LIC New Jeevan Utsav Policy 871 Telugu
LIC New Jeevan Utsav 871
ఎవరైతే వారి యొక్క ఆదాయం తోపాటుగా జీవితాంతం ఖచ్చితమైన రెగ్యులర్ ఇన్కమ్ మరియు భీమా సదుపాయం కావాలనుకొంటున్నారో వారి కోసం ఒక అద్భుతమైన పాలసీని న ప్రారంభం చేసింది ఈ ప్లాన్ పేరే (LIC New Jeevan Utsav) కొత్త జీవన్ ఉత్సవ్ – 871 కేవలం ఈ ఒక్క పాలసీ ద్వారానే కుటుంబానికి ఆర్ధిక భద్రత , పెట్టుబడికి లాభ మరియు రీఇన్వెస్ట్మెంట్ రూపంలో చక్రవడ్డీ ని వ్యక్తి పొందవచ్చు.
Benefits of New Jeevan Utsav – 871
1.Whole Life Insurance : ఇది ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ అంటే ఒక్కసారి ఈ పాలసీ ని మీరు కనుగోలు చేసినట్లయితే వ్యక్తి ఎంతకాలం జీవించి ఉంటాడో అంత కాలం ఇన్సూరెన్సు ప్రొటెక్షన్ లభించడం జరుగుతుందన్నమాట.
2. Regular Guaranteed Income :- వ్యక్తి కి జీవితాంతం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తో పాటు రెగ్యులర్ గా ఒక ఖచ్చితం అయిన అమౌంట్ కూడా అందిస్తుంది. అది ఎంతంటే 10% Of Basic sum assured అంటే మీరు తీసుకునే బీమాలో 10% అమౌంట్ అనేది రెగ్యులర్ గా లైఫ్ టైం రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ LIC లో ఆల్రెడీ ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్జీవన్ ఉమాంగ్
ఉంది ,ఆ ప్లాన్ లో కేవలం 8% Of Basic sum assured లైఫ్ టైం అందించడం జరుగుతుంది.
3. Short Term Investment : సాధారణం గా భీమా పాలసీ అనే సరికే ఇప్ప్పుడు పాలసీ తీసుకునే కొడుక్కి పెళ్లి వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి అనే విధముగా ఉండేది. కానీ ఈ ప్లేన్ లో మీరు కనీసం 5 సంవత్సరాలు చెల్లిస్తే సరిపోతుంది, ఎవరైతే లాంగ్ టర్మ్ కి ఇన్సూరెన్సు ని తీసుకోవడానికి ఇబ్బందిగా భావిస్తున్నారో వారికీ ఇది ఒక బెస్ట్ స్కీం.
4.Guaranteed Addition :– గారెంటెడ్ అడిషన్స్ అంటే మీ పెట్టుబడి పై లభించే వడ్డీ , బోనస్ ,రిటర్న్స్ మరేదైనా 100% బాండ్ పై ముద్రించి ఇస్తారు. సాధారణంగా ఇతర ప్లన్స్ లో ఈ బోనస్ స్థిరంగా ఉండకపోవడం వల్ల చివరి లో మత్యుర్టీ ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు కానీ ఈ ప్లాన్ లో మీరు మొదటి రోజున ఫిక్స్డ్ బోనస్ ని నిర్ధారణ చేయవచ్చు.
Eligibility of LIC Jeevan Utsav 871
ఈ పాలసీ ని తీసుకోవడానికి కనీస ప్రవేశ వయస్సు వచ్చి 3 నెలల పిల్లలకి కూడా ఈ పాలసీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక పాలసీని తీసుకోవడానికి అత్యధిక ప్రవేశ వయస్సు వచ్చి 65 సంవత్సరాలగా ఉంటుంది.
కనీస పాలసీ సమయం 5 సంవత్సరాలు, అత్యధిక పాలసీ సమయం 16 సంవత్సరాలు అంటే కనీసం 5 సంవత్సరాల నుండి అత్యధికంగా 65 సంవత్సరాల మధ్య మీరు పాలసీ యొక్క సమయాన్నిఎవరి అవకాశం బట్టి వారు పాలసీ సమయం ని నిర్ధారణ చేసుకోవచ్చు.
LIC New Jeevan Utsav ప్లాన్ యొక్క కనీస భీమా వచ్చి 5 లక్షలు , అత్యధిక భీమా కు ఎటువంటి పరిధి లేదు అందువల్ల మీరు మీ యొక్క ఆర్ధిక స్థితిని బట్టి బీమాను నిర్ధారించవచ్చు.
LIC Jeevan Utsav Plan Options
ఈ ప్లాన్ లో ముఖ్యంగా 2 ఒప్షన్స్ ఉంటాయి వీటిలో ఏదో అలా ఆప్షన్ ని పాలసీదారుడు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
- Regular Income Benefit : రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ మీరు కనుక ఈ ఆప్షన్ ని నిర్ధరించుకుంటే అతని తీసుకున్న ప్రాధమిక భీమాలో 10 శాతం అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా లైఫ్ టైం రావడం జరుగుతుంది. అంటే ఉదాహరణ కి మీరు 5 లక్షల భీమా తీసుకుంటే 10 శాతం 50 వేలు , 10 లక్షల భీమాకి లక్ష, 20 లక్షల భీమా కి 2 లక్షలు మరియు 50 లక్షల భీమా పై సంవత్సరానికి 5 లక్షలు చొప్పున వ్యక్తికి జీవితాంతం LIC అందిస్తుంది.
2. Fixed Income Benefit : ఈ ఆప్షన్ లో కూడా పాలసీదారుడు కి 10 అఫ్ సాధారణ భీమా అమౌంట్ గా ప్రతీ సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ జీవితాంతం లభిస్తుంది కానీఈ రెండింటికి తేడా ఏమిటంటే ఎవరికైతే ప్రతీ సంవత్సరం లభించే రెగ్యులర్ అమౌంట్ అవసరం లేదనుకుంటారో వారు ఈ అమౌంట్ ని అలా వదిలేస్తే, ఆ అమౌంట్ పై 5.50% చక్రవడ్డీ ని కలిపి ఇస్తుంది కాబట్టి 3 రకాల బెనిఫిట్స్ ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంట్ , కంపౌండింగ్ ఇంటరెస్ట్ ఈ ఒక్క స్కీం లోనే మనం పొందవచ్చు.
LIC Jeevan Utsav 871 ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ని ఉదాహరణ
Mr. రామ్ అనే ఒక ౩౦ సంవత్సరాల వ్యక్తి LIC ప్లాన్ లో 5 లక్షల భీమాను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు, ఇక ఎంతకాలం అమౌంట్ చెల్లించాలో నిర్ణయించాల్సిటుంది. ఇన్సూరెన్సు ప్లాన్ లో వుండే సాధారణ విషయం ని మీకు చాల సార్లు వివరించడం జరిగింది అదే మనం పాలసీని ఎక్కువ కాలానికి తీసుకుంటే చెల్లించే ప్రీమియం తక్కువుగా ఉంటుంది. పాలసీని తక్కువ కాలానికి తీసుకుంటే చెల్లించే ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇదే విషయాన్ని ఉదాహరణ ద్వారా మీ రామ్ కి దరఖాస్తు చేస్తే 5 లక్షల బీమాను 5 సంవత్సరాలకి తీసుకుంటే ప్రతి నెల సుమారు Rs 10000 వేల ప్రీమియం వరకు చెల్లిచాలి. అదే 7 సంవత్సరాలకు తీసుకుంటే నెలకి 8000 , 9 సంవత్సరాలకి తీసుకుంటే ప్రతీ నెల 7000, ఒకవేళ 16 సంవత్సరాలకి ఈ ప్లాన్ ను తీసుకుంటే నెలకి సుమారు ౩౦౦౦ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అంటే ప్రీమియం కాలం తగ్గేకొలది ప్రీమియం అనేది పెరుగుతుంది కాబట్టి మీరు చెల్లించే స్థోమత ఆధారంగా మీరు పాలసీ కాలాన్ని నిర్ణయించుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది.
Waiting Period
Mr. రామ్ ఈ ప్లాన్ ను ఏ ప్రీమియం టర్మ్ తీసుకుని ఉంటే సాధారణ భీమా లో 10 శాతం క్రమం తప్పకుండ అమౌంట్ వస్తుంది అయితే ఇక్కడ ఇక విషయం గుర్తించాలి వెయిటింగ్ పీరియడ్ . ఎలా అంటే 5 సంవత్సరాలు ఈ ప్లాన్ మీరు అమౌంట్ చెల్లిస్తే మరొక 5 సంవత్సరాల తరువాత నుండి అంటే ప్లాన్ యొక్క 10 వ సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ ప్రారంభమవుతుంది. ఇక 6 సంవత్సరాల పాలసీ సమయంలో 4 సంవత్సరాలు, 7 సంవత్సరాల పాలసీ సమయంలో 3 సంవత్సరాలు, అదేవిధముగా 8 నుండి 12 సంవత్సరాల మధ్య , ప్రీమియం చెల్లించిన 2 సంవత్సరాల తరువాతే రెగ్యులర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది.
కాబట్టి మ్ర రామ్ 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాడు ప్రీమియం వచ్చి సుమారు 5 లక్షలు ఉండవచ్చు అప్పటినుండి మరొక 5 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో కవరేజ్ తప్పకుండ లభిస్తుంది ప్లాన్ యొక్క10 వ సంవత్సరం నుండి సంవత్సరానికి Rs 50000 వేల చొప్పున రెగ్యులర్ గా LIC జీవితాంతం అందిస్తుంది.
ఇక ఆప్షన్2 ను గమనిస్తే ప్రతి సంవత్సరం లభించే Rs 50000 వేల రూపాయలను తీసుకోకుంగా అలా వదిలేస్తే దానిపై 5.50 శాతం చక్రవడ్డీని వేసి మీకు అందిస్తుంది మీకు ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు దీనిలో 75% శాతం వరకు అమౌంట్ ను withdraw చేసుకోవచ్చు.
LIC Jeevan Azad 868 ;రెట్టింపు మెచ్యూరిటీ స్కీం Benefits and Eligibilities Complete details..
LIC Dhan Sanchay Plan 865 Telugu -కొత్త స్కీం Rs 80,600/- రెగ్యులర్ ఇన్కమ్ వివరాలివే
Loan ,Surrender & Policy Revival Facilities
ఈ ప్లాన్ లో కూడా కనీసం 2 సంవత్సరాలు మీరు ప్రీమియం చెల్లించినట్లైతే లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వద్దనుకుంటే ప్లాన్ ని కూడా సరెండర్ చేసి అమౌంట్ ను పొందవచ్చు అయితే సరెండర్ విషయం లో ఛార్జెస్ వర్తిస్తాయి మరియు అనివార్య కారణాల కారణంగా ప్రీమియం కంటిన్యూ గా చెల్లించకపోతే పాలసీ ముగించడం జరగదు 5 సంవత్సరాల లోపు మొత్తం అమౌంట్ ని పెనాల్టీతో కట్టి మళ్ళి ప్లాన్ లో మనం కొనసాగేలా 5 సంవత్సరాలు పాలసీ రివైవల్ ప్రయోజనం ఉంటుంది.
సాధారణ భీమాతో పాటుగా అడిషన్ కవరేజ్ కావాలనుకుంటున్నారా ?
Premium Waiver Benefit Rider : 18 సంవత్సరాల వయసులోపు పిల్లలకి కనుక మీరు ఈ పాలసీని తీసుకుంటే ఈ రైడర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటె పిల్లల పేరున ప్రీమియం చెల్లిచే వ్యక్తులు కనుక ఏదైనా కారణంగా మరణిస్తే వెంటనే ప్లాన్ ముగించబడుతుంది ఒకవేళ ఈ రైడర్స్ ను తీసుకుంటే మొత్తం ప్రీమియం LIC స్వయంగా చెల్లిస్తుంది మరియు ప్లాన్ కి సంబంధించిన మొత్తం బెనిఫిట్స్ ని సమయానికి యధావిధిగా అందిస్తుంది.
Accidental Benefit Rider : పాలసీ హోల్డర్ ఏ విథంగా మరణించిన అంటే సాధారణంగా లేక యాక్సిడెంటల్ గా ఐన మరణ ప్రయోజనం నామినీ కి అందివ్వడం జరుగుతుంది కానీ ఈ ఈ రైడర్ తీసుకున్నట్లైతే పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ కారణంగా మరణిస్తే అప్పుడు సాధారణ ప్రయోజనం తో పాటు రైడర్ రూపంలో మరింత ప్రయోజనం కుటుంబానికి లభిస్తుంది.
Term Rider :- పైన చెప్పిన రైడర్ వ్యక్తి కి యాక్సిడెంటల్ కారణంగా ప్రమాదం జరిగితేనే అదనపు ప్రయోజనం లభిస్తుంది సాధారణ మరణం ఐతే సాధారణ మరణ ప్రయోజనం మాత్రమే రావడం జరుగుతుంది కాని టర్మ్ రైడర్ లో వ్యక్తికీ ప్రమాదం ఏ విదంగా జరిగిన అదనపు మరణ ప్రయోజనము యధావిదిగా నామినీకి సంస్థ అందిస్తుంది.
Accidental Death & Disability Rider : ఈ రైడర్ ధ్వారా వ్యక్తికీ యాక్సిడెంట్ జరిగి అంగవైకల్యానికి గురైతే, అంటే ఏ పని చేయలేని స్థితిలో ఉంటే కొద్దిగా ప్రీమియం మాఫీ తో పాటు, భీమాలో 10 శాతం చొప్పున కుటుంబానికి ఆర్ధిక భరోసా కొంత కాలం పాటు సంస్థ అందిస్తుంది.
Critical Illness Benefit Rider : ఈ రైడర్ కొన్ని పెద్ద అనారోగ్యాలకి కవరేజ్ ని అందచేస్తారు. ఉదాహరణకి హెల్త్ ఇన్సూరెన్సు అన్నమాట. కానీ గుండె, ఉపిరితిత్హులు లాంటి — వ్యాధులకు చికిత్స మనం చేయించుకోవచ్చు.