LIC Money Back Plan 20 Years Plan Details In Telugu
LIC Money Back 20 Years Plan
న్యూ మనీ బ్యాక్ ప్లాన్-20 ఏళ్లు పాలసీ, ఎల్‌ఐసి ఇండియా అందించే అత్యుత్తమ మనీ బ్యాక్ పాలసీలలో ఇది ఒకటి.
LIC యొక్క న్యూ మనీ బ్యాక్ ప్లాన్-20 సంవత్సరాలు అనేది పార్టిసిపేటింగ్, లిమిటెడ్ ప్రీమియం మరియు నాన్-లింక్డ్ ప్లాన్. ఇది కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకున్న ప్లాన్. నిర్ధిష్ట వ్యవధిలో మనుగడపై కాలానుగుణ చెల్లింపుతో పాటు ప్లాన్ వ్యవధిలో మరణం నుండి రక్షణ యొక్క ఆకర్షణీయమైన కలయికను అందిస్తుంది.
పాలసి మధ్యలో మనీ బ్యాక్ అమౌంట్ ని నేరుగా పాలసీదారుని ఖాతాలో జమా చేస్తుంది.ఈ ప్రత్యేకమైన కలయిక తో మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా మరణించిన పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా జీవించి ఉన్న పాలసీదారులకు మెచ్యూరిటీ సమయంలో ఏకమొత్తాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ దాని రుణ సౌకర్యం ద్వారా లిక్విడిటీ అవసరాలను కూడా చూసుకుంటుంది.
మన జీవితంలో ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉంటుంది. మరణాన్ని ఎవరూ ఊహించలేరు. జీవితంలో ఫైనాన్షియల్ రిస్క్ చేయడానికి మరియు భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడానికి జీవిత బీమా పొందడం ఉత్తమ మార్గం.
• న్యూ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీ ఎలా పనిచేస్తుంది? – How Does It’s Work?
ఈ పాలసీ ప్రకారం, పాలసీదారు 15 సంవత్సరాల వరకు ప్రీమియంలను చెల్లిస్తారు. పాలసీ మధ్యలో 3 సార్లు మనీ బ్యాక్ అమౌంట్ మరియు 20 సంవత్సరాల ముగింపులో బీమా మొత్తం చెల్లించబడుతుంది.
ముఖ్య విషయాలు – Key Features
1. పాలసీ మెచ్యూరిటీ కాలానికి చేరుకునే వరకు ప్రతి 5 సంవత్సరాలకు బీమా హామీ మొత్తంలో 20% పాలసీదారునికి మనీ బ్యాక్ రూపంలో చెల్లించబడుతుంది.
2. 13 నుండి 50 సంవత్సరాల వయస్సు వారికి లైఫ్ కవరేజ్.
3. ప్రాథమిక హామీ మొత్తంలో 125% వరకు రిస్క్ కవరేజ్.
పాలసి యొక్క 5వ, 10వ, 15వ సంవత్సరాలకు ప్రాథమిక మొత్తంలో 20% వరకు సర్వైవల్ ప్రయోజనాల తో మనీ బ్యాక్ మరియు 20వ సంవత్సరం చివరిలో చివరి మెచ్యూరిటీ.
4. LIC ద్వారా ప్రకటించబడిన అన్ని బోనస్‌లు మరియు చివరి అదనపు బోనస్‌లకు అర్హత.
టర్మ్ రైడర్ బెనిఫిట్ మరియు డబుల్ యాక్సిడెంట్ రైడర్ అందుబాటులో ఉంటాయి.
5. డబుల్ టాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది అంటే, ప్రీమియం చెల్లించిన మొత్తం కు 80C పన్ను ప్రయోజనం రూ1,50,000 వరకు ఉంటుంది. ముఖ్యంగా మెచ్యూరిటీ కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉంటుంది దీనితోపాటుగా లోన్ మరియు సరెండర్ సౌకర్యం అందుబాటులో ఉంది.
• మరణ ప్రయోజనం – Death Benefits
దురదృష్టవశాత్తూపాలసీదారుడుచని
• మెచ్యూరిటీ ప్రయోజనాలు- Maturity benefits
బీమా యొక్క హామీ మొత్తంలో 20% వరకు పాలసీ హోల్డర్‌కు ప్రతి 5 సంవత్సరాలకు మనీ బ్యాక్ విధానం లో చెల్లించబడుతుంది మరియు మెచ్యూరిటీ సమయంలో, మిగిలిన 40% లాయల్టీ బోనస్‌ల చేర్చి చెల్లించబడుతుంది.
పాలసీ యొక్క 5వ, 10వ మరియు 15వ సంవత్సరాల తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 20% చెల్లించబడుతుంది మరియు మెచ్యూరిటీ సమయంలో 40% బేసిక్ సమ్ అష్యూర్డ్ + వెస్టెడ్ బోనస్ + అడిషనల్ బోనస్ చెల్లించ బడుతుంది.
• మనుగడ ప్రయోజనాలు – Survival Benefits
LIC 20 సంవత్సరాల మనీ బ్యాక్-920 ప్లాన్ లో మీరు ఎప్పటికప్పుడు కొంత డబ్బును తిరిగి పొందుతారు.
5 సంవత్సరాల తర్వాత (మనుగడ/మనీ బ్యాక్ బెనిఫిట్): హామీ మొత్తంలో 20%·
10 సంవత్సరాల తర్వాత (మనుగడ/మనీ బ్యాక్ బెనిఫిట్): హామీ మొత్తంలో 20%·
15 సంవత్సరాల తర్వాత (మనుగడ/మనీ బ్యాక్ బెనిఫిట్): హామీ మొత్తంలో 20% వరకు లభిస్తుంది.
Jeevan Labh Policy 936ఎల్. ఐ. సి ఈ స్కీం లో రోజుకి Rs 66/- రూ||లు పొదుపు చేస్తే, మెట్యూరిటీ సమయంలో 13 లక్షలు పొందవచ్చు, వివరాలు చెక్ చెయ్యండి
PPF Scheme in Telugu -& పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్& అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
రైడర్ బెనిఫిట్స్ – Additional Riders
1. ఆక్సిడెంట్ డెత్ అండ్ టోటల్ పేర్మినెంట్ డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ – Accidental Death And Total Permanent Disability Benefit Rider – UIN 512B209V02
పాలసీదారుడు డిసబిలిటీ కి గురైతే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియం మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది, దీనితోపాటుగా ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని పాలసీదారునికి ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో వచ్చే 10 సంవత్సరాలపాటు అందివ్వడం జరుగుతుంది.
2. టర్మ్ రైడర్ – Term Rider – UIN 512B210V01
పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే తీసుకొన్న భీమాకి సమానమైన అమౌంట్ నామినీకి అదనంగా లభిస్తుంది.
3.కొత్త క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ – Critical Illness Benefit Rider )
పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ ఈ రైడర్ ద్వారా అందిస్తుంది.
4. ఆక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ – Accidental Death Benefit Rider ( UIN 512B209VO1 )
పాలసీదారునికి రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే ప్రాథమిక భీమా Rs 12,50,000/-, దీనితోపాటుగా మరొక 10 లక్షలు ఈ రైడర్ ద్వారా నామినికి అదనంగా లభించడం జరుగుతుంది.
అర్హతలు – LIC Money Back 20 Years Plan Eligibility
Eligibility | Minimum | Maximum |
Age At Entry | 13 Years | 50 Years |
Sum Assured | 1 Lakh | No Limit |
Policy Term | 20 Years | 20 Years |
Maturity Age | 33 Years | 70 Years |
Premium Paying | 15 Years | 15 Years |
టేబుల్ వివరాలు : –
పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 13 Years o
అత్యధిక వయస్సు (maximum Age ) వచ్చి = 50 Years
• పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? – Policy Term
ఎల్‌ఐసి న్యూ మనీ బ్యాక్ ప్లాన్-20 ఏళ్లు పాలసీ.
• భీమా పరిమితులు? – Sum Assured
పాలసీ యొక్క కనీస భీమా పరిమితి = 1, 00, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి కి ఎటువంటి అవధి లేదు.
లక్ష రూపాయలు నుంచి ఎంతైనా భీమాని తీసుకోవచ్చు.
• గరిష్ట మెట్యూరిటీ సమయం ? – Maximum Maturity Age
ఈ పాలసీయొక్క అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి 70 సం||లుగా ఉంటుంది.
• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? – Premium Paying Term
15 సంవత్సరాలు మాత్రమే.
• ప్రీమియం చెల్లింపులు – Premium Paying Mode
సంవత్సరానికి ఒకసారి( Yearly) ,6 నెలలకు ఒకసారి ( Half Yearly ), 3 నెలలకు ఒకసారి (Quarterly ) మరియు ప్రతినెలా ( Monthly )
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ – Surrender Value
కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత తర్వాత ప్లాన్ ని సరెండర్ చెయ్యవచ్చు.
• ప్రీమియంపై డిస్కౌంట్ ఎంత లభిస్తుంది? – Rebate
1. సంవత్సరానికి ఒకసారి – Yearly = 2%
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly = 1%
3. 3 నెలలకు ఒకసారి – Quarterly =Nil
4. ప్రతినెలా
• పాలసీలో భీమాపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? – Rebate On Sum Assured?
భీమా ( Basic Sum Assured ) రిబేట్
1. 1, 00, 000 నుంచి 1, 95, 000 = Nil
2. 2, 00, 000 నుంచి 4, 95, 000 = 2.0%
3. 5, 00, 000 నుంచి ఆపై = 3.0%
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ – Revival Facility
ఏదైనా కారణంగా పాలసీలో 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లించకపొతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.అటువంటి సమయంలో మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగవచ్చు.
ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
• ఫ్రీ లుక్ పీరియడ్ 15 రోజులు – Free Look Period
పాలసీకి సంబందించిన నియమనిబంధనలు పై పాలసీదారుడు అసంతృప్తి చెందినట్లైతే వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన మీ ప్రీమియంని వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు విధించబడవు.
• LIC మెట్యూరిటీ సెటిల్మెంట్ – Maturity Settlement
1. ఈ విధానం ద్వారా పాలసీదారుడు మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని , నామినీ డెత్ ప్రయోజనాన్ని పాలసీ చివర్లో ఒక్కసారే లేదా వాయిదాల పద్దతిలో 5, 10, మరియు 15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి పొందవచ్చు.
Mode Of Installment | Minimum Amount |
Monthly | Rs 5,000/- |
Quarterly | Rs 15,000/- |
Half Yearly | Rs 25,000/- |
Yearly | Rs 50,000/- |
• గ్రేస్ పీరియడ్ ? – Grace Period
సంవత్సరానికి,6 నెలలకు మరియు 3 నెలలకు ప్రీమియం జమా చేస్తే వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
• లోన్ సౌకర్యం – Loan Facility
పూర్తి రెండేళ్ల ప్రీమియం చెల్లించిన తర్వాత రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది .
• ఆదాయపు పన్ను ప్రయోజనం – Tax Benefits
సెక్షన్ 80C మరియు 10 D కింద మీరు ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు.
• LIC Money Back 20 Years Plan – 920 – ఉదాహరణ
పాలసీదారుని పేరు – Mr.రాజు
వయసు – 30 సంవత్సరాలు
పాలసీ సమయం – 20 సంవత్సరాలు
భీమా = 5 లక్షలు
ప్రీమియం సమయం =15 సంవత్స రాలు
నెలసరి ప్రీమియం = Rs 3,314/-
చెల్లించిన మొత్తం = Rs 5,72,294/-
టాక్స్ డెడక్షన్ = Rs 11,680/-
•మనీ బ్యాక్ ( Money Back ) – 20% Of BSA
5 వ సంవత్సరం = Rs 1,00,000/-
10 వ సంవత్సరం = Rs 1,00,000/-
15 వ సంవత్సరం = Rs 1,00,000/- గా మూడు సార్లు మధ్యలో మనీ బ్యాక్ అందిస్తుంది.
• మెట్యూరిటీ ( Maturity Benefit )
40% బేసిక్ భీమా = Rs 2,00,000/-
బోనస్ ( Bonus ) = Rs 3,60,000/-
ఫైనల్ బోనస్ ( Final Bonus ) = Rs 20,000/- ఒక్కసారే మెట్యూరిటీ సమయంలో లభిస్తాయి.
రిటర్న్ – మనీ బ్యాక్ = Rs 3,00,000/-
– మెట్యూరిటీ = Rs 5,80,,000/-
ప్లాన్ లో లభించే మొత్తం = Rs 8,80,000/-
మరణ ప్రయోజనం – Death Benefit
మొత్తం పాలసీలో Mr. రాజుకి ఎప్పుడు రిస్క్ జరిగినా డెత్ బెనిఫిట్ నామినీకి ఈ కింద విధంగా లభిస్తుంది.
1. సింగల్ ప్రీమియం ఆప్షన్ లో ప్రాథమిక భీమా పై 125% + గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో Rs 6,25,000/- రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్యారెంటెడ్ అడిషన్ పాలసీదారుని రిస్క్ 5 సంవత్సరాల తర్వాత జరిగినపుడు మాత్రమే లభిస్తుంది,5 సంవత్సరాలలోపు రిస్క్ జరిగితే లభించడం జరగదు.
తరచుగా అడిగే ప్రశ్నలు – ప్రశ్నలు జవాబులు ( Q & A )
ప్ర. మనీ బ్యాక్ ప్లాన్ యొక్క ప్రధాన అర్థం ఏమిటి?
A.మనీ బ్యాక్ ప్లాన్ అంటే పాలసీదారు బీమా కంపెనీ నుండి క్రమం తప్పకుండా చెల్లింపులను అందుకుంటారు. పాలసీదారుడు డబ్బును స్వీకరించే వ్యవధి సాధారణంగా 4-5 సంవత్సరాలు గా ఉంది. మనీ బ్యాక్ ప్లాన్ యొక్క సారాంశం ఎండోమెంట్ ప్లాన్‌తో సమానంగా ఉంటుంది. ఇది ప్రారంభం లో నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత మొత్తం హామీ లో 20% అందిస్తుంది. ఇంకా, వరుసగా ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ 20% రాబడి అందించబడుతుంది. అదనపు బోనస్ మొత్తంతో కలిపి ప్లాన్ మెచ్యూర్ అయిన తర్వాత మొత్తంలో మిగిలి ఉన్న 20% పాలసీదారుకు అందించబడుతుంది.
ప్ర.మనీ బ్యాక్ పాలసీలో కొన్ని మినహాయింపులు ఏమిటి?
A.పాలసీదారుడు పాలసీ మధ్యలో మరణిస్తే, పన్నులు, రైడర్ ప్రీమియంలు మినహా చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌లలో 80% మినహా ఎలాంటి తదుపరి క్లెయిమ్‌లను LIC అంగీకరించదు. రిస్క్ ప్రారంభమైన ఖచ్చితమైన రోజు నుండి, జీవిత హామీ పొందిన వ్యక్తి పునరుద్ధరణ తేదీ నుండి మరణిస్తే, సరెండర్ విలువ ప్రకారం ఇప్పటి వరకు (మరణించిన తేదీ) చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 80% ఇవ్వబడుతుంది.
Conclusion – ముగింపు
LIC న్యూ మనీ బ్యాక్ సమాచారం వీక్షించినందుకు ధన్యవాదములు.