Bitcoin అంటే ఏమిటి? Benefits, Invest & Guarantee in Telugu

                Crypto currency  Details in Telugu

 

Bitcoin  విశేషాలు:-

*ప్రస్తుతం ఒక్కో బిట్ కాయిన్ విలువ మూడు లక్షల వరకు ఉన్నది.
*2010 లో ఒకవ్యక్తి బిట్ కాయిన్స్ లో పెట్టుబడి 4500 రూపాయలు పెడితే, 2017 లో దీని విలువ 482 కోట్లు అయింది.
*బిట్ కాయిన్స్ ను అధికారికంగా లావాదేవీలకు అనుమతి ఇచ్చిన మొట్టమొదటి దేశం ఎల్ సాల్వెడార్.
*ఎలాంటి రూపం లేని ఈ బిట్ కాయిన్స్ ను కంప్యూటర్ సర్వర్ లతో నిర్వహిస్తారు.
*ప్రపంచం మొత్తంలో సగానికిపైగా బిట్ కాయిన్స్ ను నిర్వహిస్తున్న దేశం చైనా.
*బిట్ కాయిన్స్ ను బ్లాక్ ఛైన్ టెక్నాలజీ తో సురక్షితంగా నిర్వహించగలుగుతున్నారు.

 

Bitcoin అంటే ఏమిటి? Benefits, Invest & Guarantee in Telugu

 

 

ఇంతకీ ఈ Bitcoin అంటే ఏమిటి? దీనిని ఎవరు దీనిని సృష్టించారు? Bitcoin, Ethereum,  Ripple వంటివి ఎలాంటి లాభాలను ఇచ్చాయి? ఒకవేళ మనం  Crypto currency ని కొనాలనుకుంటే ఎక్కడ, ఎలా కొనాలి? దీనిలో ఎలాంటి  రిస్క్ ఉంటుంది?

ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు జవాబుగా ఈ ఆర్టికల్ను అందిస్తున్నాం కాబట్టి Bitcoin కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇటీవలి కాలంలో మరియు అతి తక్కువ కాలంలో వ్యాపార పరంగా చూస్తే  అత్యధిక రాబడి వచ్చిన రంగం ఏదంటే అది Crypto currency లో భాగమైన  Bitcoin అని చెప్పవచ్చు.
Bitcoin అంటే డిజిటల్ రూపంలో ఉన్న కరెన్సీ అని చెప్పవచ్చు. అంటే ఇది కేవలం ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే టటువంటి ఒక వర్చువల్ కరెన్సీ గా పేర్కొనవచ్చు.
సాధారణంగా కంప్యూటర్ లో ఉండే సమాచారమంతా బిట్లు మరియు బైట్ లు రూపంలో ఉంటుంది. అందుకోసమే దీనికి (బిట్కాయిన్) Bitcoin అనే పేరు వచ్చింది. ఈ Bitcoin ను మొదటి సారి  2009 లో Satoshi Nakamoto అనే ఒక ప్రోగ్రామర్, ఇతర ప్రోగ్రామర్ లతో కలిసి దీనిని క్రియేట్ చేసినట్లు సమాచారం అందుకే  Bitcoin, Ethereum, Ripple వంటి కరెన్సీ ని Crypto currency అని అంటారు.

 

 

2. Bitcoin విలువ ( Value Of Bitcoin )

 

2008 లో మొదటి సారి గుర్తు తెలియని వ్యక్తి ఈ బిట్కాయిన్ ప్రవేశపెట్టినప్పుడు దీనికి ఎలాంటి విలువ ఉండేది కాదు. 2010 లో మొదటిసారిగా  0.003 అమెరికన్ డాలర్లకు బిట్ కాయిన్ విలువ చేరుకున్నది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ విలువ అమాంతంగా పెరుగుతూనే ఉన్నది కానీ ఇప్పటివరకు తగ్గనే లేదు.

 

 

3. ఎందుకు ఇంత విలువ ( Demand Of Bitcoin?)

 

Bitcoin విలువ ఇలా పెరగడానికి కారణం ఏమిటి?

అజ్ఞాత వ్యక్తులు Bitcoin ను క్రియేట్ చేసినపుడు కేవలం 21 మిలియన్ల బిట్ కాయిన్ లు మాత్రమే ఉండేలా దీనిని ప్రోగ్రాం చేయడం జరిగింది. మరలా కొత్త Bitcoin లను క్రియేట్ చెయ్యలేకపోవడం తో,  దీనిని కొనేవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఈవిధంగా  డిమాండ్ బాగా పెరిగిపోయి, దీని విలువ ఆటోమేటిక్ గా ఆకాశానికి తాకింది.

ఇక్కడ ప్రత్యేక విషయం ఏమిటంటే, Crypto currency ప్రక్రియ పూర్తి గా కంప్యూటర్ అల్గోరిథం మీద ఆధారపడి పని చేస్తుంది. అంటే  ఈ కరెన్సీ నాణేలు లేదా కాగితపు నోట్లు రూపం లో దొరకవు మరియు ఉండవు అన్నమాట.

 

 

వర్చువల్ కరెన్సీ వివిధ రకాల నాణేలు:-

Crypto currency – Coins:-

Bitcoin (BTC), Bitcoin Cash (BCH), Ethereum (ETH), Ethereum Classic (ETC), Litecoin (LTC), Dogecoin (DOGE), Shiba Inu (SHIB), Cardone (ADA), Solana (SOL), Tether (USDT), USD Coin (USDC)
పైన పేర్కొన్న వివిధ రకాల క్రిప్టోకరెన్సీ కి సంబంధించిన అన్ని రకాల నాణేలను ట్రేడింగ్ చేయడానికి ప్రస్తుతం వివిధ రకాల అప్లికేషన్స్ అందుబాటులో కలవు.

 

Best apps for bitcoin trading:-

WazirX.
Unocoin.
CoinDCX.
Zebpay.
CoinSwitch Kuber.
Bitbns.
Krypto.

మీకు అనుకూలమైన ఏదో ఒక యాప్ ద్వారా వెంటనే మీరే సొంతంగా క్రిప్టోకరెన్సీ ని ట్రేడింగ్ చేయవచ్చు. ఇందుకోసం మీరు
బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డ్‌ని లింక్ చేయడం  తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

 

 

4. Bitcoin పబ్లిసిటీ కి కారణాలు:-

1. బిట్ కాయిన్స్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో అమ్మేవారికి, కొనేవారికి మధ్య బ్రోకర్లు లేకపోవడం.
2. ట్రాన్సాక్షన్స్ నేరుగా జరుపుకోవచ్చు.
3. బిట్ కాయిన్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు.
4. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ క్రిప్టోకరెన్సీ కి అనుమతులు ఇవ్వడం.
5. బిట్ కాయిన్స్ ను ఎవరు, ఎవరికి అమ్ముతున్నారో, ఇతరులకు తెలియకుండా  అతి రహస్యంగా ఉంచడం.
6. ముఖ్యంగా ఈ క్రిప్టోకరెన్సీ ని ఎవరు నిర్వహిస్తున్నారో, తెలియక పోవడం వల్ల బిట్ కాయిన్స్ లావాదేవీల కు ఎలాంటి పన్ను వసూళ్లు ఉండవు.

Cryptocurrency కి సంబంధించి BuyUcoin అనే ఒక వెబ్ సైట్ ను ఉదాహరణ గా తీసుకుని వివరాలు అందిస్తున్నాం.
కేవలం BuyUcoin వెబ్సైట్ మాత్రమే కాకుండా అనేక రకాల ఇతర వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.

 

క్రిప్టో కరెన్సీ Exchanges:-

1. Coinbase
2. Voyager
3. BlockFi
4. Uphold
5. Kraken
6. eToro
7. Bitcoin IRA
8. Crypto.com
9. Binance
10. Hodlnaut
పైన చెప్పిన విధంగా ఏదో ఒక ప్రామాణికమైన  Exchanges / వెబ్ సైట్ ద్వారా మీరు Crypto currency లావాదేవీలు నిర్వహించవచ్చు.

 

 

5. What is BuyUcoin?

BuyUcoin అనే వెబ్సైట్ డిజిటల్ అసెట్స్ వాలెట్ మరియు ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ లాగా పనిచేస్తుంది. ఆసక్తి ఉన్న  వినియోగదారులు బిట్‌కాయిన్, ఎథెరియం, రిపుల్ మొదలైన డిజిటల్  కరెన్సీ తో లావాదేవీలు చేయవచ్చు.
ఉదాహరణకు,  BuyUcoin ద్వారా భారతదేశంలోని ఢిల్లీ-NCR నుండి 550,000 పైగా  వినియోగదారులు సులభంగా కొనుగోలు  చేస్తున్నారు.

 

 

Features Of BuyUcoin;

1. అన్ని క్రిప్టోకరెన్సీల కొనుగోలు పై ఎటువంటి ఫీజు రుసుము ఉండదు మరియు ఇమ్మీడియేట్ గా డిపాజిట్ Iమరియు  విత్ డ్రాల్ ను INR రూపంలో నిర్వహించుకోవచ్చు.
2. UPI google pay/phone pay/ paytm మరియు mobikwik డిపాజిట్ మరియు విత్‌డ్రా INR కోసం అందుబాటులో ఉన్నాయి.
3. రియల్ టైమ్ మార్కెట్‌లో ప్రతి ట్రేడ్‌కు (GSTతో సహా) %  మేకర్/టేకర్ ఫీజు.
4. 10,000 రూపాయల వరకు వ్యాపారం చేయడానికి KYC అవసరం లేదు.
5. మీరు కొత్త వినియోగదారు అయితే మరియు మా సేవలను ప్రయత్నించడానికి ఈ కనీస మొత్తాన్ని కూడా చెల్లించకూడదనుకుంటే జీరో ఫీజు ట్రయల్ కోసం దరఖాస్తు చేసుకోండి
6. అలాగే కొత్త వినియోగదారుల కోసం డెమో ఖాతా అందుబాటులో ఉంది
7. Crypto SIP –  100 రూపాయలతో బిట్‌కాయిన్‌లో రోజువారీ/నెలవారీ/త్రైమాసిక పెట్టుబడిని ప్రారంభించండి.
8. కూపన్ కోడ్ మరియు వోచర్ కోడ్- సైన్అప్ బోనస్ రీడీమ్ కూపన్ కోడ్ BUYUCOINFREEBTC.
9. Rs 100 INR విలువైన Bitcoin, Ethereum, Rippleతో అనుబంధం/భాగస్వాములు/రెఫరల్  కోసం అనుకూలీకరించదగిన వోచర్ కోడ్ మరియు కూపన్ కోడ్ లు కలవు.

 

6.  చెల్లింపు ఎంపిక & భద్రతా లక్షణాలు ( Payment options & security );

 

BuyUcoin వెబ్ సైట్ లో UPI, మొబైల్ వాలెట్, IMPS వంటి అధునాతన ఇన్‌స్టంట్ బ్యాంకింగ్ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు.
బిట్‌కాయిన్, Ethereum, Ripple, Litecoin, Stellar వంటి బహుళ డిజిటల్  కరెన్సీ కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, వ్యాపారం చేయడానికి మరియు నిల్వ చేయడానికి  BuyUcoin ప్లాట్‌ఫారమ్  వినియోగదారులను (NEFT/RTGS) అనుమతిస్తుంది.

 

 

BuyUcoin signup process:-

సైన్ అప్ ప్రక్రియ:

1. https://trade.buyucoin.com/signup లో కి వెళ్లండి.
2. మీరు buyucoin సైట్ ద్వారా సైన్ అప్‌కి చేరుకున్న తర్వాత, వారి సేవలలో  మీకు అనుకూలంగా ఉన్న ఖాతాను సెలెక్ట్ చేసుకుని,  ఖాతా తెరవండి. ఇక్కడ  మీ ఖాతా రకాన్ని వ్యక్తిగతంగా లేదా కార్పొరేట్‌గా  ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీ దేశాన్ని  సెలెక్ట్ చేయాలి.  క్రిప్టో ట్రేడింగ్ కోసం మీ అకౌంట్ ను ఎంటర్ చేసేందుకు నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి.
3.మీ  లాగిన్ లో భాగంగా, 2వ దశ యొక్క ధృవీకరణను పూర్తి చేయండి.
ప్రమాణీకరణ కోసం Google Authenticator యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.  మీ BuyUcoin అకౌంట్ మరియు కారకం ప్రమాణీకరణను లింక్ చేయడానికి Google ప్రమాణీకరణ అప్లికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. మీరు లాగిన్ చేసినప్పుడు, మీకు సంబంధించిన ప్రమాణీకరణ కోడ్‌ని అందించమని మీకు ప్రాంప్ట్ చేయబడుతుంది.  ఈ విషయం BuyUcoin క్రింద Authenticator యాప్‌లో చూపబడుతుంది.

4. ఇక్కడ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయాలి.  మీ బ్యాంక్ పేరు,  అకౌంట్ హోల్డర్  పేరు తర్వాత అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ వివరాలను ఎంటర్ చేయాలి.

 

LIC Bima Jyoti 860 – బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ;

 

SBI Life Smart Humsafar Plan ;  భార్య భర్త లీద్దరికీ ఒక్కటే పాలసీ ; Review Benefits ; Key Features

 

SBI Kavach Personal loan In Telugu – స్టేట్ బ్యాంక్ స్పెషల్ స్కీమ్ 5 లక్షలు పర్సనల్ లోన్ ; కేవలం 5 నిమిషాల్లోనే

 

 

BuyUcoin సేవలు:-

వీరు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ప్రధాన కార్యాలయంతో భారతదేశం అంతటా సేవలు అందిస్తున్నారు.  ఇక్కడ  Crypto currency యొక్క ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్నారు.  ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ప్లేస్ మరియు  మల్టీ డిజిటల్ అసెట్ వాలెట్ గా పేరు పొందింది.
ముఖ్యంగా ఈ  ప్రాంతీయ కార్యాలయం  సమర్ధవంతమైన సేవ, మార్కెట్ అవసరాలకు ప్రతిస్పందించే మెరుగైన సామర్థ్యం మరియు ఎక్కువ క్లయింట్లు ను  సంతృప్తి పరచడం కోసం ఒక గొప్ప వేదికగా మార్పు చెందింది.

 

 

App సేవలు:-

 

• నాణేలను మార్చుకోవచ్చు  మరియు  డిజిటల్ వాలెట్‌లతో క్రిప్టో కరెన్సీ ను సురక్షితంగా పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. •  నాణేల(Crypto currency)  ను అమ్మడం మరియు కొనుగోలు చేయవచ్చును.
•  వివిధ రకాల  క్రిప్టోకరెన్సీపై దిగుబడిని పొందవచ్చు.
– క్రిప్టో కరెన్సీ ను సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు

 

BuyUcoin లాంటి వెబ్ సైట్ ద్వారా ఒక వ్యక్తి ఎవరికైనా సరే ఈ  ఉత్పత్తులను (Bitcoin, Etherium, Ripple etc..) కొనుగోలు చేయవచ్చు, మరియు అమ్ముకోవచ్చు.  ఈ Crypto currency లో భాగంగా బహుళ-డిజిటల్  రూపంలో కరెన్సీ మార్పిడి ఏ సమయంలో అయినా జరుపుకుంటారు.
Crypto currency కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వివిధ రకాల వెబ్ సైట్లు ఈ కింది సేవలు అందిస్తున్నాయి.

*కొనుగోలుదారులు మరియు విక్రేతలు 140కి పైగా  క్రిప్టోకరెన్సీల కంటే ఎక్కువ వ్యాపారం చేయగల మార్కెట్‌ప్లేస్.
*బహుళ డిజిటల్ ఆస్తుల వాలెట్ సేవ – బహుళ డిజిటల్ కరెన్సీ లను సురక్షితంగా నిల్వ చేయడానికి అన్నీ ఒకే వాలెట్‌లో ఉంటాయి.  *డెమో ట్రేడింగ్ మరియు ప్లాట్‌ఫారమ్‌ను అర్థం చేసుకోవడానికి కొత్త వ్యాపారం లో చేస్తున్న వారికి అనుకూలమైన  టెస్టింగ్ గ్రౌండ్.
*క్రిప్టో కరెన్సీ SIP అవకాశం
*Bitcoin లాంటి కరెన్సీ యొక్క అస్థిరతను పరిష్కరించడానికి ఒక క్రమబద్ధమైన  పెట్టుబడి ప్రణాళిక ను అందిస్తుంది.

 

క్రిప్టో కరెన్సీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి?

వాస్తవంగా భౌతిక రూపంలో లేని నాణేలు మరియు డిజిటల్ కరెన్సీ రూపంలో ఉండే ఈ క్రిప్టోకరెన్సీ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ కాయిన్స్ కు సంబంధించిన ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్స్ కు  ఎన్నో ఎక్స్చేంజి సంస్థలు ఉంటాయి.
బిట్ కాయిన్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం వినియోగదారునికి “పబ్లిక్ కీ” అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ “పబ్లిక్ కీ” అనేది మినిమం 30 నుండి మాక్సిమం 130 వరకు క్యారెక్టర్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో పాస్వర్డ్ మాదిరి క్లిష్టమైన  అక్షరాలు, లెటర్స్ మరియు సింబల్స్ రూపంలో ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి.
బిట్ కాయిన్స్ యొక్క వాలెట్ ద్వారా కూడా
ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.ఈ వాలెట్ ఉపయోగించడానికి యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ రెండూ అవసరం. ఈ రెండింటినీ కలిపి “ప్రైవేట్ కీ” అని అంటారు.
ఈ విధంగా “ప్రైవేట్ కీ” కలిగి ఉన్న ఇద్దరు యూజర్లు తమ యొక్క కాయిన్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొనవచ్చు మరియు అమ్ముకోవచ్చు.

 

 

క్రిప్టో కరెన్సీ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:-

1). క్రిప్టో కరెన్సీ కి సంబంధించి ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ దేశం కూడా  దీనికి జవాబుదారీతనాన్ని తీసుకోవడం లేదు.
2). ఏ ప్రభుత్వం, ఏ బ్యాంకు మరియు ఏ ఫైనాన్స్ సంస్థ కూడా దీనిని నిర్వహించడం లేదు.
3). బిట్ కాయిన్స్ లాంటి క్రిప్టోకరెన్సీ కి ఎవరి నుండి ఎలాంటి పూచీ ఉండదు.
4). వాస్తవంగా వాడుకలో ఉన్న కరెన్సీ కాదు కాబట్టి ఏ దేశ చట్టం కూడా ఈ క్రిప్టోకరెన్సీ కి హామీ ఇవ్వదు.
5). బిట్ కాయిన్స్ కు సంబంధించి పూర్తి అవగాహన పొందిన తర్వాత వినియోగదారులు ట్రేడింగ్ చేయడం మంచిది.

 

 

Criptocurrency public ledger guarantee:-

క్రిప్టో కరెన్సీ కు పబ్లిక్ లెడ్జర్ గ్యారెంటీ:
బిట్ కాయిన్స్ లాంటి క్రిప్టోకరెన్సీ కి ఏ దేశము మరియు సంస్థ పూచీకత్తు ఇవ్వదు కానీ, పబ్లిక్  లెడ్జర్ గ్యారంటీ ఇస్తుంది. అంటే క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ను పబ్లిక్ లెడ్జర్  అనేది ఒక రికార్డుగా నమోదు చేస్తుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం తో, పబ్లిక్ లెడ్జర్ లో బిట్కాయిన్ చెక్క లావాదేవీలను నమోదు చేయడం జరుగుతుంది దీనినే మైనింగ్ అని అంటారు.

 

Cryptocurrency good news:-

క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన శుభ వార్తలు:

ప్రస్తుతం కొన్ని దేశాలు ఈ క్రిప్టోకరెన్సీ వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గోల్డ్ ,సిల్వర్ మరియు బ్రాస్ కోటింగ్ ఉన్న కాయిన్స్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కాసేసియస్  బిట్ కాయిన్స్ పేరు తో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి రంగు ఆధారంగా వీటి విలువ మార్పు చెందుతూ ఉంటుంది. అంటే చేతిలో పెట్టుకుని చలామణి చేయగలిగే బిట్ కాయిన్స్ త్వరలో రాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *