LIC Dhan Sanchay Plan 865 Telugu -కొత్త స్కీం Rs 80,600/- రెగ్యులర్ ఇన్కమ్ వివరాలివే

 

         LIC Dhan Sanchay Plan in Telugu

 

 

LIC Dhan Sanchay Plan 865 Telugu

ప్రభుత్వ భీమా దిగ్గజ కంపెనీ అయిన LIC నుండి మరొక అద్భుతమైన పాలసీ నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ఎల్.ఐ.సి ధన సంచయ్ (LIC Dhana Sanchay) పాలసీ. ఈ ప్లాన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా, సేవింగ్స్(Savings), గ్యారెంటీ ఇన్కమ్(Guaranteed income) మొదలైన ప్రయోజనాలను ఈ ప్లాన్ లో మనకు కల్పిస్తున్నారు.వీటి కోసం వివరంగా క్రింద తెలుసుకుందాము.

Note: మిత్రులారా ఈ ఎల్.ఐ.సి ధన సంచయ్ ప్లాన్ అర్ధం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అయినప్పటి అందరికి అర్ధమయ్యే విధంగా రాయడానికి ప్రయత్నం చేసాం ఆర్టికల్ చివరివరకు చదవండి.

 

LIC Dhan Sanchay Plan 865 Telugu -కొత్త స్కీం Rs 80,600/- రెగ్యులర్ ఇన్కమ్ వివరాలివే

 

 

ఎల్.ఐ.సి విడుదల చేసిన ఈ ఎల్.ఐ.సి ధన సంచయ్
ఒక నాన్ లింక్డ్ ప్లాన్ అంటే దీనికి స్టాక్ మార్కెట్(stock market) తో ఏటువంటి సంబంధం వుండదు.నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్.
పొదుపు(Savings), గ్యారెంటీడ్ ఇన్కమ్ (Guaranteed income), లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance),వ్యక్తిగతమైన (individual) పాలసీ మరియు ఈ ప్లాన్ లో రైడర్స్ సదుపాయంకూడా వుంది.
ఈ ప్లాన్ లో సేవింగ్స్- మనం చెల్లించే ప్రీమియం పై బోనస్(Bonus) లభిస్తుంది.
గ్యారెంటెడ్ ఇన్కమ్ – ప్లాన్ లో కొంత కాలం పాటు ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ లభిస్తుంది.
ప్లాన్ పీరియడ్ లోపు వ్యక్తికి రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ భద్రత (insurance protection) లభిస్తుంది.
ప్లాన్ లో కొంత కాలం పాటు ప్రీమియం చెల్లిస్తాడు ఆ తరవాత నుండి ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ మరియు ప్లాన్ చివరిలో మెచ్యూరిటీ రావడం జరుగుతుంది.

 

 

ప్రీమియం పేయింగ్ టర్మ్(Premium Paying Term)-

 

ఎల్.ఐ.సి ధన సంచయ్ ప్లాన్ లో ప్రీమియం ను 3 రకాలుగా చెల్లించవచ్చు.
A) సింగిల్ ప్రీమియం (Single Premium)
B) లిమిటెడ్ ప్రీమియం (Limited premium)
C) రెగ్యులర్ ప్రీమియం (Regular Premium)

ఈ ప్లాన్ రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారికి 2 ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఏదో ఒక ఆప్షన్ నీ మాత్రమే పాలసీ దారుడు సెలెక్ట్ చేసుకోవాలి.

 

ఆప్షన్(Option)A:

లెవెల్ ఇన్కమ్ బెనిఫిట్ (Level Income Benefit):
ప్లాన్ లో కొంత కాలం తరువాత నుండి ప్రతి సంవత్సరం లభించే గ్యారెంటెడ్ అమౌంట్(Amount) అనేది స్థిరంగా(Fixed) గా లభిస్తుంది.

ఆప్షన్(Option)B:

ఇంక్రీజ్ ఇన్కమ్ బెనిఫిట్(Increase Income Benefit):

ప్లాన్ లో కొంత కాలం తరువాత నుండి ప్రతి సంవత్సరం లభించే గ్యారెంటెడ్ అమౌంట్(Amount) అనేది ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్  అవుతూ వుంటుంది.

Ex… మొదటి సంవత్సరం Rs 50000,
2 వ సంవత్సరం   Rs 52000,
3 వ సంవత్సరం  Rs 55000 గా వుంటుంది.

ఆప్షన్ A,B కి పాలసీ సమయం 10 మరియు 15 సంవత్సరాలు గా వున్నది.

పాలసీ టర్మ్ ను 10 సంవత్సరాలు గా సెలెక్ట్  చేసుకుంటే ప్రీమియం ను 5 లేదా 10 సంవత్సరాల పాటు మనకు అనుగుణంగా చెల్లించవచ్చు.

పాలసీ టర్మ్ ను 15 సంవత్సరాలు గా సెలెక్ట్  చేసుకుంటే ప్రీమియం ను 5 లేదా 10 లేదా 15 సంవత్సరాల పాటు మనకు అనుగుణంగా చెల్లించవచ్చు.

 

 

 

వయసు పరిమితులు ( Age Eligibility):

 

10 సంవత్సరాల పాలసీ టర్మ్ కి కనీస వయసు – 8 సంవత్సరాలు

15 సంవత్సరాల పాలసీ టర్మ్ కి కనీస వయసు – 3 సంవత్సరాలు

రెండింటికీ గరిష్ట  వయసు – 50 సంవత్సరాలు.

ఆప్షన్స్ A,B కి కనీస బీమా –Rs 3,30,000
అత్యధికంగా – పరిమితి లేదు (No limit)

 

 

సింగిల్ ప్రీమియం (Single Premium):

ఈ ప్రీమియం ను సెలెక్ట్ చేసుకున్నవారికి ఆప్షన్ C మరియు ఆప్షన్ D వర్తిస్తాయి.

ఆప్షన్(Option)C:

ఆప్షన్ A లో  లభించే  లెవెల్ ఇన్కమ్ బెనిఫిట్ (Level Income Benefit) యదావిధిగా ఆప్షన్ C లో లభిస్తుంది.

ఆప్షన్(Option)D:

ఆప్షన్ D ఎంచుకున్నవారికి Enhanced Cover With Level Income Benefit అంటే ప్రతి సంవత్సరం లబించే రెగ్యులర్ ఇన్కమ్ స్థిరంగా వుంటుంది కానీ రిస్క్ కవరేజ్(Risk Coverage) అనేది తీసుకున్న ప్రాధమిక బీమా కు 11(Times) రెట్లు అమౌంట్ రావడం జరుగుతుంది.

ఆప్షన్ C,D కి పాలసీ సమయం 5 లేదా 10 లేదా 15 సంవత్సరాలు గా వున్నది.

 

 

వయసు పరిమితులు ( Age Eligibility):

5 సంవత్సరాల పాలసీ టర్మ్ కి కనీస వయసు –13 సంవత్సరాలు,

10 సంవత్సరాల పాలసీ టర్మ్ కి కనీస వయసు – 8 సంవత్సరాలు

15 సంవత్సరాల పాలసీ టర్మ్ కి కనీస వయసు – 3 సంవత్సరాలు

 

అత్యధిక వయసు:

ఆప్షన్ C కి 65 సంత్సరాలు గాను,
ఆప్షన్  D కి 40 సంత్సరాలు గాను వుంది.

కనీస బీమా ఆప్షన్ C,ఆప్షన్ D కి – Rs 200000

అత్యధికంగా పరిమితి లేదు (No limit)

 

 

ప్రీమియం పేయింగ్ మోడ్ (Premium Paying Mode):

ఎల్.ఐ.సి ధన సంచయ్ (LIC Dhana Sanchay) ప్లాన్ లో ప్రీమియం ను సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి,త్రైమాసిక మరియు నెల వారి 4 రకాలుగా ప్రీమియం ను చెల్లించే వీలుకల్పించారు.

 

Pay out:

ఆప్షన్ A,B లో మీరు ఎంతకాలం ప్రీమియం చెల్లిస్తారో అన్ని సంవత్సరాలు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది.

ఉదాహరణ: 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే తరువాత 5 సంవత్సరాలు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది.

ఆప్షన్ C,D లో ఎంత సమయానికి పాలసీ టర్మ్ తీసుకుంటారో అంత కాలం రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది.

 

 

ఎల్.ఐ.సి ధన సంచయ్  ఉదాహరణ(Example):

 

పాలసీదారుని పేరు  – Mr. సతీష్
వయసు – 30 సం ||లు
పాలసీ సమయం – 15 సం ||లు
ప్రీమియం చెల్లింపు – రెగ్యులర్ ప్రీమియం
ప్లాన్ ఆప్షన్  A – రెగ్యులర్ ఇన్కమ్
నెలసరి ప్రీమియం సుమారు = Rs 4,460/-
Mr. సతీష్  రెగ్యులర్ ప్రీమియం రూపంలో 15 సం ||ల్లో చెల్లించిన మొత్తం ప్రీమియం = Rs 8,00,200/– అవుతుంది కాబట్టి 15 సంవత్సరాలు వ్యక్తి కి భీమా ప్రొటెక్షన్ అందివ్వడం జరుగుతుంది.

1. గ్యారెంటెడ్ ఇన్కమ్ ( Guaranteed Income Benefit ):

Mr. సతీష్  రెగ్యులర్ ప్రీమియం రూపంలో 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం జరిగింది అందువల్ల వచ్చే 15 సంవత్సరాలపాటు తీసుకొన్న భీమా ఆధారంగా చేసుకొని ప్రతి నెలా Rs 68,600/- రావడం జరుగుతుంది.
ఈ విధంగా లభించిన మొత్తం = Rs 86,000 × 15
                                             = Rs 12,90,000

మరణ ప్రయోజనం  ( Death Benefit ):

15 సంవత్సరాల పాలసీ సమయంలో Mr. సతీష్   కి రిస్క్ ఏ విధంగా జరిగిన డెత్ బెనిఫిట్ రూపంలో Rs 9,50,000/- నామినికి లేదంటే వ్యక్తి కుటుంబానికి రావడం జరుగుతుంది.
ఒకవేళ Mr. సతీష్   LIC Dhan Sanchay ప్లాన్ లో రెగ్యులర్ ఆదాయం పొందుతున్న సమయంలో కనుక రిస్క్ కి గురైతే, అతనికి ఏవిధంగా అయితే అమౌంట్ లభిస్తుందో అదే అమౌంట్ కంటిన్యూగా నామినికి అందిస్తారు, దీనితోపాటు చివరి సంవత్సరం గ్యారెంటెడ్ టెర్మినాల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
మెట్యూరిటీ బెనిఫిట్ ( Maturity Benefit ):
వ్యక్తి మెట్యూరిటీ గా గారంటీడ్ టెర్మినాల్ బోనస్ ఈ ప్లాన్లో పొందడం జరుగుతుంది అందువల్ల
Guaranteed Terminal Bonus = Rs 2,50,000/- Mr సతీష్ కి లభించడం జరుగుతుంది. ఈ విధంగా LIC ధన్ సంచాయ్ సేవింగ్, రెగ్యులర్ ఇన్కమ్, మెట్యూరిటీ మరియు లైఫ్ కవరేజ్ ను అందిస్తుంది.

Good benefit:
పాలసీ దారుడు కి రెగ్యులర్ ఇన్కమ్ పొందుతున్న సమయం లో రిస్క్ జరిగితే ప్లాన్ ముగించబడదు భవిష్యత్తు ఇన్కమ్ ను నామినీ కి అందజేస్తారు.

 

 

టాక్స్ బెనిఫిట్(Tax Benefit):

ఈ ప్లాన్ లో అండర్ సెక్షన్ 80c ద్వారా టాక్స్ డిడాక్షన్ మరియు అండర్ సెక్షన్ 10D ద్వారా మనం పొందే రెగ్యులర్ ఇన్కమ్,మెచ్యూరిటీ అమౌంట్ పై టాక్స్ ఫ్రీ ను పొందవచ్చును.

 

లోన్ సదుపాయం  (Loan facilities):

లిమిటెడ్ మరియు రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి చెల్లించిన ప్రీమియం పై ఏదైనా అత్యవసర పరిస్థితులలో 2 సంవత్సరాల తరువాత లోన్ పొందవచ్చును.
సింగిల్ ప్రీమియం చెల్లించేవారికి 3 నెలల తరువాత లోన్ పొందే అవకాశం కల్పించారు.

 

గ్రేస్ పీరియడ్ (Grace Period):

ఈ ప్లాన్ లో మనకు గ్రేస్ పీరియడ్ ను వర్తింపజేశారు.
ప్రీమియం ను సకాలం లో చెల్లించలేని వారికి  పెనాల్టీ చెల్లించకుండా  సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి మరియు 3 నెలలకు ఒకసారి చెల్లించే వారికి 30 రోజుల, నెలకు ఒకసారి చెల్లించేవరికి 15 రోజులు ను అదనంగా గ్రేస్ పీరియడ్ లబిస్తుంది.

 

 

రివైవల్ సదుపాయం(Revival facility):

ఈ పాలసీ లో  సింగిల్ ప్రీమియం చెల్లింపు వారి ఒక్కసారే ప్రీమియం పే(pay) చేస్తారు, కానీ లిమిటెడ్, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారు ఏ కారణం చేతనైనా కొంత కాలం ప్రీమియం చెల్లించనట్లైతే వారు 5 సంవత్సరాల తరువాత అమౌంట్ ను మరియు పెనాల్టీ నీ చెల్లించి ప్లాన్ లో కొనసాగవచ్చు.

 

 

LIC Bima Jyoti 860 ; బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ ;

 

 

 

LIC Jeevan Akshay 7 ( 857 ) Telugu ;30 ఏళ్ళ వయసు నుంచే పెన్షన్ పొందండి ; Eligibility ,Deposit, వివరాలు ఇవే

 

 

 

LIC Single Premium Endowment Plan 917 ;ఒక్కసారి కడితే చాలు రెండు ప్రయోజనాలు ; అర్హతలు , ఫీచర్స్ , బెనిఫిట్స్  పూర్తి వివరాలివే !

 

 

 

 

రైడర్స్ సదుపాయం (Riders Benefits):

 

రైడర్స్ ను సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం వుంటుంది. మనం చెల్లించే ప్రీమియం కి అదనంగా చాలా తక్కువ అమౌంట్ నీ కట్టడం ద్వారా ఈ రైడర్స్ ను పొందవచ్చును.
ఈ ఎల్.ఐ.సి ధన సంచయ్ ప్లాన్ లో 5 రకాల రైడర్స్ ను పొందవచ్చు.

 

1) యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ (Accidental death benefit rider):

పాలసీ తీసుకున్న వ్యక్తికి రిస్క్ జరిగితే బీమా అమౌంట్ యధావిధిగా వస్తుంది దీనితో పాటుగా ఈ రైడర్ నీ తీసుకోవడం వల్ల అదనంగా  Rs 3,30,000 వస్తాయి.

 

2) టర్మ్ రైడర్(Term Rider):
డెత్ ఏ కారణంగా జరిగిన అడిషనల్ అమౌంట్ ఫ్యామిలీ కి అందజేస్తారు.

 

3) ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ (Premium Waiver Benefit Rider):

ఎవరైతే ఈ ప్లాన్ ను చిన్నపిల్లలకు తీసుకుంటారో వారు ఈ రైడర్ నీ తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ప్రీమియం కడుతున్న వ్యక్తి మరణిస్తే ప్లాన్ క్లోజ్ (Close) అవుతుంది ఒకవేళ ఈ రైడర్ నీ తీసుకున్నట్లయితే ప్రీమియం కంపెనీ చెల్లిస్తుంది అలాగే చిన్నపిల్లలకు రావాల్సిన గ్యారెంటెడ్ ఇన్కమ్ మరియు మెచ్యూరిటీ లభిస్తాయి.

 

4) క్రిటికల్ ఇల్నెస్ రైడర్(Critical Illness Rider):

పాలసీ దారుడు పెద్ద అనారోగ్యానికి గురైతే కంపెనీ ట్రీట్మెంట్ (Treatment) కు అవసరమైన అమౌంట్ ను ఇస్తుంది.
కంపెనీ కొన్ని పెద్ద అనారోగ్యాలను ఈ ప్లాన్ లో నిర్ధారించింది.

 

5)  డిసభిలిటి బెనిఫిట్ రైడర్ (Disability Benefit Rider):

ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి డిసభిలిటి కి గురైతే అంటే ప్రాథమిక అవయవం పనిచేయకపోవడం లేదా భవిష్యత్తు లో ఏ పని చేయలేకపోవడం పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రీమియం మాఫీ చేస్తారు మరియు రైడర్ ద్వారా వచ్చే అమౌంట్ ను 10 సంవత్సరాల పాటు రెగ్యులర్ ఇన్కమ్ గా ఇస్తారు.

 

 

https://licindia.in

 

 

Commencement of Risk:

8 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ప్లాన్ తీసుకుంటే ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాల నుండి రిస్క్ కవరేజ్ (Risk Coverage) లభిస్తుంది.

8 సంవత్సరాల దాటిన పిల్లలకు ఈ ప్లాన్ తీసుకుంటే ప్లాన్ తీసుకుంటే  ప్రమాదం జరిగితే వెంటనే రిస్క్ కవరేజ్ (Risk Coverage) లభిస్తుంది.

 

ఫ్రీ లుక్ పీరియడ్ (Free Look Period):

ప్లాన్ తీసుకున్న కొన్ని రోజుల  తరువాత ప్లాన్ ను వద్దనుకుంటే కట్టిన ప్రీమియం మొత్తం ను పొందడానికి 30 రోజుల లోపు ఈ ప్లాన్ ముగింపు ప్రక్రియను పూర్తిచేయాలి.

సరెండర్ (Surrender):

లిమిటెడ్ మరియు రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారు 2 సంవత్సరాల తరువాత మరియు సింగిల్ ప్రీమియం చెల్లించే వారు ఎప్పుడైనా ప్లాన్ ను సరెండర్ చేసి అమౌంట్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల చార్జెస్ రూపం లో ఎక్కువ అమౌంట్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *