LIC Saral Jeevan Bima in Telugu – 25 లక్షలు భీమా రోజుకి 26/- రూ ||లకే పూర్తి వివరాలు తెలుగులో..

                      LIC Saral Jeevan Bima Details  in Telugu

 

. LIC Saral Jeevan Bima ఏవిధంగా పనిచేస్తుంది? ( How does it works ?)

ఈ స్కీం లో పాలసీదారుడు నిర్ణయించుకొన్న పాలసీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లిస్తాడు. ఒకవేళ పాలసీ సమయం మధ్యలో ఏ కారణంగా నైనా ( సహజంగా లేదా ఆక్సిడెంట్ ) మరణానికి గురిఅయినట్లయితే చెల్లించిన ప్రీమియం తక్కువే అయినప్పటికీ దానితో ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం భీమా రాసిని కుటుంబానికి అందజేయడం జరుగుతుంది.

 

• అసలు సరళ జీవన్ భీమాను ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది?. ( What Is Saral Jeevan Bima )

IRDAI – ఇన్సూరెన్స్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్ మెంట్ అథారిటీ అఫ్ ఇండియా (  Insurance Regulatory And Development Authority Of India ).

ఇండియా లో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు యాజమాన్యం వహిస్తుంది. అయితే ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ ( Term Insurance ) మినహాయించి మిగిలిన,

  1. ఎండోమెంట్ ఇన్సూరెన్స్               ( Endowment )
  2.  మనీ బ్యాక్ ఇన్సూరెన్స్                   ( Money Back )
  3. పిల్లలకు చిల్డ్రన్స్ ఇన్సూరెన్స్      ( Children Plans )
  4. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్                 ( Whole Life Insurance )
  5. రిటైర్మెంట్ ఇన్సూరెన్స్                   ( Retirement Plans ) పాలసీలు అందరికి అందుబాటులో ఉంటాయి.

 

కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో చాలా తక్కువ ప్రీమియం కే ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది, వ్యక్తి కుటుంబానికి అధిక ఆర్థిక ప్రయోజనం టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

కానీ టర్మ్ ఇన్సూరెన్స్ సామాన్యులకి అందివ్వడం కుదరదు.

• ఇన్కమ్ టాక్స్ పరిధిలో ఉన్నవారు  ( ITR Returns Must ), పెద్ద వ్యాపారస్తులకి ( Business Mans )మాత్రమే అందిస్తారు.దీనితో పాటుగా హాస్పిటల్ ఆరోగ్య ( Health Check Up Report )వివరాలు జమచేయవలసి ఉంటుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం సామాన్యులకి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అందివ్వాలని IRDAI ని ఆదేశించింది. గవర్నమెంట్ ఆదేశం మేరకు 1 జనవరి 2021 నుంచి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సరళ జీవన్ భీమా ని ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నాయి.

 

ఇప్పుడు LIC కంపెనీ యొక్క సరళ జీవన్ భీమా కి సంబందించిన మొత్తం వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకొందాం.

LIC సరళ జీవన్ భీమా ఒక  నాన్ లింక్డ్  పాలసీ  ( Non Linked  Individual ).అంటే ఈ పాలసీలో  మీరు చెల్లించే ప్రీమియం డబ్బులను  LIC సంస్థ షేర్ మర్కెట్స్ లో  ఇన్వెస్ట్మెంట్ చెయ్యదు, కాబట్టి  మీ ప్రీమియం డబ్బులు ఈ పాలసీలో  భద్రంగా ఉంటాయి.

LIC సరళ జీవన్ భీమా యొక్క టేబుల్ నెంబర్ ( Table No )= 859.
2021 ఏప్రిల్ 16 న LIC ఈ పాలసీని ప్రారంభం చేసింది.

 

• పాలసీ లో ఉన్న అతి  ముఖ్యమైన  ప్రయోజనాలు ఏమిటి?  ( Key Features Of  LIC Saral Jeevan Bima? )

1.పాలసీ తీసుకొన్న వ్యక్తి కుటుంబానికి పూర్తి ఆర్థిక భద్రత లభిస్తుంది..( Financial Security )

2. ఆదాయం, చదువు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ తీసుకోవచ్చు. ( Income & Education Not Mandatory)

3. పాలసీలో ప్రీమియం  వేరు వేరు గా చెల్లించే విధంగా ఫ్లిక్సిబిలిటీ కల్పించబడింది.( Different PP Options )

4.అత్యధికముగా 70 సంవత్సరాల వరకూ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అందజేయబడుతుంది.( Long Term Coverage )

5. అవసరానికి తగిన విధంగా పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయం చేసుకోవచ్చు.( Flexibility )

7. డిపాజిట్ ప్రీమియం పై మరియు క్లెయిమ్ అమౌంట్ పై టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.( Tax Deduction )

9. పాలసి తీసుకొన్న రెండవ రోజే పాలసీదారునికి రిస్క్ జరిగితే మొత్తం భీమా నామినీకి అందివ్వడం జరుగుతుంది.

10. మధ్యలో పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. ( Surrender Facility Available )

 

• LIC సరళ జీవన్ భీమా పాలసీలో ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying? )

   ఈ స్కీం లో ప్రీమియం ని 4 రకాలుగా చెల్లించవచ్చు.

1.సింగిల్ ప్రీమియం ( Single Premium Only One Time ).

ఈ ఆప్షన్ ద్వారా పాలసీకి సంబందించిన మొత్తం ప్రీమియం ఒక్కసారే పాలసీ దారుడు చెల్లించవచ్చు.

2. రెగ్యులర్ ప్రీమియం ( Regular Premium )

అంటే ఎన్ని సంవత్సరాలు పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకొంటే అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం.

3. లిమిటెడ్ ప్రీమియం 5  సంవత్సరాలు ( Limited premium For 5 years )

ఈ ఆప్షన్ ద్వారా పాలసీదారుడు పాలసీ సమయం కంటే తక్కువ సమయం  5 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు.

4. లిమిటెడ్ ప్రీమియం 10సంవత్సరాలు ( Limited premium  For 10 years )

ఈ ఆప్షన్ ద్వారా పాలసీదారుడు పాలసీ సమయం కంటే తక్కువ సమయం  10 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు.

 

కాబట్టి మీ అవకాశానికి అనుగుణంగా ప్రీమియం పేమెంట్ ఈ పాలసీ లో చెయ్యవచ్చు.

 

• ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు  (maximum Age ) = 65 సంవత్సరాలు.

కనుక 18  నుంచి 65 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

• సరళ జీవన్ భీమా ని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? (  Policy Term  ? )

కనీస పాలసీ సమయం వచ్చి  (Minimum Policy Period ) =5 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం  ( Maximum Policy Period ) = 40 సంవత్సరాలు.

కాబట్టి మీరు  ఈ పాలసీ యొక్క సమయాన్ని కనీసం 5 నుంచి 40 సంవత్సరాల మధ్య  నిర్ణయించుకోవచ్చు.

అంటే 5,10,15,20,25,30,….40 ఈ విధంగా నిర్ణయించుకోవచ్చు.

 

• ఈ పాలసీ యొక్క  గరిష్ట మెట్యూరిటీ  సమయం ఎంత? ( Maximum Maturity Age Of Saral Jeevan Bima ? )

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 70 సంవత్సరాలు గా  ఉంటుంది.

అంటే ఈ పాలసీని మనం అత్యధికంగా  70 సంవత్సరాలు వచ్చే వరకూ మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది,  అంటే 40 సంవత్సరాల ఒక వ్యక్తికి  ఈ పాలసీ 30  సంవత్సరాలు  మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే  పాలాసియొక్క గరిష్ట  మెట్యూరిటీ  70  సంవత్సరాలు కాబట్టి.

 

• సరళ జీవన్ భీమా కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured  ? )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి ( Minimum basic sum assured ) =Rs 5, 00, 000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి ( Maximum basic sum assured ) = Rs 25,00,000/-

ఈ పాలసీని 25 లక్షల కు మించి అందివ్వడం జరగదు.

 

LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.

LIC Aam Aadmi Bima Yojana in Telugu -” 100 లకే 75,000/- భీమా ” Eligibility, features & Benifits

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
ఫ్రీ లుక్ పీరియడ్  అంటే ఏమిటి? ( LIC Saral Jeevan Bima Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై  మీరు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  :  15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

•LIC సరళ జీవన్ పాలసీలో తీసుకొనే భీమాపై  ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? ( Rebate On high basic Sum Assured? )

భీమా ( Basic Sum Assured )              రిబేట్(Rebate )

1. 5, 00, 000 నుంచి  9, 50, 000               = Nil
2. 10, 00, 000 నుంచి  14, 50, 000           = 0.10%
3. 15, 00, 000 నుంచి  19, 50, 000           = 0.20%
4. 20, 00, 000 నుంచి  అత్యధికముగా     = 0.25%

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో  మీకు  రిబేట్ లభిస్తుంది.

 

Example :-

 

•LIC సరళ జీవన్ భీమా పనిచేసే విధానం ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!( Example )

పాలసీదారుని పేరు  ( Name )                    – Mr.హరిప్రసాద్
వయసు ( Age )                                              – 20 సంవత్సరాలు
పాలసీ సమయం  ( Policy Period )             – 30 సంవత్సరాలు
సరళ జీవన్ భీమా   ( Bhima )                       – 25 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం ( Mode )        –  సంవత్సరానికి ఒకసారి
సంవత్సర ప్రీమియం ( Premium )           = Rs 9,625/-

ఒకవేళ కావాలనుకుంటే ఈ విధంగా కూడా ప్రీమియం చెల్లించవచ్చు.

 

1.సింగిల్ ప్రీమియం ( Single Premium Only One Time )      = Rs 1,07,075/- ( ఒక్కసారే )

2. లిమిటెడ్ ప్రీమియం 5  సంవత్సరాలు ( Limited Premium for 5 years )  = Rs 25,050/-( సంవత్సరానికి )

3. లిమిటెడ్ ప్రీమియం 10సంవత్సరాలు ( Limited ప్రీమియం For 10 years )  = Rs 15,775/-( సంవత్సరానికి )

హరిప్రసాద్ ఈ పాలసీలో   5 సంవత్సరాలు ప్రీమియం చెల్లించినట్లయితే = Rs 9,625/- రూపాయలు చొప్పున  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  = Rs 48,125/- అవుతుంది..

 

కానీ Mr. హరిప్రసాద్ పాలసీ సమయం మధ్యలో సాధారణం గా లేదా ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే భీమా 25 లక్షలు కట్టిన ప్రీమియం తో సంబంధం లేకుండా నామినికి లేదా కుటుంబ సభ్యులకు అందివ్వడం జరుగుతుంది. అందువల్ల సామాన్య వ్యక్తులకి సరళ జీవన్ భీమా ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్.

 

ముఖ్య గమనిక :- వెయిటింగ్ పీరియడ్ ( Waiting Period )

పాలసీ తీసుకొన్న 45 రోజుల తర్వాత పాలసీదారుడు మరణిస్తే మొత్తం భీమా 25 లక్షలు నామినికి లభిస్తాయి.
ఒకవేళ

మొదటి 45 రోజుల్లోపు పాలసీదారుడు సహజంగా మరణిస్తే చెల్లించిన ప్రీమియం మాత్రమే అందివ్వడం జరుగుతుంది.

కానీ ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే మాత్రం మొత్తం భీమా యధావిధిగా నామినీకి LIC అందిస్తుంది. అంటే ఆక్సిడెంట్ కేసుకి వెయిటింగ్ పీరియడ్ వర్తించదు.

 

•  LIC సరళ జీవన్ భీమా పాలసీలో  లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? (  Tax benefits Of LIC Saral Jeevan Bima ?)

ఈ పాలసీలో పాలసీదారుడు  చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80c  వర్తిస్తుంది, కాబట్టి ప్రతీ సంవత్సరo  1,50,000/- వరకూ  టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.

అదేవిధంగా పాలసీ లో లభించే మరణ ప్రయోజనం పై  ఇన్కమ్ టాక్స్ రూల్  అండర్ సెక్షన్ 10D  వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.

 

• అడిషనల్ బెనిఫిట్ రైడర్స్ ( Additional Benefit Riders Of LIC Saral Jeevan Bima?)

ఈ పాలసీ  ఎటువంటి అదనపు రైడర్ ప్రయోజనాలను కలిగిలేదు. No .

 

• మెట్యూరిటీ ప్రయోజనం ( Maturity Benefit  of LIC saral Jeevan Bima ?)

ఇది స్వచ్ఛమైన టర్మ్ ఇన్సూరెన్స్, ఇతర స్కీమ్స్ ల వలె పాలసీ సమయం ముగిసిన తరువాత ఎటువంటి మాత్యూరిటీ అమౌంట్ లభించదు.

 

• సరళ జీవన్ భీమా పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Payment Mode Of   LIC Saral Jeevan Bima?)

ఒక్క సింగిల్ ప్రీమియం తప్ప మిగిలిన రెగ్యులర్ మ రియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారు
ఈ పాలసీలో  3 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి ఒకసారి    – Yearly
2. 6 నెలలకు ఒకసారి          – Half Yearly
3. ప్రతినెలా                            – Monthly

ముఖ్య గమనిక : ఈ ప్రీమియంని చెల్లించడానికి  పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా  ఆన్ లైన్లో  గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు  ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం LIC సంస్థ కల్పించింది.

 

• పాలసీ మధ్యలో  మనం చెల్లించిన  ప్రీమియంపై  లోన్ లభిస్తుందా?  లేదా? ( Loan Facility of Saral Jeevan Bima )

ఈ పాలసీలో ఎటువంటి లోన్ సదుపాయం లభించదు. No any loan facility.

 

• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ఉంటుందా?( Surrender Value Of LIC Saral Jeevan Bima ?)

పాలసీలో పాలసీదారుడు  ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు  జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.

పాలసీ సరెండర్ కి క్రింద నియమాలు వర్తిస్తాయి.

1.సింగిల్ ప్రీమియం ( Single Premium Only One Time ).

• వర్తిస్తుంది.

 

2. రెగ్యులర్ ప్రీమియం ( Regular Premium )

• వర్తించదు.

 

3. లిమిటెడ్ ప్రీమియం 5  సంవత్సరాలు ( Limited ప్రీమియం For 5 years )

• వర్తిస్తుంది.

 

4. లిమిటెడ్ ప్రీమియం 10సంవత్సరాలు ( Limited ప్రీమియం For 10 years )

• వర్తిస్తుంది.

 

• LIC సరళ జీవన్ భీమా రివైవల్ ఫెసిలిటి ? ( LIC saral Jeevan Bima Revival period ?)

ఈ పాలసీకి  5 సంవత్సరాలు  రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.

పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో కొన్ని సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి   చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

• జీవన్ ఆనంద్ పాలసీలో ప్రీమియంకి  గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period  LIC J saral  Jeevan  Bima? )

గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో  సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది.

ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

 

ముఖ్య గమనిక : ఈ  సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

 

• సరళ జీవన్ భీమా పాలసీని  ఎలా  తీసుకోవాలి? ఏ ఏ  డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది?
(  Documents Required  of LIC Saral Jeevan Bima? )

ఈ పాలసీని మీరు LIC ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు
లేదా
ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

• కావలసిన డాకుమెంట్స్

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం
2          300 & 340
3. ఆధార్ కార్డు               –   (  Age Proof )
4. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
5. పాన్ కార్డు                   –  (   KYC  Verification )
6.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

https://licindia.in/

 

ప్రశ్నలు – జవాబులు ( Question & Answers )

 

1. ఇన్కమ్ టాక్స్ పరిధిలో ఉన్నవారికి LIC సరళ జీవన్ భీమా తీసుకోవడం సరైనదా? ( Saral Jeevan Bima good or Bad for those with IT Returns?)

Ans :- సరియైనది కాదు. No ఎందుకంటే సరళ జీవన్ భీమా లో IT రిటర్న్స్ లేనివారికి బెనిఫిట్ ఉంటుంది టర్మ్ ప్లాన్ సులభంగా లభిస్తుంది . కానీ ఇతర టర్మ్ పాలసీలతో కంపేర్ చేస్తే సరళ జీవన్ భీమాలో ప్రీమియం ఎక్కువ.

 

2. LIC సరళ జీవన్ భీమాను సరెండర్ చేయవచ్చా? ( Can Saral Jeevan  be Surrendered?)

Ans :-  మధ్యలో పాలసీని సరెండర్ చెయ్యవచ్చు కానీ రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి వర్తించదు. Yes.

 

3. సరళ జీవన్ భీమా షేరమార్కెట్ లింక్ పాలసీనా? ( LIC  Share Market Link Policy?)

Ans :-  కాదు. No.

 

4. ఏదైనా కారణంగా పాలసీలో ఎక్కువ కాలం ప్రీమియం చెల్లించకపోతే ఏమవుతుంది.?  ( What happened if the policy does not pay the Premium for a long Time?)

Ans :-  5 సంవత్సరాలలోపు ప్రీమియం పెనాల్టీతో చెల్లించి పాలసీలో కొనసాగవచ్చు.

 

5. ఈ పాలసీని ఆన్లైన్లో ( Online ) తీసుకోవడం మంచిదా లేకపోతే ఏజెంట్ ద్వారా మంచిదా? ( Which is better to take Saral Jeevan Bima Online / Offline?)

Ans :-  90% ఏజెంట్ ద్వారా బెట్టర్ కమ్యూనికేషన్ ఉంటుంది. క్లెయిమ్ నిర్వహించడంలో ప్రాధాన్యత లభిస్తుంది.

 

6. పాలసీ సమయం తర్వాత వ్యక్తి జీవించి ఉన్నట్లయితే మాట్యూరిటీ లభిస్తుందా? ( Will the Maturity be available if the person is alive after the policy period?

Ans :- టర్మ్ ఇన్సూరెన్స్ లో మాట్యూరిటీ లభించదు.  No.

 

 

ముగింపు  ( Conclusion )

LIC సరళ జీవన్ పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *