SBI life Smart future Choices In Telugu – “అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి “

                          SBI life Smart Future Choices in Telugu

 

SBI life  Smart  future choices ఎస్బిఐ లైఫ్ కొత్తగా సాంప్రదాయమైన జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. దీని పేరు ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిస్ ప్లాన్ ( SBI life smart future choices).ఈ స్కీం లో మేట్యూరిటీ కంటే ముందే ప్రతీ సంవత్సరం రెగ్యులర్ బోనస్ మరియు మనీ బ్యాక్ రూపంలో అమౌంట్ లభిస్తుంది.

ఎస్బిఐ లైఫ్ ‘స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్’ అనేది నాన్ లింక్డ్, పార్టిసిపేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Non linked, Participated life Insurance )ప్లాన్. షేర్ మార్కెట్ తో ఎటువంటి సంబంధం కలిగి ఉండదు.ఇది మీ యొక్క సేవింగ్స్ ను అభివృద్ధి చేస్తుంది. వ్యక్తులకు వారి యొక్క లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మరియు జీవితంలోని ప్రతి సందర్భంలో అమౌంట్ ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆధారంగా ఈ SBI Life smart future choices న్ని రూపొందించడం జరిగింది.

 

ప్రయోజనాలు ( SBI life Future Choices Features ):-

.• క్లాసిక్ ఛాయిస్( Classic ) మరియు ఫ్లెక్సీ ఛాయిస్ ( Flexi  )అనే రెండు వేరియంట్లను కలిగి ఉంటుంది.
సేవింగ్స్ ప్లాన్ విషయంలో పవర్ ఆఫ్ ఛాయిస్, మనీ ఆన్ డిమాండ్ లాంటి వివిధ ఆప్షన్స్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు.

• ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ( Limited Premium Paying  )ప్లాన్ కాబట్టి పాలసీ సమయం మొత్తం ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు.
క్యాష్ బోనస్ + సర్వీవల్ బోనస్ + టెర్మినాల్ బోనస్ రూపంలో అమౌంట్ అందివ్వబడుతుంది.

ఆటోకవర్ ఫెసిలిటీ ( Auto cover )ద్వారా 1, లేదా 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ సందర్భంలో కవరేజ్ పొందవచ్చు మరియు పాలసీ మధ్యలో ప్రతీ సంవత్సరం క్యాష్ బోనస్, మనీ బ్యాక్ లభిస్తాయి.

•  క్యాష్ బోనస్, లైఫ్ కవరేజ్ మరియు  మేట్యూరిటీ పై టాక్స్  ( Tax Benefits ) ప్రయోజనాలు లభిస్తాయి.

 

SBI life Smart future Choice ప్లాన్ లో 2 ముఖ్య ఆప్షన్ ఉన్నాయి.

 

1. క్లాసిక్ ఆప్షన్ ( Classic Option ):-

Classic Choice = Cash Bonus + Maturity

ఈ ఆప్షన్ లో పాలసీ సమయం మొత్తం, ప్రతీ సంవత్సరం రెగ్యులర్ ఆదాయం రూపంలో క్యాష్ బోనస్ లభిస్తుంది. పాలసీ సమయం ముగిసిన తర్వాత మేట్యూరిటీ కూడా యధావిధిగా అందివ్వడం జరుగుతుంది.

 

2. ఫ్లెక్సీ ఆప్షన్ ( Flexi Option ):-

( Flexi Option = Cash Bonus + Survival Bonus + Maturity Benefit )

ఈ ఆప్షన్ లో పాలసీ సమయం మొత్తం, ప్రతీ సంవత్సరం రెగ్యులర్ ఆదాయం రూపంలో క్యాష్ బోనస్ లభిస్తుంది,దీనితోపాటుగా సర్వేవల్ బెనిఫిట్ అంటే మధ్యలో మనీ బ్యాక్ విధానంగా సర్వేవల్ అమౌంట్ లభిస్తుంది, పాలసీ సమయం ముగిసిన తర్వాత మేట్యూరిటీ కూడా యధావిధిగా అందివ్వడం జరుగుతుంది.

రెండు ఆప్షన్స్ లో మీరు బోనస్ ని కావాలనుకొంటే ప్రతీ సంవత్సరం తీసుకోవచ్చు, లేదంటే వడ్డీతో కలిపి మేట్యూరిటీ సమయంలో పొందవచ్చు.

క్యాష్ బోనస్ ప్రతీ సంవత్సరం కంపెనీ నియమానుసారంగా లభిస్తుంది, ఈ అమౌంట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కానీ సర్వేవల్ అమౌంట్ తీసుకొన్న భీమా లో 10% చొప్పున ఖచ్చితంగా లభిస్తుంది.

 

• ఆటో కవరేజ్ పీరియడ్ ( Auto Cover Facility ):-

SBI Life smart future choices కు సంబంధించి, ప్రీమియం చెల్లింపులు సరిగా చెల్లించలేని పాలసీలకు ఈ కవరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో కవరేజ్ వ్యవధి, కనీసం 2 సంవత్సరాలు పూర్తి ప్రీమియంలు చెల్లించిన పాలసీలకు 1 సంవత్సరం ఆటో కవరేజ్ మరియు కనీసం 5 సంవత్సరాలు పూర్తి ప్రీమియం పేమెంట్స్ చెల్లించిన పాలసీలకు 2 సంవత్సరాలు ఈ ఆటో కవరేజ్ ఉంటుంది.

ఈ వ్యవధిలో, పాలసీ పెయిడ్ అప్ పాలసీగా మారుతుంది. అప్పుడు సర్వైవల్ బెనిఫిట్ మరియు మెచ్యూరిటీ బెనిఫిట్స్ లో మార్పులు జరగవచ్చు. పేమెంట్ చేయని బ్యాలెన్స్ ప్రీమియంలను తీసివేసిన తరువాత మాత్రమే ఆటో కవర్ పీరియడ్ లో డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది.

 

• పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) = 50 సంవత్సరాలు.

18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

 

• ఈ పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? ( Policy Term )

కనీస పాలసీ సమయం వచ్చి (Minimum Policy Period ) =15 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం ( Maximum Policy Period )    = 30 సంవత్సరాలు.

కాబట్టి మీరు ఈ పాలసీ యొక్క సమయాన్ని 12, 15, 20,25 మరియు 30 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.

 

• కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి                     =Rs 6, 55, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి కి ఎటువంటి అవధి లేదు.= No limit

కనీసం 6 లక్షల 55 వేలు నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు, కానీ ఇది మీయొక్క వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

 

ముఖ్య గమనిక :- మీరు చెల్లించే సంవత్సర ప్రీమియం కి అనుగుణంగా పాలసీ భీమా నిర్దేశించడం జరుగుతుంది.

 

• పాలసీ యొక్క గరిష్ట మెట్యూరిటీ సమయం ఎంత? ( Maximum Maturity Age? )

ఈ పాలసీయొక్క అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 70 సంవత్సరాలు గా ఉంటుంది.

అంటే ఈ పాలసీని మనం అత్యధికంగా మనకి 70 సంవత్సరాలు వచ్చే వరకూ మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది.

 

• ఈ పాలసీ లో ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? ( Premium Paying Term )

4 రకాలుగా ఈ ప్లాన్ లో మీరు ప్రీమియం ఆప్షన్స్ ని నిర్ణయించుకోవచ్చు. ఇది లిమిటెడ్ ప్రీమియం ప్లాన్.

 1. ( Limited Pay for 5 Years )     – కేవలం 7 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
 2. ( Limited Pay for 10 Years )  – కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
 3. ( Limited Pay for 12 Years )  – కేవలం 12 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
 4 . ( Limited Pay for 15 Years )  – కేవలం 15 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.

 

Max life Smart Secure Plus Plan in Telugu – “అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్ ” కనీస భీమా, అర్హతలు ఉదాహరణ ద్వారా!!

 

LIC Bhima Jyothi In Telugu -” బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ ” Best సేవింగ్ పాలసీ

 

• ఈ పాలసీలో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి? ( Premium Payment Mode )

ఈ పాలసీలో 3 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి ఒకసారి           – Yearly
2. 6 నెలలకు ఒకసారి                 – Half  Yearly
3. ప్రతినెలా                                  – Monthly

ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో నిర్ణయించుకొన్న మోడ్ ఆధారంగా ప్రీమియం చెల్లించవచ్చు.

 

ముఖ్య గమనిక : ఈ ప్రీమియంని చెల్లించడానికి పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా ఆన్ లైన్లో గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) ద్వారా చెల్లించవచ్చు.

 

1. ఉదాహరణ ( Example ) :-

 

A.  క్లాసిక్ ఛాయస్ – Classic Choice

పాలసీదారుని పేరు         – Mr.సురేష్
వయసు                              – 30 సంవత్సరాలు
పాలసీ సమయం              – 12 సంవత్సరాలు
భీమా                                   – Rs 7,14,000/-
ప్రీమియం     సమయం – 7 సంవత్సరాలు
చెల్లించే విధానం – ప్రతినెలా
నెలసరి ప్రీమియం           – Rs 8,884/-( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి

రమేష్ ప్రతినెలా ఈ పాలసీలో 8,884/- రూపాయలు చొప్పున 7 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 7,00,000/– అవుతుంది..

పాలసీ నియమానుసారంగా రమేష్ ప్రీమియం ఒకవైపు చెల్లిస్తుండగానే మరోవైపు క్యాష్ బోనస్ లభిస్తుంది.

కంపెనీ 4% చొప్పున క్యాష్ బోనస్ డిక్లేర్ చేస్తే = Rs 80,682/-
కంపెనీ 8% చొప్పున క్యాష్ బోనస్ డిక్లేర్ చేస్తే = Rs 2,20,269/- గా మొత్తం పాలసీ సమయంలో లభిస్తుంది.

అంటే కనీసం 4% నుంచి అత్యధికముగా 8% మధ్యలో క్యాష్ బోనస్ రేట్ ఉంటుంది, అదేవిధంగా క్యాష్ బోనస్ ప్రతీ సంవత్సరం వేరు వేరు గా ఉంటుంది.

 

.  మేట్యూరిటీ ప్రయోజనం ( Maturity Benefit ):-

“Maturity = 138% of Basic Sum Assured + Accumulated differed bonus + Terminal bonus “

ప్లాన్ యొక్క 12 వ సంవత్సరం Mr. రమేష్ కి  138% అఫ్ బేసిక్ భీమా + అక్క్యూమ్ డిఫెరెడ్ బోనస్ + టెర్మినాల్ బోనస్ కలిపి మేట్యూరిటీ గా = Rs 7,62,000/- లభిస్తాయి.

 

• మరణ ప్రయోజనం ( Death Benefit ) :-

Mr. రమేష్ పాలసీ సమయం మధ్యలో ఏ కారణంగా మరణించినా బేసిక్ భీమా = Rs 7,14,000/- నామినీకి అందివ్వడం జరుగుతుంది.

దీనితోపాటుగా మధ్యలో క్యాష్ బోనస్ తీసుకోకపోతే క్యాష్ బోనస్ మరియు టెర్మినాల్ బోనస్ కూడా నామినీకి లభిస్తుంది.

 

2. ఉదాహరణ ( Example ) :-

 

 B .ఫ్లెక్సీ ఛాయిస్ – Flexi Choice

పాలసీదారుని పేరు              – Mr.సూరజ్
వయసు                                   – 30 సంవత్సరాలు
పాలసీ సమయం                   – 12 సంవత్సరాలు
భీమా                                        – Rs 7,14,000/-
చెల్లించవలసిన సమయం – 7 సంవత్సరాలు
ప్రీమియం చెల్లించే విధానం – ప్రతినెలా
నెలసరి ప్రీమియం – Rs 8,884/-   ( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి

రమేష్ ప్రతినెలా ఈ పాలసీలో 8,884/- రూపాయలు చొప్పున 7 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 7,00,000/- అవుతుంది.

పాలసీ నియమానుసారంగా రమేష్ ప్రీమియం ఒకవైపు చెల్లిస్తుండగానే మరోవైపు క్యాష్ బోనస్ + సర్వేవల్ బోనస్లు లభిస్తాయి.

కంపెనీ 4% చొప్పున క్యాష్ బోనస్ డిక్లేర్ చేస్తే = Rs 80,682/-
కంపెనీ 8% చొప్పున క్యాష్ బోనస్ డిక్లేర్ చేస్తే = Rs 2,20,269/- గా మొత్తం పాలసీ సమయంలో లభిస్తుంది.

అంటే కనీసం 4% నుంచి అత్యధికముగా 8% మధ్యలో క్యాష్ బోనస్ రేట్ ఉంటుంది, అదేవిధంగా క్యాష్ బోనస్ ప్రతీ సంవత్సరం వేరు వేరు గా ఉంటుంది.

 

• సర్వేవల్ బెనిఫిట్ ( Survival Benefit ):-

పాలసీ మధ్యలో మనీ బ్యాక్ రూపంలో 10% అఫ్ ప్రాథమిక భీమా గా ( 10% of Basic Sum Assured ) =Rs 1,42,800/- రూపాయలు లభిస్తాయి.

 

. మేట్యూరిటీప్రయోజనం ( Maturity Benefit ):-

“Maturity = 138% of Basic Sum Assured + Accumulated differed bonus +Deferred Survival Bonus +Terminal bonus “

 

ప్లాన్ యొక్క 12 వ సంవత్సరం Mr. రమేష్ కి 80% అఫ్ బేసిక్ భీమా + అక్క్యూమ్ డిఫెరెడ్ బోనస్ + టెర్మినాల్ బోనస్ కలిపి మేట్యూరిటీ గా = Rs 6,00,000/-     లభిస్తాయి.

 

• మరణ ప్రయోజనం ( Death Benefit ) :-

Mr. రమేష్ పాలసీ సమయం మధ్యలో ఏ కారణంగా మరణించినా బేసిక్ భీమా = Rs 7,14,000/- నామినీకి అందివ్వడం జరుగుతుంది.

దీనితోపాటుగా మధ్యలో క్యాష్ బోనస్ తీసుకోకపోతే క్యాష్ బోనస్, సర్వేవల్ బోనస్ మరియు టెర్మినాల్ బోనస్ కూడా నామినీకి లభిస్తుంది.

రెండు ఆప్షన్స్ లో కూడా మొత్తం పాలసీ సమయం ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

 

. పన్ను ప్రయోజనాలు( Tax Benefits ):-

సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఎప్పటికప్పుడు భిన్నంగా ఉండే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం జీవిత భీమా అనేది ఆదాయపు పన్ను మినహాయింపులకు వర్తిస్తుంది. ఈ పాలసీ కి ఆదాయ పన్ను చట్టం  సెక్షన్ 80సి  ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి.

 

• పైడ్ అప్ వేల్యూ ( Paid up Value )

   వర్తిస్తుంది,
పైడ్ అప్ వేల్యూ అంటే ఈ పాలసీలో మీరు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రీమియం చెల్లించి, తర్వాత ఏదైనా అనివార్య కారణాల కారణంగా పాలసీలో ప్రీమియం చెల్లించడం మానివేసినప్పటికీ ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన ప్రీమియంని ఆధారంగా చేసుకొని పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి లభించడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :-

ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఉండాలి.

 

• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? ( Revival Period ?)

ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

• ఈ పాలసీలో ప్రీమియంకి గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period  )

గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.

ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

 

• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value ?)

ఈ పాలసీలో పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు మీరు జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.

కానీ మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా సరే పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.

 

• ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏమిటి? ( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై మీరు అసంతృప్తి చెందినట్లైతే వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన మీ ప్రీమియంని వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు విధించబడవు.

ముఖ్య గమనిక : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే ప్రీమియం పై కనీస సర్వీస్ చార్జీలు వసూలుచేయబడతాయి.

 

• ముగింపు ( Conclusion ):-

Sbi life Smart future Choices పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

https://www.sbilife.co.in/en/individual-life-insurance/traditional/smart-future-choices

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *