How To Buy RBI BONDS in Telugu
How to buy RBI Bonds 2022 – 23
నేను ఒక ఎలాంటి పధకంలో పొదుపు చెయ్యాలనుకొంటున్నానంటే, పెట్టుబడి పై ఒక్కశాతం కూడా రిస్క్ ఉండకూడదు,100% గవర్నమెంట్ ద్వారా పొదుపు సురక్షితం కావాలి మరియు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో లభించే వడ్డీకంటే ఎక్కువ వడ్డీ లభించాలి దీనితోపాటుగా రెగ్యులర్ ఇన్కమ్ స్కీమ్ మధ్యలో అందివ్వగలగాలి అయితే ప్రతి నెలా కాకుండా ఒక్కసారే డిపాజిట్ చెయ్యాలి!!
ఇలాంటి గవర్నమెంట్ పధకం గురించే మీరూ ఎదురు చూస్తున్నారా? అయితే ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి!
RBI బాండ్లు కూడా మీ డబ్బును పెంచుకోవడానికి ఒక మార్గం. బాండ్లు కూడా FD ల మాదిరిగా, నిర్ణీతమైన సమయానికి మాత్రమే పెట్టుబడి పెడతాయి చాలా వరకు ఈ బాండ్లు భారత ప్రభుత్వం అందిస్తుంది. ఈ బాండ్ల కు సంబంధించి, మీరు ఎంపిక చేసుకునే బాండ్ రకాన్ని బట్టి, మెచ్యూరిటీ తేదీ నాటికి వడ్డీని మరియు అసలును తిరిగి చెల్లించడానికి, గవర్నమెంట్ భాద్యత వహిస్తుంది.
ఆర్. బి. ఐ. బాండ్స్ యొక్క అనువర్తనాలు(Features of RBI BONDS):
ఎక్కువ వడ్డీ రేట్లు:- (FD) ఫిక్స్డ్ డిపాజిట్ లతో పోలిస్తే బాండ్లపై వడ్డీ రేటు ఎక్కువగా మరియు పోస్ట్ ఆఫీస్ NSC స్కీం కంటే అదనంగా లభించడం జరుగుతుంది.
వడ్డీ చెల్లింపులు – ఇన్వెస్ట్మెంట్ బాండ్లు సౌకర్యవంతమైన వడ్డీ చెల్లింపులను కలిగి ఉండవచ్చు, సాధ్యమైనంత వరకూ ప్రతి 6 నెలలకు వడ్డీ ని అకౌంట్ లో అందిస్తుంది, కానీ అన్ని వేళలా ఇది సాధ్యం కాదు.
ఫ్లెక్సిబిలిటీ:- ఇన్వెస్ట్మెంట్ బాండ్లు ఫ్లెక్సిబుల్ లిమిట్స్ ను కలిగి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
సురక్షితమైన బాండ్లు :- బాండ్లు సురక్షితమైన పెట్టుబడులు, ఎందుకంటే వీటిని RBI లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహిస్తాయి. అందుకే ఇవి ఎక్కువ ప్రజాదరణ కలిగి ఉంటాయి.
• అర్హులు ఎవరు? (Who Can Invest In Bonds? )
కేవలం భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది, NRI లకు ఈ స్కీంలో డిపాజిట్ ఇవ్వబడదు.18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.
అదేవిధంగా 10 సంవత్సరాలు వయసు పైబడిన పిల్లలు స్వయంగా ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు మరియు చిన్నపిల్లల పేరు పై అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేసి తల్లితండ్రులు నిర్వహించవచ్చు.
• డిపాజిట్ విధానం ( Type of Deposits of RBI Bonds?)
సింగల్ డిపాజిట్ కేవలం మొత్తం స్కీం సమయంలో ఒక్కసారి కడితే చాలు ఇతర పొదుపు పధకాల వలె ప్రతి నెలా సదుపాయం లభించదు.
కనీస సింగల్ డిపాజిట్ (Minimum )= Rs 1000/-
అత్యధికముగా ( Maximum )ఎంతైనా డిపాజిట్ చెయ్యవచ్చు కానీ 1500,2500,3500 కాకుండా 1000 ని కలుపుతూ ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.
• స్కీమ్ సమయం ( RBI Bonds Tenure?)
7 సంవత్సరాలు. ఇంతకంటే ఎక్కువ గాని లేక తక్కువ సమయానికి గాని బాండ్స్ లభించవు.
LIC Bima Jyoti 860 -” బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ “
• బాండ్స్ లో ప్రస్తుతం వడ్డీ రేట్ ఎంత? ( RBI bonds 2022 Interest Rate?)
RBI బాండ్స్ యొక్క వడ్డీ రేట్ పోస్ట్ ఆఫీస్ NSC నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ తో ముడిపడి ఉంటుంది, NSC స్కీమ్ లో లభించే వడ్డీ కి 0.35% ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అందువల్ల NSC స్కీం వడ్డీ పెరిగితే బాండ్స్ యొక్క వడ్డీ పెరగడం NSC స్కీం వడ్డీ తగ్గితే బాండ్స్ వడ్డీ తగ్గడం సహజం.
ఎలా అంటే జూలై 2022 NSC స్కీం వడ్డీ 6.80% దీనికి 0.35% అదనంగా జోడిస్తే 7.15% బాండ్స్ వడ్డీ అవుతుంది. అలాగే ప్రతి 6 నెలలకు మీ పెట్టుబడి పై లభించే వడ్డీ నేరుగా స్కీమ్ సమయం అంతా మీ సేవింగ్ అకౌంట్ లో జమా చెయ్యడం జరుగుతుంది అయితే బ్యాంక్ ఫిక్సడ్ డిపాజిట్ తో పోలిస్తే RBI బాండ్స్ మంచి రిటర్న్స్ ను అందిస్తాయి.
• రెగ్యులర్ ఆదాయం ( Regular Interval Income ):
సాధారణంగా ఫిక్సడ్ డిపాజిట్ స్కీం లో అసలు + కాల పరిమితిలో లభించే వడ్డీ కలిపి ఒక్కసారి మెట్యూరిటీ గా రావడం జరుగుతుంది కానీ ఫ్లోటింగ్ రేట్స్ బాండ్స్ లో అసలపై లభించే వడ్డీ ప్రతి 6 నెలలకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ లో ఇదొక మంచి ప్రయోజనం.
• సంపూర్ణ విరమణ – (Bonds Pre – Mature Withdrawal)
ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత 7 సంవత్సరాల సమయంలో స్కీం క్లోజ్ చేసే అవకాశం సామాన్య వ్యక్తులకు లభించదు కానీ కొన్ని కేటగిరి వ్యక్తుల కి సంపూర్ణ విరమణ వర్తిస్తుంది.
సామాన్య వ్యక్తులకి – 7 Years
60 నుంచి 70 సంవత్సరాల మధ్య – 6 సం||లు
70 నుంచి 80 సంవత్సరాల మధ్య – 5 సం||లు అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడిన వారికి 4 సంవత్సరాల తర్వాత సంపూర్ణ విరమణ వర్తిస్తుంది.
సంపూర్ణ విరమణ – (Bonds Pre – Mature Withdrawal) చేసినప్పుడు చివరిగా మీకు లభించిన అర్ధవార్షిక వడ్డీ లో 50% ను పెనాల్టీ రూపంలో విధిస్తారు.
• లోన్, ట్రాన్సఫర్ & ట్రేడ్ ( is loan available in RBI bonds ):
ఒకసారి స్కీం లో ఇన్వైట్ చేస్తే మధ్య లో వేరే అకౌంట్ కి డిపాజిట్ ను ట్రాన్స్ఫర్ చెయ్యడం లేక స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ నిర్వహించడం మరియు లోన్ లభించడం వంటివి బాండ్స్ లో కుదరదు అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి చెయ్యాలి.
• టాక్స్ నియమాలు ( Is Bonds Tax Free?)
RBI బాండ్స్ ఫిక్సడ్ డిపాజిట్ కేటగిరి కి చెందినవిగా ఉంటాయి అందువల్ల లభించే వడ్డీ పై టాక్స్ రూల్స్ వర్తిస్తాయి ఇది మీకు లభించే వడ్డీ యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ మీ ఆదాయం టాక్స్ పరిధిలో లేనట్లయితే ఫారం 15 G / 15 H ను అందించి టాక్స్ ను అధిగమించవచ్చు.
• ఎలా ఎక్కడ ఇన్వైట్ చెయ్యాలి? ( How to invest In RBI Bonds?)
గవర్నమెంట్ అర్హత కలిగిన SBI, HDFC, ICICI వంటి బ్యాంకు లు మరియు అర్హత కలిగిన బ్రోకర్స్ సహాయంతో బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది.
దీని కొరకు – Bonds Required Documents?
1. ఆధార్ కార్డు – Aadhar Card
2. ఓటర్ ఐడి – Voter ID
3. రెండు ఫోటోలు – Two Photos
4. బ్యాంక్ పాస్ బుక్ – Bank Pass Book
బాండ్స్ చాలా వాళ్ళు వరకు డిజిటల్ రూపంలో లభించవచ్చు.