Corona Virus Update 2022 in Telugu -పొంచిఉన్న ఫోర్త్ వేవ్!

 

          CORONAVAIRUS Updates in Telugu

 

Corona Virus Update 2022 in Telugu

భారత్ లో కరోనా వైరస్(Corona Virus) కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి తగ్గింది అని ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపు కొత్త వైరస్ లు వస్తున్నాయి. అలాగే కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా 15000 పైగా కేసులు నమోధవడం ఆందోళన కల్గిస్తుంది. దీనికి కారణం వైరస్ బారిన పడే వారి యొక్క పాజిటివ్ రేటు పెరగడం. టెస్ట్ లు పెంచితే కేసులు పెరిగే అవకాశం వుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

Corona Virus Update 2022 in Telugu -పొంచిఉన్న ఫోర్త్ వేవ్!

 

 

ఇప్పటికే మనం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, తోర్డ్ వేవ్ చూసాము. ఇందులో కరోనా సెకండ్ వేవ్ భారత దేశం మొత్తం ప్రాణ భయంతో విలవిలలాడింది. ఈ కరోనా వైరస్ విజృంభణ సమయంలో సంబంధ బాంధవ్యాలు సైతం దూరం చేయబడ్డాయి. ఎంతో మంది తన పిల్లలను,తల్లిదండ్రులను కోల్పోయి  అనాధులుగా మిగిలారు. థర్డ్ వేవ్ ను మనం ఎదుర్కోవడం లో పట్టు సాధించాము కానీ ఇప్పుడు కరోనా ఫోర్త్ వేవ్ వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దానికి అనుగుణంగానే దేశం లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకవేళ కరోనా ఫోర్త్ వేవ్ వస్ట్ దాని తీవ్రత చాలా దారుణంగా వుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఇంతే కాకుండా రాబోవు కాలంలో ఈ వైరస్ తన వేర్వేరు రూపాంతరాల లో మారుతూ ప్రజలకు మరింత ఇబ్బందిని కలిగించేలా మారే అవకాశం వుందని వరల్డ్ హెల్త్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దానినే ఎక్స్ డిసీజ్ (X Disease) అంటున్నారు. ఇందులో X అంటే రాబోవు కాలంలో ప్రబలించే ఊహాజనితమైన వ్యాధులు అని అర్థం.

నిన్న ఒక్కరోజు 17092 కేసులు నమోదు అయ్యాయి, మరణించిన వారి సంఖ్య 29, డిశ్చార్జ్ అయిన వారు 14,684, కరోనా పాజిటివ్ రేటు 4.14% పెరిగింది.

 

 

 

LIC Jeevan Mangal Plan Telugu 940 &; సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!

 

 

 

SBI Life Shubh Nivesh Plan Telugu ;బెస్ట్ ఎండోమెంట్ పాలసీ ; అర్హతలు ,ప్రీమియం , బెనిఫిట్స్ ఇవే !

 

 

 

భారత్ లో ఇప్పటి వరకు ఈ మహమ్మారి వల్ల మరణాలు 5,25,168 సంభవించాయి. రికవరీ రేటు 98.54  మరియు డిశ్చార్జ్ అయిన వారు 4,28,51,590 గా వున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్మూలనకు 1,97,84,80,015 టీకాలు ప్రజలకు వేయడం జరిగింది.

కొన్ని వారాల క్రితం మంకీ పాక్స్ (Monkey poks) అనే కొత్త వ్యాధి నెమ్మదిగ వ్యాపిస్తుంది. అయితే ఇది బ్రిటన్ లో 1000 కు పైగా కేసులు వున్నాయి.ఇప్పుడు సీజనల్ వ్యాధులు ను ఎలాగూ ఎదుర్కోవాలి. కానీ మరో కొత్త ఎక్స్ డిసీజ్ అనే కొత్త   వైరస్ రాభోతున్నట్లు సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎక్స్ డిసీజ్ వస్టే కరోనా కంటే  తీవ్రంగా వుంటుందని చెప్పారు. కేంద్రం ఇప్పటికే కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను జాగ్రత్త వహించాలి అని నిర్దేశించింది.

 

https://www.mygov.in/

 

కరోనా సమయంలో పాటించిన వ్యక్తికి వ్యక్తికి మధ్య భౌతిక దూరం, మాస్క్, వ్యక్తిగత శుభ్రత మరియు ఆరోగ్య నియమాలు యధావిధిగా పాటించాలి అని కేంద్ర నిర్దేశించింది.  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలియజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *