వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు
వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా
ఎప్పటిలాగే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏపీ వైఎస్సార్ ప్రభుత్వం మరోమారు తీపి కబురు చెప్పింది. పేదింటి ఆడపిల్లల కోసం వైఎస్ఆర్
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో, ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తున్న వైఎస్ సర్కార్, మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేర్లతో కొత్త పథకాలను ప్రకటించింది. ఈ పథకాలు అక్టోబరు 1 నుంచే అమల్లోకి వస్తాయి.
ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు పేదింటి తల్లిదండ్రులు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు. అప్పుచేసి పెళ్లి జరిపించి, బిడ్డను అత్తింటికి పంపడంజరుగుతుంది. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం కింద లక్షరూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు,వైఎస్ఆర్ షాదీతోఫా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పథకం అక్టోబర్ 1 నుంచిఅమల్లోకి రానుంది.

ఎవరు అర్హులు?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన పెళ్లి వయసు లో ఉన్న ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
పేద ఆడపిల్లల కుటుంబాలు గౌరవప్రదమైన రీతిలో పెళ్లి చేసుకునేందుకు ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.
అర్హులు – నియమాలు నిబంధనలు:-
ఈ పథకం యొక్క ప్రయోజనం పొందాలంటే
*మొదటి వివాహం చేసుకున్నవారే అర్హులు అవుతారు.
*వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 సంవత్సరాలు మరియు వరుడి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
*వధూవరులు ఇద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
*రెండు కుటుంబాలలో సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు గా ఉండాలి.
*నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.
ఎవరు అనర్హులు:-
*మూడెకరాల పైబడిన మాగాణి, పది ఎకరాలకు పైబడిన మెట్ట భూమి వంటివి కలిగి ఉంటే, ఈ పథకానికి అనర్హులు.
*కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ గా ఉండకూడదు.
* ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహా నాలుగు చక్రాల వాహనాలు సొంతంగా ఉండకూడదు. *వధూవరుల కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లింపు
దారులుగా ఉండకూడదు. ఇందులో పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
* మునిసిపల్ ప్రాంతాల్లో ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారులు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ బిల్ట్-అప్
ఏరియా కలిగి ఉండకూడదు.
*ఈ విధంగా వివిధరకాల అర్హతలు మరియు విధానాల ద్వారా ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తుంది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, మరియు కులాంతర వివాహాలకు ఒక లక్షా 20 వేల రూపాయలు అందచేయబడును.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద బీసీలకు రూ.50 వేలు, బీసీ కి చెందిన ఉప కులాల్లో (sub caste) కులాంతర వివాహాలకు రూ.75 వేలు ఇవ్వబడును.
షాదీ తోఫా కింద మైనార్టీలకు లక్ష రూపాయలు.
వికలాంగుల వివాహాలకు రూ.1.5 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40 వేలు ఇవ్వాలనిఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ALSO READ
YSR కళ్యాణమస్తు పథకానికి అవసరమైన పత్రాలు:-
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన డాక్యుమెంట్లు:
*ఆధార్ కార్డు
*DOB సర్టిఫికెట్
*ఆదాయ ధృవీకరణ పత్రం
10వ తరగతి సర్టిఫికెట్
విద్యుత్ బిల్లు
మొబైల్ నంబర్
బ్యాంకు అకౌంట్ వివరాలు
వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు పథకం మరియు వైఎస్‌ఆర్ షాదీ తోఫా కోసం అప్లై చేయడం ఎలా?
అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ‘నవశకం’ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్ (https://gsws-nbm.ap.gov.in/) ద్వారా అప్లై
చేసుకోవాలి. అయితే, త్వరలోనే దీని కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయబడతాయని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
“వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు” మరియు “వైఎస్‌ఆర్ షాదీ తోఫా” ల కోసం అప్లై చేయడానికి, గ్రామం లేదా వార్డు సచివాలయాలను సందర్శించాలి. కాబట్టి మీరుతప్పనిసరిగా అధికారులను సంప్రదించండి మీరు వారిని సందర్శించినప్పుడు, మీరు తప్పనిసరిగా నింపాల్సిన ఫార్మ్స్ ను అందిస్తారు మరియు అవసరమైనపేపర్‌లను అందచేస్తారు. ఆ తర్వాత అన్ని ధృవీకరణలు పూర్తి చేసిన తర్వాత, మీకు ఈ పధకం యొక్క ప్రయోజనాలు మంజూరు చేయబడతాయి.