పాలసీ   యొక్క  20 వ  సంవత్సరం మెట్యూరిటీగా

తీసుకొన్న భీమా ( Sum Assured )           = Rs.5, 00, 000/-

గ్యారెంటెడ్  బోనస్   ( GA Bonus )             = Rs.5, 00, 000/-

మొత్తం కలిపి ( Total Maturity )     = Rs.10, 00, 000/-      Mr. హరిప్రసాద్ కి ఈ పాలసీలో  మెట్యూరిటీగా లభిస్తాయి.
గణింపు = 5 లక్షల భీమకి సంవత్సరానికి Rs.25,000/- చొప్పున 20 సంవత్సరాలకి = 5 లక్షలు.

 

 

• LIC సంస్థ కొత్తగా అందించిన   మెట్యూరిటీ సెటిల్మెంట్ విధానం ఈ పాలసీకి వర్తిస్తుందా?
(What Is Maturity Settlement In  LIC )

 

1.  వర్తిస్తుంది! ఈ విధానం ద్వారా Mr. హరిప్రసాద్ మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.

లేదా

2. వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది. ఆ విధంగానే  మీకు రెగ్యు లర్ గా ఈ మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

ముఖ్య గమనిక : ఈ ఎంపికను పాలసీదారుడు  కనీసం 3 నెలలు ఇంకా పాలసీ సమయం మిగిలి ఉండగానే సంస్థకి  తెలియచేయాల్సి ఉంటుంది.

 

• ఒకవేళ Mr. హరిప్రసాద్  పాలసీ సమయం మధ్యలో ఏదైనా కారణంగా మరణిస్తే నామినీకి లేదా అతని కుటుంబానికి  మరణ ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది?
                        ( LIC New Bima Jyoti Death Benefit? )

 

మరణ ప్రయోజనం = 125% Of ప్రాథమిక భీమా +గ్యారెంటెడ్ బోనస్ ఈ పాలసీలో  నోమినికి లభిస్తుంది.
(Death Benefit = 125% Of  Basic Sum Assured  + Guaranteed Addition Bonus )

 

డెత్ బెనిఫిట్ కి సంబంధించి గ్యారెంటెడ్ అడిషన్ బోనస్ 5% Of Basic Sum Assured అంటే ప్రాథమిక భీమాకి 5% గా ప్రతీ సంవత్సరం లభిస్తుంది.

• Mr. రవి పాలసీ తీసుకొన్న 5 సంవత్సరాల తర్వాత మరణించితే = Rs 6,25,000 +1, 25,000 = Rs 7,50,000/- నామినీ కి అందిస్తారు.

• ఒకవేళ ప్లాన్ తీసుకొన్న 10 వ సంవత్సరం తర్వాత మరణించితే =Rs 6,25,000 +2, 50,000 =Rs 8,75,000/- నామినీ కి లభిస్తాయి.

 

ముఖ్య గమనిక :-

1. ఈ పాలసీలో  పాలసీదారుడు పాలసీ తీసుకొన్న 3 సంవత్సరాలలోపు  ఏ కారణంగా మరణించినా  అప్పటివరకు చెల్లించిన  ప్రీమియం కి  7 రెట్లు అమౌంట్ మాత్రమే మరణ ప్రయోజనం గా  నామినీకి లభిస్తుంది.

2. ఒకవేళ   పాలసీదారుడు పాలసీ తీసుకొన్న 3 సంవత్సరాల తర్వాత   ఏ కారణంగా మరణించినా  అప్పుడు ప్రాథమిక భీమాకి   125% + అప్పటివరకు అతనికి లభించే బోనస్  గా LIC సంస్థ అందిస్తుంది.

 

ఉదాహరణ : 2  Example

అమ్మాయి వయసు ( Age Of Child )                     – 5 సంవత్సరాలు 

పాలసీదారుని పేరు(  Name )                                 – Mr. హరిప్రసాద్     
వయసు (Age )                                                            – 35 సంవత్సరాలు
పాలసీ సమయం( Period )                                       – 20 సంవత్సరాలు
భీమా  ( Bima )                                                         – 5 లక్షలు
ప్రీమియం చెల్లించవలసింది(  Paying )                 – 15 సంవత్సరాలు
చెల్లించే విధానం( Mode )                                        – ప్రతినెలా
నెలసరి ప్రీమియం   =Rs 3,500/-( ఈ  ప్రీమియం GST మరియు  Premium Waiver Rider చార్జీలతో కలిపి )

హరిప్రసాద్ ప్రతినెలా ఈ పాలసీలో  Rs.3,500/- రూపాయలు చొప్పున 15 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  =Rs. 6,05,220/- అవుతుంది.

 

         హరిప్రసాద్  LIC Bima Jyoti పాలసీలో చివరి వరకూ జీవించిఉన్న ట్లయితే
        • మెట్యూరిటీ ప్రయోజనం (Maturity  Benefit )

        మెట్యూరిటీ = ప్రాథమిక భీమా + గ్యారెంటెడ్ అడిషన్

“Maturity = Basic Sum Assured + Guaranteed Addition ”

కాబట్టి  పాలసీ   యొక్క  20 వ  సంవత్సరం మెట్యూరిటీగా

తీసుకొన్న భీమా ( Sum Assured )       = Rs.5, 00, 000/-

గ్యారెంటెడ్ అడిషన్ బోనస్( GAB )      = Rs.5, 00, 000/-

మొత్తం కలిపి ( Total Maturity )    = Rs.10, 00, 000/-    Mr. హరిప్రసాద్  కుమార్తె కి ఈ పాలసీలో  మెట్యూరిటీగా లభిస్తాయి.

పాలసీ మధ్యలో హరిప్రసాద్ ఏదైనా కారణంగా మరణించినట్లయితే

 

• వెంటనే అమ్మాయికి ప్రాథమిక భీమా Rs. 5,00,000/- లభిస్తాయి.

• తర్వాత నుంచి పాలసీలో ప్రీమియం మొత్తం చివరి వరకూ LIC సంస్థ చెల్లిస్తుంది.

• మెట్యూరిటీ సమయంలో ప్రాథమిక భీమా Rs. 5,00,000/- + బోనస్ Rs.5,00,000/- యధావిధిగా హరిప్రసాద్ కుమార్తె కి LIC                               అందిస్తుంది.

   కాబట్టి చిల్డ్రన్స్ కి ప్రీమియం వైవర్ బెనిఫిట్ త ప్పనిసరి. రైడర్ యొక్క పూర్తి వివరాలు ముందు చూద్దాం!

 

ముఖ్య గమనిక :- కామెన్స్ మెంట్ అఫ్ రిస్క్ ( commencement Of Risk )

 

1. 8 సంవత్సరాలలోపు చిల్డ్రన్స్ కి ఈ పాలసీని తీసుకొంటే, పాలసీ తీసుకొన్న 2 సంవత్సరాల  తర్వాత నుంచి రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.

2. ఒకవేళ 8 సంవత్సరాలు పైబడిన చిల్డ్రన్స్ కి అయితే రిస్క్ కవరేజ్ వెంటనే వర్తిస్తుంది.

 

 

• LIC భీమా జ్యోతి   రైడర్స్  (  LIC Bima Jyoti benefit Riders)

ఈ పాలసీ 5  ముఖ్య  రైడర్ ప్రయోజనాలను కలిగి ఉంది. రైడర్స్ కేవలం మినహాయింపు మాత్రమే. అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు లేదా వదిలి పెట్టవచ్చు.

 

1. ఆక్సిడెంట్  డెత్ మరియు  డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death  And Disability Benefit Rider – UIN  512B209V02)

ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా  అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

పాలసీదారునికి 70 సంవత్సరాల  వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే  ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.ఇది మొదటి ప్రయోజనం.

 

2 .డిసబిలిటీ ప్రయోజనం ( Disability )

పాలసీదారునికి ఆక్సిడెంట్ జరిగింది కానీ ఆక్సిడెంట్ లో మరణించలేదు, డిజాబిలిటీ కి గురయ్యాడు అంటే ఆక్సిడెంట్ లో ప్రాథమిక అవయవాలు కోల్పోయి ఏ పనిచేయలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది.

దీనితోపాటుగా  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :  ఈ  ప్రయోజనం కొరకు ఆక్సిడెంట్ జరిగిన 180 రోజులు లోపు మీరు సంస్థకి సమాచారాన్ని అందివ్వాల్సివుంటుంది.

 

2. టర్మ్ రైడర్  ( Term Rider – UIN 512B210V01) :- LIC Bima Jyoti 

ఇది ఒక టర్మ్ పాలసీలా  పనిచేస్తుంది. ఈ రైడర్   పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.

టర్మ్ రైడర్  ముఖ్య ప్రయోజనం ఏమిటి ?

పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది.

అంటే =Rs. 6,25,000 + 5,00,000 =Rs. 11,25,000/- నామినికి మరణ ప్రయోజనంగా లభిస్తుంది.

 

3. కొత్త  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ ( Critical Illness Benefit Rider – UIN 512A212V02)

ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో  ఆరోగ్య భీమా  ప్రయోజనం కలిగిస్తుంది.
అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.

దీనికోసం LIC సంస్థ  15 గంభీరమైన  వ్యాధులకు సంబందించిన  ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన  ఈ ప్రయోజనం  వర్తిస్తుంది.

ఈ రైడర్ నిమిత్తము కొద్దిగా ప్రీమియంని  అదనంగా  చెల్లించాలి.

 

4.ఆక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ -( Accidental Death Benefit Rider ( UIN – 512B203V03)

ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీ ప్రారంభంలో తీసుకోవచ్చు లేదా పాలసీ కొనసాగుతున్న సమయంలో అయినా తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీ మధ్యలో తీసుకోవాలంటే కచ్చితంగా అప్పటికే 5 సంవత్సరాలు పాలసీ సమయం మిగిలి ఉండాలి.

MR. హరిప్రసాద్ ఈ రైడర్ ను తీసుకొన్నాట్లయితే అలాగే పాలసీ సమయంలో ఆక్సిడెంట్ కారణంగా మరణించినట్లయితే ప్రాథమిక భీమాకి సమానం అయిన అదనపు అమౌంట్ నామినీ కి LIC అందివ్వడం జరుగుతుంది.

 

5. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్,- Premium Waiver Benefit Rider ( UIN – 512B204V03)

18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు ఈ రైడర్ ప్రయోజనం లభిస్తుంది. పాలసీలో ప్రీమియం చెల్లించే తల్లి లేదా తండ్రి లేదా నామినిగా ఎవరైతే ఉన్నారో వారు మరణించినట్లయితే పాలసీ బంద్ చెయ్యడం జరగదు.

రైడర్ ప్రయోజనం వల్ల భవిష్యత్ లో చెల్లించవలసిన మొత్తం ప్రీమియం LIC సంస్థ చెల్లెస్తుంది. పాలసీలో లభించే మొత్తం ప్రయోజనాలు యధావిధిగా అందివ్వడం జరుగుతుంది.

కాబట్టి చిల్డ్రన్స్ కి భీమా జ్యోతి పాలసీ తీసుకొనేవారు ఈ రైడర్ ను తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.

 

 Other Important Benefits

 

• భీమా జ్యోతి పాలసీలో  లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? ( Tax Benefits Of LIC New Bima Jyoti ?)

ఈ పాలసీలో పాలసీదారుడు  చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80c  వర్తిస్తుంది, కాబట్టి ప్రతీ సంవత్సరo  Rs.1,50,000/- వరకూ  టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.

అదేవిధంగా జీవన్ ఆనంద్ పాలసీలో లభించే  మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై  LIC Bima Jyothi  ఇన్కమ్ టాక్స్ రూల్  అండర్ సెక్షన్ 10D  వర్తిస్తుంది.

కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.

 

• భీమా జ్యోతి పాలసీలో ప్రీమియంకి  గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period Of Bima Jyoti )

గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో  సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ముఖ్య గమనిక :   ఈ  సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

 

• భీమా జ్యోతి పాలసీకి పైడ్ అప్ వేల్యూ వర్తిస్తుందా? లేదా? ( Paid Of Value )

ఈ పాలసీకి పైడ్ అప్ వాల్యూ వర్తించదు.

 

• రివైవల్  పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? ( Revival Period Of LIC Bima Jyoti )

ఈ పాలసీకి  5 సంవత్సరాలు  రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.

పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

• ఫ్రీ లుక్ పీరియడ్  అంటే ఏమిటి? ఈ పాలసీ కి వర్తిస్తుందా?( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై  మీరు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి,  చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value Of LIC New Bima Jyoti ?)

ఈ పాలసీలో పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ  పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు తను జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.

ముఖ్య గమనిక :-

మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా సరే పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే  ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి  అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.

 

• భీమా జ్యోతి   పాలసీని  ఎలా  తీసుకోవాలి? ఏ ఏ  డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది?( LIC Bima Jyoti In Documents Required?)

ఈ పాలసీని మీరు LIC  ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు
లేదా
ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

     • కావలసిన డాకుమెంట్స్

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం.
ఈ  ఫారం నెంబర్ – 300 & 340.

2. ఆధార్ కార్డు                –   (  Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
4. పాన్ కార్డు                    –  (   KYC  Verification )
5.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

 

https://licindia.in/

 

• ముగింపు  ( Conclusion )

భీమా జ్యోతి పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

One thought on “LIC Bima Jyoti 860 -” బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *