Patanjali Franchise Details In Telugu
Patanjali Franchise in Telugu ఓల్డ్ ఇస్ గోల్డ్ నినాదం ప్రకారం దీర్ఘ కాలిక అనారోగ్య వ్యాధులకు, ఇంగ్లీష్ మెడిసిన్ మార్కెట్ ల్లో ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి పరిస్కారం కొరకు అలాగే ఆరోగ్య సంరక్షణ కొరకు భారతీయులు ఆయుర్వేద పద్ధతులనే అనుసరిస్తున్నారు, అలాంటి ప్రొడక్ట్స్ లో ఇండియాలో ది బెస్ట్ పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్. ప్రస్తుతం ఇండియాలో 3 లక్షలకి పైగా పతంజలి స్టోర్స్ 5 వేలకి పైగా డీలర్షిప్ లు ఉన్నాయి దీనితోపాటుగా సుమారు 1000 కి పైగా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండటం జరిగింది.
పతంజలి ఒక ఆయుర్వేద ప్రొడక్ట్స్ తయారుచేసే ఇండియా ప్రోడక్ట్ మరియు ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. యోగ గురువు శ్రీ బాబా రాందేవ్ మరియు శ్రీ ఆచార్య బాలకృష్ణ ద్వారా ఈ కంపెనీ 1997 లో ప్రారంభం చెయ్యడం జరిగింది.దేశం నలుమూలల నుంచి సేకరించిన మరియు ప్రకృతి సిద్ధంగా లభించే ప్రదేశం అయిన ఉత్తరా్ఖండ్, హరిద్వార్ స్థలంలో కంపెనీ నిర్మించడం జరిగింది.దేశంలో నలుమూలల పతంజలి ప్రొడక్ట్స్ విస్తరింపచేయడం కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందువల్ల ఫ్రాయించైస్ ను ఎక్కువ ప్రాఫిట్ తక్కువ పెట్టుబడి ఉండే విధంగా ఆఫర్ చేస్తుంది.
పతంజలి అందించే ముఖ్యమైన ప్రొడక్ట్స్:A. ఆహార పదార్థ ఫుడ్ ప్రొడక్ట్స్ ( Food Products )
పతంజలి డీలర్షిప్ రకాలు :-
పతంజలి విభిన్నమైన డీలర్షిప్స్ ను అందిస్తుంది వాటికి అనుగుణంగానే పెట్టుబడి మరియు స్థలం నిర్ణయించడం జరుగుతుంది. 1. Village Industries ( గ్రామాలలో డిస్ట్రిబ్యూషన్ ):ఇది ఒక చిన్న స్టోర్ రూపంలో ఉంటుంది. గ్రామాలలో ఎక్కువగా అవసరం అయిన ప్రొడక్ట్స్ మాత్రమే ఇందులో లభించడం జరుగుతుంది కంపెనీ సప్ప్లై చేసే అన్ని ప్రొడక్ట్స్ లభించవు అయినప్పటికీ మంచి కస్టమర్ ఆదరణ కలిగి ఉంటుంది. మెగా స్టోర్ మరియు మెడికల్ హెల్త్ స్టోర్స్ తో పోలిస్తే చాల తక్కువ పెట్టుబడి లక్ష నుంచి 5 లక్షల లోపు ఈ ఫ్రాఇంచస్ పెట్టుబడి ఉంటుంది అలాగే 350 చ // అడుగుల నుంచి 500 చ // అడుగులు ఉండాలి.
2. Patanjali Mega Store ( మెగా స్టోర్ ):కేవలం పట్టణాల్లో మాత్రమే ఈ డీలర్షిప్ లభిస్తుంది మెగా స్టోర్ కొరకు పెట్టుబడి మరియు స్థలం అధికంగా అవసరం ఉంటుంది కారణం కంపెనీ కి సంబందించిన ప్రతీ ప్రోడక్ట్ ఇందులో లభ్యమౌతుంది, పెట్టుబడి కి తగిన విధంగా నే మంచి లాభాలు మెగా స్టోర్ లో మనం గమనించవచ్చు.
3. Patanjali Medical & Health Canter ( మెడికల్ & హెల్త్ ):ఈ స్టోర్ లో కేవలం పతంజలి కంపెనీ కి సంభందించిన టాబ్లెట్స్, పౌడర్ వంటి మెడిసిన్ మరియు వాటిని సూచించే గుర్తింపు కలిగిన వైద్యుడు ఉండటం జరుగుతుంది. మెడికల్ & హెల్త్ కొరకు సుమారుగా 8 నుంచి 10 లక్షలు మధ్య పెట్టుబడి అవసరం ఉంటుంది మరియు 750 చ // అడుగుల నుంచి 1200 చ // అడుగులు ఉండాలి.
4.ఫ్రాయించైస్ రేట్ ( Patanjali Franchise Cost):పతంజలి డీలర్షిప్ ఇన్వెస్ట్మెంట్ 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఫ్రాయించస్ నిర్మాణం దీని కొరకు స్థలము అవసరం అందువల్ల ల్యాండ్ స్వంతంగా ఉంటే పెట్టుబడి చాలా తగ్గిపోతుంది లేదంటే లీజ్ కి తీసుకొని రెంట్ పే చేయాల్సివుంటుంది.
అమ్మకాలపై ప్రాఫిట్ (Patanjali Franchise Profit):పతంజలి స్వదేశీ కంపెనీ పెట్టుబడి పై ఏ మాత్రం సందేహం అవసరం లేదు, కంపెనీ వినియోగదారులకు మొత్తం అమ్మకాలపై సుమారుగా 10% నుంచి 15% వరకూ ప్రాఫిట్ ను అందిస్తుంది.
Town Cart Franchise Details In Telugu ; తక్కువ పెట్టుబడితో సూపర్ మార్కెట్ ని పొందండి వివరాలు ఇవే!
Jio mart Franchise In Telugu ; మంచి సంపాదనతో పాటు గుర్తింపు పొందండి, 3000 డిస్కౌంట్!
LIC Bima Jyoti ; బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ ;
పతంజలి ఫ్రాంచైజ్ ఉన్న రాష్ట్రాలు (Patanjali Franchise Extension location);అస్సాం ,మేఘాలయ, మిజోరాం,త్రిపుర,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం,ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఐన పాండిచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్, డామన్ మరియు డయ్యు, జమ్మూ, మరియు కాశ్మీర్.
పతంజలి ఫ్రాంచైజ్కాంటాక్ట్ నెంబర్ (Patanjali Franchise Contact No);హెల్ప్ లైన్ నెంబర్:18001804108
https://www.patanjaliayurved.net/
రెజిస్ట్రాటిన్ ఆఫీస్ అడ్రస్:డి-26, పుష్పాంజలి, బీజావాసన్, ఎన్ క్లావ్, కావాల్సిన పత్రాలు(Patanjali Franchise Required Documents):ఐడి ప్రూఫ్ – ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు
అడ్రెస్స్ ప్రూఫ్– విధ్యుత్ బిల్, రేషన్ కార్డు బ్యాంకు అకౌంట్ , ఫోటో, ఇమెయిల్ అడ్రస్ , ప్రాపర్టీ డాక్యుమెంట్, GST సంఖ్య .
|
|