Top 7 Best Term Insurance Plans In 2022 Telugu – “Rs1,000/- లోపే కోటి రూపాయల భీమా” అర్హత ఇక్కడ చెక్ చేసుకోండి!

      Top 7 Best Term Insurance Plans In 2022 Telugu

Top 7 Best Term Insurance Plans

“మీరు కనుక బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లోన్ తీసుకొన్నా లేకపోతే కుటుంబ పోషణ నిర్వహించే వ్యక్తి మీరే అయినా, మీ యొక్క ఆర్థిక బాధ్యతలను పిల్లల చదువు, వివాహం, సొంత ఇంటి నిర్మాణం వీటన్నిటిని,  మీరు కుటుంబంతో జీవించి ఉన్నా లేకపోయినా సక్రమంగా నిర్భయంగా నిర్వహించాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి”.

టర్మ్ ఇన్సూరెన్స్ అతి చవకైన లైఫ్ ఇన్సూరెన్స్, తక్కువ ప్రీమియం  ద్వారా అధిక లైఫ్ కవరేజ్ ని అందిస్తుంది. ఇండియాలో 50 కి పైగానే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, వీటిలో ఏదో ఒక ప్లాన్ లేదా మంచి కంపెనీని నిర్ణయం చేయడం కష్టం.

దీనికోసం IRDAI – ఇన్సూరెన్స్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్ అథారిటీ అఫ్ ఇండియా, కంపెనీస్ యొక్క పెర్ఫార్మన్స్ ని ఆధారంగా చేసుకొని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ( Claim Settlement Ratio ) ని ప్రవేశపెట్టడం జరిగింది.

ఇప్పుడు 2022  ఇండియా లో టాప్ 7 టర్మ్ ప్లాన్స్ వివరాలు చూద్దాం.

 

 

 

 

1. మాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ – Max Life Smart Secure Plus

ఈ పాలసీ వ్యక్తి కి మెట్యూరిటీ ని అందిస్తుంది. సాధారణంగా టర్మ్ ప్లాన్లో పాలసీ సమయంలో పాలసీదారునికి రిస్క్ జరగకపోతే ఎటువంటి మెట్యూరిటీ ఇవ్వబడదు ఈ కారణం చేతనే టర్మ్ ప్లాన్ లో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కోటి రూపాయల ఇన్సూరెన్స్ కి నెలకి Rs 1,000/- రూపాయల లోపే లభిస్తుంది.

అయినప్పటికీ మాక్స్ లైఫ్ స్పెషల్ ఎగ్జిట్ వేల్యూ ( Special Exit Value ) ద్వారా ఈ ప్లాన్ లో మెట్యూరిటీ లభించడం జరుగుతుంది. ఒక ఖచ్చితమైన సమయంలో ప్లాన్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. లైఫ్ లో మీయొక్క ఆర్థిక బాధ్యతలు నెరవేరాయని, భవిష్యత్ లో టర్మ్ ప్లాన్ కొనసాగించే అవసరం లేదని భావిస్తే వెంటనే ప్లాన్ క్లోజ్ చెయ్యడం ద్వారా చెల్లించిన మొత్తం ప్రీమియం తో పాటుగా మధ్యలో అదనంగా కట్టిన పెనాల్టీ డబ్బులు కూడా వెనక్కి అందివ్వబడతాయి.

 

పాలసీ లాప్స్ – Policy Lapsation

టర్మ్ ప్లాన్ లో ఏ కారణం చేతనైన ప్రీమియం చెల్లించక పొతే వెంటనే ప్లాన్ లాప్స్ అవుతుంది. దీనివల్ల పాలసీదారునికి కట్టిన డబ్బులు రాకపోవడంతో పాటుగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తించదు.

కానీ మాక్స్ లైఫ్ ప్రీమియం బ్రేక్ ఆప్షన్ ని అందిస్తుంది. దీని ద్వారా మొత్తం పాలసీ సమయంలో 2 సార్లు కంపెనీ ఉచితంగా పాలసీదారునికి ప్రీమియం చెల్లెస్తుంది. ఒకసారి ఈ ఆప్షన్ ని వినియోగించుకొన్న తర్వాత మళ్ళీ 10 సం||ల తర్వాత లభిస్తుంది ఒకవేళ
పాలసీదారుడు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించేస్తే పాలసీ చివర రెండు ప్రీమియం మాఫీ చెయ్యడం జరుగుతుంది.

అంతేకాకుండా ప్లాన్ లో లభించే జాయింట్ లైఫ్ ( Joint Life ) ఆప్షన్ ద్వారా ఎటువంటి ఆదాయం సర్టిఫికెట్ లేకుండానే జీవిత భాగస్వామికి కూడా 25 లక్షల భీమా ను కల్పించవచ్చు. దీనితోపాటుగా వాలంటీరీ టాప్ అప్ ( Voluntary Top Up ) అంటే సమయంతోపాటు భీమాను పెంచుకోవచ్చు మరియు ప్లాన్ లో లభించే క్లెయిమ్ అమౌంట్ ని నామినీ ఒక్కసారే లేకపోతే నెలవారి రూపంలో పొందేలా నిర్ణయించుకోవచ్చు.

మాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ బేసిక్ లైఫ్, ప్రీమియం బ్రేక్ ఆప్షన్స్ ని అందిస్తుంది, కనీసం 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులకు ఈ పాలసీ వర్తిస్తుంది.   ( Top 7 Best Term Insurance Plans ) పాలసీ సమయం 10 నుంచి 67  సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.

వినూత్నమైన రీతిలో 7 రకాలుగా ప్లాన్ లో ప్రీమియం చెల్లించవచ్చు మరియు టేర్మినాల్ ఇల్నెస్ ట్రీట్మెంట్ కొరకు ప్రాథమిక భీమా లో 50% వరకూ పాలసీదారునికి మాక్స్ లైఫ్ అందిస్తుంది.దీనితోపాటుగా ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ మరియు ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ అందుబాటులో ఉంటాయి.

 

Claim Settlement Ratio   ( CSR ) – 99.40%

 

పూర్తి వివరాల కొరకు లింక్ మీద నొక్కండి !

Max life Smart Secure Plus Plan in Telugu & అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్

 

 

2. LIC టెక్ టర్మ్ ప్లాన్ – LIC Tech Term Plan 854

LIC టెక్ టర్మ్ ప్లాన్ పాలసీదారునికి రిస్క్  కవరేజ్, సెక్యూరిటీ అందివ్వడంతో పాటుగా ఇంక్రీజ్ సమ్ అస్సుర్డ్ ఫెసిలిటీ అంటే పాలసీ సమయం పెరిగే కొలది భీమా కూడా పెరుగుతూ వస్తుంది.  ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ను మరియు మహిళలకి, దుమపానం, మద్యపానం అలవాటు లేనివారికి ప్రత్యేక ప్రీమియం రేట్స్ ను అందిస్తుంది. దీర్ఘాకాల భీమా అత్యధికముగా 40 సంవత్సరాల వరకూ పొందవచ్చు. కనీసం 18 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు ఈ ప్లాన్ కి అర్హులు.

అదేవిధంగా అత్యధిక మెట్యూరిటీ వయసు 80 సంవత్సరాలు మరియు కనీసం 50 లక్షల భీమా నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాను పొందవచ్చు.

LIC టెక్ టర్మ్ ప్లాన్ పాలసీని ఆన్లైన్ లో అతి సులభంగా లభిస్తుంది.

 

Claim Settlement Ratio   ( CSR ) – 98.62%

 

పూర్తి వివరాల కొరకు లింక్ మీద నొక్కండి !

LIC Tech Term Plan Telugu 854 &ఎల్ .ఐ . సి లోనే అతి చవకైన పాలసీ& , రోజుకి 40 రూ//లకే కోటి రూపాయల భీమా

 

 

3. టాటా ఏ. ఐ. ఏ మహారాక్షా సుప్రీం ప్లస్ టర్మ్ ప్లాన్ – TaTa AIA Maha Raksha Supreme Plus Term Plan

టాటా ఏ. ఐ. ఏ మహారాక్షా సుప్రీం ప్లస్ నాన్ హోల్ లైఫ్( Non Whole Life) ఈ ఆప్షన్ ద్వారా 85 సంవత్సరాలు వచ్చే వరకూ లైఫ్ కవరేజ్ పొందవచ్చు, రెండవది హోల్ లైఫ్ ( Whole Life ) – Whole Life అంటే 100 సంవత్సరాల వరకూ ప్లాన్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

అత్యధికముగా 6 రకాల ప్రీమియం పేమెంట్ పద్ధతులు మరియు లైఫ్ స్టేజి బెనిఫిట్ అంటే అవసరాలకి అనుగుణంగా సమయంతో పాటుగా భీమా ని పెంచుకోవడం.

అలాగే ఇన్బుల్ట్ పెఔట్ ఆక్సిలారేటర్ బెనిఫిట్ – Inbuilt Payout Accelerator Benefit ఆటోమేటిక్ గా అందివ్వడం జరుగుతుంది దీని ద్వారా పాలసీదారుడు గంభీరమైన అనారోగ్యానికి గురై 6 నెలల కంటే ఎక్కువ సమయం జీవించి ఉండడని నిర్దారణ కి వస్తే ప్రాథమిక భీమా లో 50% పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది.

 

Claim Settlement Ratio   ( CSR ) – 99.06%

 

4. ఐ సి ఐ సి ఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ –  ICICI Pru I protect Term Plan

పాలసీదారుడు టెర్మినాల్ ఇల్నెస్ కి గురి అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది, అలాగే వ్యక్తి జీవించి ఉన్నప్పటికీ అమౌంట్ పే చేస్తుంది.

కనీసం 18 నుంచి 60 సంవత్సరాల వయసు వారికి ఈ ప్లాన్ వర్తిస్తుంది, 7 నుంచి 67 సంవత్సరాల మధ్య పాలసీ సమయం నిర్ణయం చేసుకోవచ్చు.

ఐ సి ఐ సి ఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ 4 రకాల ఆప్షన్స్ ని అందిస్తుంది.

1. లైఫ్ ఆప్షన్                – Life
2. లైఫ్ ప్లస్                   – Life Plus
3. లైఫ్ అండ్ హెల్త్    – Life & Health
4. అల్ ఇన్ వన్          – All In One

దీనితో పాటుగా 34 రకాల క్రిటికల్ ఇల్నెస్ కి ట్రీట్మెంట్ ని ఈ స్కీం కవర్ చేస్తుంది.

Claim Settlement Ratio   ( CSR ) – 97.84%

 

పూర్తి వివరాలు వీడియో లో తెలుసుకోవచ్చు.

 

 

 

5.  హ్. డ్. ప్. సి క్లిక్ టూ ప్రొటెక్ట్ ౩డ్ ప్లస్ – HDFC Click 2 Protect 3D Plus Plan.

అద్భుతమైన 9 రకాల వెరైంట్స్ తో HDFC Life రూపొందించిన ప్లాన్ HDFC Click 2 Protect 3D Plus Plan. డెత్, డిసబిలిటీ & డీజిస్. 18 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి ఈ ప్లాన్ వర్తిస్తుంది.

సాధారణంగా రెండు రకాల ఆప్షన్స్ ని

1. అల్ ఇన్ వన్ ( All In One )
2. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ( Life Long Protection )కలిగి ఉంటుంది.

ఈ ప్లాన్లో అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే కనీసం 10 లక్షల భీమా లభిస్తుంది అత్యధికముగా ఎంతైనా భీమా పొందవచ్చు దీనితోపాటుగా లాంగ్ టర్మ్ కవరేజ్ గా 5 నుంచి 50 సంవత్సరాల వరకు సమయాన్ని నిర్ణయం చేసుకోవచ్చు.

 

Claim Settlement Ratio   ( CSR ) – 99.07%

 

6. ఎస్. బి. ఐ లైఫ్ ఈ షిల్డ్ నెక్స్ట్  – SBI Life eshield Next

ఎస్. బి. ఐ లైఫ్ ఈ షిల్డ్ నెక్స్ట్ ఒక  నాన్ లింకేడ్ నాన్ పార్టిసిపేట్ ప్యూర్ రిస్క్ ప్రొటెక్ట్ ప్లాన్ ( Non Linked Non Participated Pure Risk Product ).

1. లైఫ్ కవర్ 2. ఇంక్రీజ్ కవర్ 3. లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

1.లైఫ్ కవర్     ( Life Cover )                    – కేవలం ప్రాధమిక భీమా
2. ఇంక్రీజ్ కవర్  (  Increase Cover )   – ప్రతి సం 10% భీమా పెంపు
3. లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్

వివాహ సమయంలో    – 50% Of Basic Sum Assured
మొదటి సంతానం       – 25% Of Basic Sum Assured
రెండవ సంతానం         – 25%  Of Basic Sum Assured   మరియు
ఇంటి నిర్మాణం కొరకు – 50%Of Basic Sum Assured  భీమా పెంచుకోవచ్చు.

18 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి ఈ ప్లాన్ వర్తిస్తుంది మరియు లైఫ్ కవర్ లేదా హోల్ లైఫ్ గా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ( Top 7 Best Term Insurance Plans) లిమిటెడ్, రెగ్యులర్ మరియు సింగిల్ ప్రీమియం రూపంలో ప్రీమియం చెల్లించవచ్చు.

దీనితోపాటుగా ప్లాన్ లో లభించే బెటర్ హాఫ్ బెనిఫిట్ ద్వారా మీ జీవిత భాగస్వామికి 25 లక్షల భీమా కల్పించవచ్చు.

 

Claim Settlement Ratio   ( CSR ) – 94.12%

 

పూర్తి వివరాల కొరకు లింక్ మీద నొక్కండి !

SBI Life eShield Next Telugu &  &అవసరాలకి అనుగుణంగా పెరుగుతుంది భీమా కవరేజ్, మరెన్నో ప్రయోజనాలు వివరాలు ఇవే !

 

7.Kotak Life Smart e – Term Plan – కోటక్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ 

ఇండియా యొక్క లోకల్ బ్రాండ్ అయిన కోటక్ ( Kotak Mahindra) మహీంద్రా అనుబంధ సంస్థ  కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ (kotak life insurance) తక్కువ ప్రీమియంకి  అధిక కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది.
వాటిలో ది బెస్ట్   ( kotak Smart e – Term Plan)  స్మార్ట్ ఈటర్మ్ ప్లాన్,కనీసం 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పాలసీ సమయం నిర్ణయించుకునే అవకాశం వుంటుంది.

ప్లాన్ కి సంబంధించి 3 రకాల ఆప్షన్స్ అవి లైఫ్ కవర్,లైఫ్ ప్లస్ మరియు లైఫ్ సెక్యూర్.

1. లైఫ్ ఆప్షన్ – (Life Option) లో ప్రాథమిక మాత్రమే లభిస్తుంది.

2.లైఫ్ ప్లస్ – (Life Plus) ఆప్షన్ లో ప్రాథమిక భీమాతోపాటు ఏక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్  లభిస్తుంది.

3. ఒకవేళ పాలసీదారుడు లైఫ్ సెక్యూర్ ఆప్షన్ – ( Life Secure)  తీసుకొంటే అలాగే రిస్క్ జరిగి  పాలసీదారుడు డిసబిల్ గురైతే భవిష్యత్ ప్రీమియం మాఫీ చెయ్యడం జరుగుతుంది.

కనీసం 18 నుంచి 65 వయసు వారు అర్హులు, దీనితో పాటుగా 3 రకాల క్లైమ్ పే ఔట్ ఆప్షన్స్ ను అందిస్తుంది.

టాక్స్ బెనిఫిట్స్, పాలసీ రేవివల్, గ్రేస్ పీరియడ్, ఫ్రీ లుక్ పీరియడ్ వంటి ఇతర ప్రయజనాలను పైన చర్చించిన అన్ని ప్లాన్స్ లో పొందవచ్చు.

 

Claim Settlement Ratio   ( CSR ) – 98.50%

https://licindia.in/

 

• ముగింపు  ( Conclusion )

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *