What is Insurance & Required Documents Telugu? – ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి?

                     What is Insurance  In Telugu

 

• అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ( What Is Insurance?)

మనలో చాలా మందికి అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలియదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో కేవలం 15%నుంచి 20% వ్యక్తులు మాత్రమే ఇన్సూరెన్స్ ని కలిగి ఉన్నారు, వారుకూడా తీసుకోవలసిన దానికంటే తక్కువ ఇన్సూరెన్స్ ని మాత్రమే కలిగి ఉన్నారు.

ఇన్సూరెన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏమిటీ? ఏయే డాకుమెంట్స్ ని పాలసీ తీసుకొనే సమయంలో జమా చేయవలసిన అవసరం ఉంటుంది? ఇప్పుడు తెలుసుకొందాం!

వ్యక్తి కుటుంబం సభ్యులతో జీవించి ఉన్నప్పుడు ఏవిధంగా ఎవ్వరికీ లోటు చెయ్యకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో, అదేవిధంగా వ్యక్తి జీవించి లేనప్పుడు కూడా కుటుంబానికి ఆర్థిక భరోసా అందించేందుకు ఇన్సూరెన్స్ ని తీసుకోవడం జరుగుతుంది.

మనం ఏదైనా కంపెనీలో జీవిత భీమా తీసుకొంటే దాన్ని ఇన్సూరెన్స్ అని పిలుస్తారు. మీ అవసరానికి అనుగుణంగా మీరు భీమా ను నిర్ణయించుకుంటారు. దీన్నే సమ్ అస్సుర్డ్ ( Sum Assured )అంటారు.

అంటే భీమా కాలపరిమితిలో భీమా తీసుకొన్న వ్యక్తి కి రిస్క్ ( Risk ) జరిగితే ఈ సమ్ అస్సుర్డ్ ( Sum Assured )మొత్తాన్ని నామినీ కి అందిస్తారు. ఒకవేళ ఎటువంటి రిస్క్ జరగకపోతే ఇదే సమ్ అస్సుర్డ్ ( Sum Assured ) + ప్రతీ సంవత్సరం లభించే బోనస్( Bonus )ని పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది.

 

What is Insurance & Required Documents Telugu? - ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి?

 

 

                                                             లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉన్నాయి.

 

1. Children Policy :- చిల్డ్రన్స్ పాలసీ

చిన్న పిల్లలకి సంబంధించింది. ఈ పాలసీ పిల్లల యొక్క భవిష్యత్ కై విద్యా, వివాహం కొరకు ఉపయోగపడుతుంది.ప్రతీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఖచ్చితంగా ఒకటి లేదా 2 చిల్డ్రన్స్ ప్లాన్స్ ఉంటాయి.

 

• LIC Children Money Back ( చిల్డ్రన్ మనీ బ్యాక్ )- 932

ఇది ఒక మనీ బ్యాక్ స్కీం.  పాలసి కొనసాగుతున్న సమయంలోనే మధ్యలో మనీ బ్యాక్ రూపంలో అమౌంట్ లభించును  మరియు చివర్లో మేట్యూరిటీ కూడా రావడం జరుగుతుంది.

తండ్రి పేరు                               – Mr. శ్యామ్
తండ్రి వయసు                         – 25 సంవత్సరాలు
కుమారుని పేరు                        – సంతోష్
కుమారుని వయసు                   – ఒక సంవత్సరం
భీమా                                            = 5 లక్షలు
నెలసరి ప్రీమియం                    = Rs 1,891/-
ప్లాన్ లో చెల్లించిన మొత్తం      = Rs 5,33,073/-
ప్రీమియం వైవర్ రైడర్             = తీసుకోవడం జరిగింది.

సంవత్సరాలనికి లభించే టాక్స్ డెడక్షన్ = Rs 6,804/-

•మనీ బ్యాక్ ( Money Back ) – 20% Of BSA

18 వ సంవత్సరం    = Rs 1,00,000/-
20 వ సంవత్సరం    = Rs 1,00,000/-
22 వ సంవత్సరం    = Rs 1,00,000/- గా మూడు సార్లు మధ్యలో మనీ బ్యాక్ అందిస్తుంది.

• మెట్యూరిటీ ( Maturity Benefit )

40% బేసిక్  భీమా                       = Rs 2,00,000/-
బోనస్ ( Bonus )                         = Rs 5,40,000/-
ఫైనల్ బోనస్ ( Final Bonus )  = Rs 1,75,000/- ప్లాన్ యొక్క 25 వ సంవత్సరం ఒక్కసారే మెట్యూరిటీ లభిస్తుంది.

రిటర్న్   –  మనీ బ్యాక్ = Rs 3,00,000/-
– మెట్యూరిటీ  = Rs 9,15,000/-

ప్లాన్ లో లభించే మొత్తం = Rs 12,15,000/-

ముఖ్య గమనిక :- పిల్లలు కి పాలసీలు తీసుకొంటే ఖచ్చితంగా ప్రీమియం వైవర్ రైడర్ ని తీసుకోవడం మంచిది. ప్రీమియం చెల్లించే వ్యక్తి కి రిస్క్ జరిగితే భవిష్యత్తు ప్రీమియం LIC చెల్లెస్తుంది ప్రయోజనాలు యధావిధిగా పిల్లలకి వర్తిస్తాయి.

 

2. LIC Endowment Insurance

ఎండోమెంట్ పాలసీల్లో బోనస్ మంచిగా లభిస్తుంది. పాలసీ తీసుకొన్న వ్యక్తి కి ట్యూరిటీ సమయంలో ఒక్కసారే అమౌంట్ లభిస్తుంది. ఒకవేళ పాలసీ సమయం మధ్యలో పాలసీదారుడు మరణించినట్లయితే నామినీ కి సమ్ అస్సుర్డ్ ( Sum Assured )మరియు బోనస్( Bonus )ని కలిపి అందివ్వడం జరుగుతుంది.

 

• LIC New Endowment (  న్యూ ఎండోమెంట్ )- 914

పాలసీదారుని పేరు                     – Mr. హరిప్రసాద్
వయసు                                          – 25 సంవత్సరాలు
పాలసీ సమయం                          – 25 సంవత్సరాలు
భీమా                                               = 5 లక్షలు
నెలసరి ప్రీమియం                       = Rs 1,632/-
ప్లాన్ లో చెల్లించిన మొత్తం         = Rs 479647/

సంవత్సరాలనికి లభించే టాక్స్ డెడక్షన్ = Rs 5,877/-
ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం      = Rs 4,79,647/-

• మెట్యూరిటీ ప్రయోజనం ( Maturity Benefit )

ప్రాథమిక బేసిక్  భీమా                   = Rs 5,00,000/-
బోనస్ ( Bonus )                              = Rs 5,62,500/-
ఫైనల్ బోనస్ ( Final Bonus )       = Rs 2,25,000/-
ప్లాన్ యొక్క మొత్తం మెట్యూరిటీ  = Rs 12,87,500/-

ప్లాన్ యొక్క 25 వ సంవత్సరం ఒక్కసారే మెట్యూరిటీ లభిస్తుంది.

3. Money Back  Insurance :- పొదుపు + ఇన్సూరెన్స్ + మధ్యలో మనీ బ్యాక్.

ఈ పాలసీ కూడా ఎండోమెంట్ పాలసీ వలె పనిచేస్తుంది. కానీ మాట్యూరిటీ సమయం కంటే ముందే మీరు నిర్ణయించుకొన్న విధంగా మధ్యలో కొంత కాలం రెగ్యులర్ అమౌంట్ లభిస్తుంది. మనీ బ్యాక్ ఎంత అన్నది కూడా మీరే స్వయంగా నిర్ణయించుకొంటారు.పాలసీ మధ్యలో మనీ బ్యాక్ రూపంలో అమౌంట్ లభించడం వల్ల ఈ స్కీమ్స్ లో మాట్యూరిటీ కొద్దిగా తగ్గి లభిస్తుంది.

 

• LIC 20 Years Money Back  ( మనీ బ్యాక్ )- 920

పాలసీదారుని పేరు       – Mr.రాజు
వయసు                           – 30 సంవత్సరాలు
పాలసీ సమయం           – 20 సంవత్సరాలు
భీమా                                = 5 లక్షలు
ప్రీమియం సమయం    = 15 సంవత్సరాలు
నెలసరి ప్రీమియం       = Rs 3,293/-

ప్లాన్ లో చెల్లించిన మొత్తం = Rs 581517/-
సంవత్సరాలనికి లభించే టాక్స్ డెడక్షన్ = Rs 11,868/-

•మనీ బ్యాక్ ( Money Back ) – 20% Of BSA

5 వ సంవత్సరం      = Rs 1,00,000/-
10 వ సంవత్సరం    = Rs 1,00,000/-
15 వ సంవత్సరం    = Rs 1,00,000/- గా మూడు సార్లు మధ్యలో మనీ బ్యాక్ అందిస్తుంది.

• మెట్యూరిటీ ( Maturity Benefit )

40% బేసిక్  భీమా                       = Rs 2,00,000/-
బోనస్ ( Bonus )                         = Rs 3,60,000/-
ఫైనల్ బోనస్ ( Final Bonus )  = Rs 20,000/- ఒక్కసారే మెట్యూరిటీ సమయంలో లభిస్తాయి.

రిటర్న్   –  మనీ బ్యాక్ = Rs 3,00,000/-
– మెట్యూరిటీ  = Rs 5,80,,000/-

ప్లాన్ లో లభించే మొత్తం = Rs 8,80,000/-

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.

 

4. Health  Insurance Policies :- ఆరోగ్య భీమా.

ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భీమా అత్యంత అవసరం. ఈ భీమా యొక్క సమయం అత్యధికముగా 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ప్రీమియం కూడా 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒక్కసారే చెల్లించవలసి ఉంటుంది. ఈ సమయంలో పాలసీదారుడు అనారోగ్యం బారిన పడితే మొత్తం హాస్పిటల్ ఖర్చు తీసుకొన్న భీమా ఆధారంగా కంపెనీయే చెల్లెస్తుంది.
ఈ పాలసీల్లో ప్రీమియం ని చెల్లెస్తూ పాలసీ సమయాన్ని పొడిగించుకోవచ్చు. అంతేకాకుండా పాలసీ సమయం భీమా తీసుకొన్న వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది.

 

5. Pension or Retirement Policies :- పెన్షన్ లేదా రిటైర్మెంట్ పాలసీ.

ఈ పాలసీల్లో 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం లేదా మీరు నిర్ణయించుకొన్న విధంగా మీకు రెగ్యులర్ అమౌంట్ లభిస్తుంది. మధ్య వయసు వారు మరియు సీనియర్ సిటిజన్స్ కి ఇతరులపై ఆధారపడకుండా ఇవి మంచి పాలసీలు.

 

• Saral Pension Yojana ( సరళ పెన్షన్ యోజన )- 862

పాలసీదారుని పేరు    – Mr. నారాయణ
వయసు                        – 40 సంవత్సరాలు
పాలసీ సమయం        – జీవితాంతం
భీమా                             – 5 లక్షలు
ప్రీమియం ఒక్కసారే   = Rs 5,09,000/-

ఈ డిపాజిట్ అమౌంట్  పెన్షన్ దారుడు మరణించిన తర్వాత నామినికి లభించేలా వివిధ ఆప్షన్స్ నిర్ణయం చెయ్యవచ్చు.

1. సంవత్సరానికి ఒకసారి     = Rs 25,000/-
2. ప్రతీ 6 నెలలకు                 = Rs 12,228/-
3. 3 నెలకి ఒకసారి                  = Rs 6,100/-
4. ప్రతి నెలా                            = Rs 2,018/-

మీ కన్వీనెంట్ కి అనుగుణంగా పెన్షన్ జీవితాంతం పొందవచ్చు.

 

6. Whole Life Insurance :- హోల్ లైఫ్ పాలసీ.

జీవితం మొత్తానికి ఈ ఒక్క పాలసీ ద్వారానే ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ తోపాటు రెగ్యులర్ ఇన్కమ్ లభించేవి, కేవలం మాట్యూరిటీ సమయంలో అమౌంట్ లభించేవి.

 

• Jeevan Umang ( జీవన్ ఉమంగ్ )- 945

పాలసీదారుని పేరు     – Mr. రఘువరన్
ప్రీమియం సమయం   – 20 సంవత్సరాలు
పాలసీ పీరియడ్           – 79 సంవత్సరాలు
ఇన్సూరెన్స్ కవరేజ్     – 100 సంవత్సరాలు
భీమా                              – 5 లక్షలు
నెలసరి ప్రీమియం      = Rs 2,271/-

ప్లాన్ లో చెల్లించిన మొత్తం                          = Rs 5,34,428/-
సంవత్సరాలనికి లభించే టాక్స్ డెడక్షన్ = Rs 8,184/-

Mr. రఘువరన్ కి 8% అఫ్ ప్రాథమిక భీమా రూపంలో సంవత్సరానికి  = Rs 40,000/- చొప్పున 99 సంవత్సరాల వరకూ లభిస్తుంది…100 వ సంవత్సరం మెట్యూరిటీ అందివ్వడం జరుగుతుంది.

100 వ సంవత్సరం మెట్యూరిటీ ప్రయోజనం,

• మెట్యూరిటీ ( Maturity Benefit )

బేసిక్  భీమా               = Rs 5,00,000/-
బోనస్ ( Bonus )        = Rs 48,72,500/-
మొత్తం మెట్యూరిటీ  = Rs  53,72,500/- ఒక్కసారే మెట్యూరిటీ సమయంలో లభిస్తాయి.

 

7. Term Insurance :- టర్మ్ ఇన్సూరెన్స్.
దీన్నే ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. అతి తక్కువ ప్రీమియం కే ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ టర్మ్ ప్లాన్స్ లో లభిస్తుంది.

 

•  LIC Saral Jeevan Bhima ( సరళ జీవన్ భీమా )- 859

పాలసీదారుని పేరు       – Mr. రాకేష్
వయసు                            – 25 సంవత్సరాలు
పాలసీ సమయం            – 30 సంవత్సరాలు
ప్రీమియం మోడ్             – రెగ్యులర్
భీమా                                 = 25 లక్షలు
నెలసరి ప్రీమియం        = Rs 1056/-

సంవత్సరాలనికి లభించే టాక్స్ డెడక్షన్ = Rs 3,690/-
ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం     = Rs 3,69,060/-

మరణ ప్రయోజనం (Death Benefit ) :-

పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు Mr. రాకేష్ కి రిస్క్ జరిగినా మొత్తం భీమా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.

మెట్యూరిటీ ప్రయోజనం ( Maturity Benefit ) :-

టర్మ్ ఇన్సూరెన్స్ లో చెల్లించే ప్రీమియం భీమా కంటే చాలా తక్కువ ఉంటుంది అందువల్ల టర్మ్ ప్లాన్స్ లో పాలసీ సమయం తర్వాత ఎటువంటి మెట్యూరిటీ ప్రయోజనం లభించదు.

ఈ స్కీం లో పాలసీదారుడు నిర్ణయించుకొన్న పాలసీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లిస్తాడు. ఒకవేళ పాలసీ సమయం మధ్యలో ఏ కారణంగా నైనా ( సహజంగా లేదా ఆక్సిడెంట్ ) మరణానికి గురిఅయినట్లయితే చెల్లించిన ప్రీమియం తక్కువే అయినప్పటికీ దానితో ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం భీమా రాసిని కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. కుటుంబ ఆర్థిక సంరక్షణకి టర్మ్ ప్లాన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

 

http://www.licindia.in

• ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన డాకుమెంట్స్ గురించి తెలుసుకొందాం! ( Insurance Required Documents?)

1. Proposal Form

పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క పూర్తి వివరాలు కంపెనీకి అందించేందుకు ముందుగా పోరపోసల్ ఫారం నింపాలి.

2. Identity Proof

1 Adar card
2 Voter ID
3 Pass Port ( ఏదో ఒక్కటి మాత్రమే )

3. Age Proof

1 Date of Birth Certificate
2 10th or Inter Marks list

4. Address Proof

a. Current Bill
b. Telephone Bill
c. Adar card
d. Pass Port
e. House Documents ( If )

( ఏదో ఒక్కటి మాత్రమే )

5. Recent Pass Port Size Photos

ఈ మధ్యనే తీసుకొన్న రెండు పాసుపోర్టు ఫోటోలు.

 

6. Medical Report Certificate : ఆరోగ్య సర్టిఫికెట్

ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ కి తప్ప మిగిలిన పాలసీలను
తీసుకోవడానికి సాధారణ ఆరోగ్య కండిషన్ సర్టిఫికెట్ సరిపోతుంది.

కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనేవారికి మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే పాలసీలో ప్రీమియం నిర్ణంచడం జరుగుతుంది. దీనికి యూరిన్ టెస్ట్ ( Urinary Test )తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాలసీదారుడు కి సిగరెట్, మందు వ్యాసనాలు ఉన్నట్లయితే పాలసీలో చెల్లించవలసిన ప్రీమియం కొద్దిగా ఎక్కువ ఉంటుంది లేకపోతే సాధారణ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

 

7. Income Proof : ఆదాయం రసీదు

ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనే వారికి మాత్రమే. అయితే కొన్ని పాలసీల్లో తీసుకొనే భీమా ఆధారంగా ఆదాయం చూపించవలసి ఉండవచ్చు.

గవర్నమెంట్ ఉద్యోగులు అయితే

• Form 16
• Latest 3 Months Salary Pay Slip సబ్మిట్ చెయ్యాలి.

ఒకవేళ వ్యాపారస్తులు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలానుకొంటే ఇన్కమ్ టాక్స్ ఫైల్ రిటర్న్స్ ( ITR) ఖచ్చితంగా జమా చెయ్యాలి.

 

ముగింపు ( Conclusion )

ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *