Amma Vodi 2022 Release Date Telugu -అమ్మ ఒడి అన్ని సిద్ధం చేసుకోండి!

              Amma Vodi 2022  Details in Telugu

 

Amma Vodi 2022 Release Date Telugu
దిగువ మరియు మధ్య తరగతి కుటుంబాలలో ఉన్న పిల్లలకు విద్య అందించడం కొరకు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ( Amma Vodi 2022 ) పధకాన్ని ప్రారంభం చేసింది, 2022 సంవత్సరానికి గాను ఈ ప్రయోజనం పొందే లబ్ధిదారుల లిస్ట్ ను కూడా తయారుచేసిన విషయం మనందరికి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కి సీఎం గ జగన్మోహనరెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికల ప్రచారం లో ప్రకటించిన నవరత్నాలలో చదువుకోవడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న పేదవిద్యార్థులకు కొరకు అమ్మ ఒడి పధకాన్ని అమలుచేస్తామని వాగ్దానం చేసారు. 2020,2021 లో జనవరిలో(Amma Vodi 2022 Release Date Telugu) అమ్మ ఒడి పధకాన్ని 15000 రూపాయలు విద్యార్థి తల్లి కి అందజేశారు కానీ 2022 లో రాష్ట్రము ఆర్ధికంగా ఇబ్బందులలో ఉండడం వల్ల కాస్త లేట్ అవ్వడం జరిగింది.
Amma Vodi 2022 Release Date Telugu -అమ్మ ఒడి అన్ని సిద్ధం చేసుకోండి!

 

రాష్ట్రం యొక్క ఆర్ధిక స్థాయి సరిగా లేనికారణం గా ఇప్పుడు అమ్మ ఒడి నిధుల పంపిణి శంసయంగా మరియు అధికారులు కూడా ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక స్పష్టత తీసుకురాకపోవడంపై అమ్మ ఒడి(Amma vodi) లబ్ధిదారులు నిరుత్సాహం వ్యక్తపరుస్తున్నారు దీనికి గల కారణం అమ్మ ఒడి 2022 పధకం చెల్లింపులు తేదీ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో ప్రభుత్వ సంబంధిత అధికారులు  అధికారంగా ప్రకటంచకపోవడమే.
ఈ పధకం ద్వారా లబ్ధిదారులు Rs 15,000/–  ఒక్కసారే నేరుగా పొందడం జరుగుతుంది,అయితే ఈ సంవత్సరం Rs 13,000 (పాఠశాల భద్రతకు మొదలైన కారణాల వల్ల 2000 తగ్గించి ఇస్తున్నట్లు ప్రకటన)  2022 జూన్ నెలాఖరుకి అందిస్తామని అంచన  వేయడం మరియు  లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది.2020 జనవరి 9 స్కీమ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించింది ఈ సంవత్సరం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అమ్మ ఒడి నిధులు అందజేయబడతాయని ఒక సర్వే ప్రకారం తెలియజేయడం జరిగింది కాబట్టి మరికొన్ని రోజులు వేచి చుడాల్సిందే .. అమ్మఒడి పధకం జాబితాలో నమోదు వివరాలు www.jaganannaammavodi.ap.gov.In/  వెబ్సైటు లో చెక్ చేసుకోండి.

షరతులను (Conditions):

 

1) పాఠశాల హాజరు 75 శాతానికి తగ్గి ఉండకూడదు,
2)విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.

పధకం అప్లై చేయడానికి కావాల్సిన డాకుమెంట్స్:

ఆధార్ కార్డు , వైట్ రేషన్ కార్డు.
అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు,
ఓటర్ ఇది కార్డు, విద్యుత్ బిల్,
విద్యార్థి చదివే స్కూల్ పేరు,విద్యార్థి సంరక్షకుడి బ్యాంకు అకౌంట్,
తల్లి ఫోటో, స్కూల్ లో విద్యార్థి చదువుతున్నట్లు ఐడెంటిటీ కార్డు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *