Post Office KVP Scheme In Telugu – “కట్టిన దానికి రెట్టింపు పొందండి ” అర్హులు వీరే పూర్తి వివరాలు

              Post office KVP certificate full details in Telugu

post office interest rate april 2023

కిసాన్ వికాస్ పత్రం అనేది ఒక చిన్న పొదుపు పథకం.  ఇది దీర్ఘకాలిక పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలను సులభంగా అలవాటు  చేస్తుంది. ఈ పథకాన్ని 1988 లో ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టిన కొద్దికాలానికే ఈ పథకం ప్రజాదరణ పొందినది. 2014 లో, కిసాన్ వికాస్ పత్రం లో రూ .50,000 కంటే ఎక్కువ పెట్టుబడులకు పాన్ కార్డ్ ప్రూఫ్ తప్పనిసరి  చేసింది.

KVP సర్టిఫికేట్లు దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్‌లలో జారీ చేయబడతాయి. భారతీయ నివాసులు KVP పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.  వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా మరియు మైనర్ పేరు మీద KVP సర్టిఫికేట్ తీసుకోవచ్చు. KVP లో పెట్టుబడి పెట్టిన ప్రధాన మొత్తం 9 సంవత్సరాల 4 నెలల్లో (అంటే 112 నెలలకు)  రెట్టింపు అవుతుంది. ఈ పథకానికి ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరియు  సెమీ అర్బన్ ప్రాంతాల వారు.

 

Post Office KVP Scheme In Telugu - "కట్టిన దానికి రెట్టింపు పొందండి " అర్హులు వీరే పూర్తి వివరాలు

 

. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రం అంటే ఏమిటి?(  What is Kisan Vikas Patra )

Post Office KVP Scheme భారతదేశ పోస్టల్ విభాగం వారు   కిసాన్ వికాస్ పత్రాలను 1988 లో ఒక చిన్న పొదుపుపథకం సర్టిఫికేట్ గా ప్రవేశపెట్టింది. దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే, ప్రజలలో దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం.

 

. కిసాన్ వికాస్ పత్ర పనిచేసే విధానం? ( How does it’s Work?)

ఈ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని ప్రతీ సంవత్సరం వడ్డీ కలపడం జరుగుతుంది. స్కీం సమయం ముగిసే సమయానికి ప్రారంభంలో డిపాజిట్ చేసిన అమౌంట్ కి రెట్టింపు లభిస్తుంది.

ప్రారంభంలో, రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు ఈ పథకం ద్వారా  దీర్ఘకాలికంగా ఆదా చేసుకోవటానికి వీలు కల్పించారు. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది.

లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం,  మీరు ప్రస్తుతం ఈ కిసాన్ వికాస  పత్రాన్ని కొనుగోలు చేస్తే ఈ పథకం యొక్క పదవీకాలం ఇప్పుడు 124 నెలలు (10 సంవత్సరాల 3 నెలలు) గా నిర్ణయించారు. కనీస పెట్టుబడి రూ. 1000 మరియు గరిష్ట పరిమితి లేదు. ఒకవేళ  మీరు  లంప్సమ్ గా పెట్టుబడి పెడితే, మీరు 124 వ నెల చివరిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు.

 

కిసాన్ వికాస్ పత్రం యొక్క రకాలు ( Types of KVP Certificates )

• సింగిల్ హోల్డర్ టైప్ సర్టిఫికేట్ ( Single Holder Type Certificate )

ఈ రకమైన కెవిపి సర్టిఫికేట్  ఒక వయోజనునికి వ్యక్తిగతంగా లేదా స్వయంగా  మరియు  మైనర్ తరపున కూడా జారీ చేయబడుతుంది.

. జాయింట్ ఎ టైప్ సర్టిఫికేట్  ( Joint a type Of Certificate )

ఈ రకమైన కెవిపి సర్టిఫికేట్ ఇద్దర పెద్దలకు జాయింట్ గా జారీ చేయబడుతుంది మరియు ఇది యజమానులకు లేదా  సర్వైవర్ కు చెల్లించబడుతుంది.

. జాయింట్ బి టైప్ సర్టిఫికేట్ ( Joint B Type Certificate )

ఈ రకమైన కెవిపి సర్టిఫికేట్ ఇద్దరు పెద్దలకు జాయింట్ గా జారీ చేయబడుతుంది మరియు ఇది యజమానులకు లేదా సర్వైవర్ కు చెల్లించబడుతుంది.

 

. కెవిపి పథకానికి ఎవరు అర్హులు( Eligibility Of KVP?)

*దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వయోజనుడు మరియు  భారతీయుడు అయి ఉండాలి.
*దరఖాస్తుదారుడు కిసాన్ వికాస్ పత్రం కోసం వారి పేరు మీద లేదా మైనర్ తరపున అప్లై చేసుకోవచ్చు.
*కిసాన్ వికాస్ పత్రంలో పెట్టుబడులు పెట్టడానికి ట్రస్టులు కూడా అర్హులు.
*కెవిపిలో పెట్టుబడులు పెట్టడానికి (HUF) హిందూ అవిభక్త కుటుంబం, NRI Non-resident Indians అర్హులు కారు.

 

• కిసాన్ వికాస్ పత్రం యొక్క ప్రయోజనాలు ( Benefits Of KVP Scheme )

రాబడికి హామీ ( Guarantee):-

మార్కెట్ యొక్క  హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, మీరు పెట్టిన పెట్టుబడి హామీ మొత్తాన్ని పొందుతారు. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల కోసం ఉద్దేశించినది. కానీ తర్వాత దీర్ఘకాలిక పొదుపు పథకం గా పేరు పొందినందుకు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

మూలధనానికి రక్షణ ( Security ):-

ఇది సురక్షితమైన పెట్టుబడి విధానం మరియు మార్కెట్ నష్టాలకు లోబడి ఉండదు. ముఖ్యంగా మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత మీరు పెట్టుబడి మరియు లాభాలను అందుకుంటారు.

వడ్డీ రేటు ( Interest Rate ):-

కిసాన్ వికాస్ పత్రాలకు అనుకూలమైన వడ్డీ రేటు లభిస్తుంది.ఈ వడ్డీ రేటు కెవిపి సర్టిఫికేట్ కొనుగోలు సమయంలో  పెట్టుబడి పెట్టిన సంవత్సరాలను బట్టి మారుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు 1 జనవరి 2021 నుండి 31 మార్చి 2021 వరకు త్రైమాసికంలో 7.5% గా ఉంది. వడ్డీని పెంచడం ద్వారా, మీరు మీ డిపాజిట్‌పై ఎక్కువ రాబడిని అందుకునే అవకాశం కలదు.

మెచ్యూరిటీ కాలం (Maturity Period ):-

కిసాన్ వికాస్ పత్రాలకు మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. దాదాపు పది సంవత్సరాల మూడు నెలలకు  మీరు  కోరుకున్న విధంగా పెట్టుబడి మొత్తాన్ని పొందవచ్చు. KVP యొక్క మెచ్యూరిటీ ఆదాయం మీరు మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వరకు వడ్డీ లభిస్తుంది.

 

. కిసాన్ వికాస పత్రం యొక్క ప్రయోజనాన్ని ఒక ఉదాహరణతో పరిశీలన చేద్దాం.( Example of KVP benefits)

రాంప్రసాద్ అనే వ్యక్తి 2021 సంవత్సరం జూన్ నెలలో 5  లక్షల రూపాయలకు కెవిపి సర్టిఫికెట్ ను పోస్ట్ ఆఫీస్ నుండి పొందాడు. కెవిపి మెచ్యూరిటీ కాలం 115 నెలలు అనగా 9 సంవత్సరాల 7 నెలలు తర్వాత అతనికి వడ్డీతో  సహా కలిపి అతని కి 10 లక్షల రూపాయలు అందుతుంది.

 

. టాక్స్ బెనిఫిట్స్ ( Tax Benefits Of KVP )

ఇది ఇన్కమ్ టాక్స్ యొక్క సెక్షన్  80 సి తగ్గింపుల పరిధిలోకి రాదు.ఇంకా  రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఏదేమైనా,  మెచ్యూరిటీ వ్యవధి తరువాతే విత్ డ్రా చేసుకునే మొత్తం టాక్స్  నుండి మినహాయింపు ఉంటుంది.

 

. మెచ్యూరిటీ కాలం కన్నా ముందే విత్ డ్రా కోసం  నియమాలు ( Premature withdrawal rules)

కిసాన్ వికాస్ పత్రం యొక్క మెచ్యూరిటీ కాలం  115 నెలల తర్వాత మెచ్యూరిటీ చెందుతుంది. కానీ కేవీపీ సర్టిఫికెట్ కు కనీస లాక్-ఇన్ వ్యవధి 30 నెలలు. ఒకవేళ అకౌంట్ హోల్డర్  మరణం లేదా కోర్టు ఉత్తర్వులలో తప్ప, పథకాన్ని ప్రారంభంలో ఎన్‌కాష్ చేయడానికి అనుమతి లేదు.

 

. సౌకర్యవంతమైన డినామినేషన్స్( Deposit Denominations)

కెవిపి సర్టిఫికేట్  రూ. 1000, రూ. 5000, రూ. 10,000 మరియు రూ. 50,000 లలో లభిస్తాయి. వీటికి గరిష్ట పరిమితి లేదు. కానీ రూ. 50,000 విలువగల కేవీపీ సర్టిఫికెట్ పట్టణాల  యొక్క ప్రధాన పోస్టాఫీసు వద్ద మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 

.కెవిపి సర్టిఫికెట్‌ ఆధారంగా రుణాలు(లోన్ లు) ( KVP Loan Facility )

సురక్షితమైన విధానంలో  రుణాలు పొందటానికి మీరు మీ కెవిపి సర్టిఫికెట్‌ను బ్యాంక్ లో సెక్యూరిటీగా ఉపయోగించి లోన్ పొందవచ్చు . ముఖ్యంగా ఇటువంటి రుణాలకు వడ్డీ రేటు కూడా తక్కువే.

 

. నామినేషన్ సౌకర్యం ( Nominee Facility )

స్థానిక పోస్టాఫీసు నుండి నామినేషన్ ఫార్మ్ ను  సేకరించి, నామినీకి అవసరమైన వివరాలను పూర్తి చేయాలి. ఒకవేళ మీరు మైనర్‌ను నామినేట్ చేస్తుంటే, మైనర్ యొక్క పుట్టిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి.

 

. కెవిపి సర్టిఫికెట్ జారీ( KVP Certificate Disbursal )

నగదు (cash) ద్వారా చెల్లింపు జరిగితే, వారు అక్కడికక్కడే కెవిపి సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా మనీ ఆర్డర్ రూపంలో పేమెంట్ చెల్లిస్తే,  పోస్టాఫీసు లో అది క్లియర్ అయ్యే  వరకు మీరు వేచి ఉండాలి.

 

https://www.indiapost.gov.in/Financial/Pages/Content/Post-Office-Saving-Schemes.aspx

 

. కెవిపి ఐడెంటిటీ స్లిప్( KVP Identity Slip ):-

ఇందులో కిసాన్ వికాస్ పత్రం సర్టిఫికేట్, కెవిపి సీరియల్ నంబర్, హామీమొత్తం, మెచ్యూరిటీ తేదీ మరియు మెచ్యూరిటీ తేదీన అందుకోవలసిన మొత్తం సొమ్ము వంటి వివరాలు ఉంటాయి.

 

KVP పథకానికి అవసరమైన పత్రాలు( Required documents)

KYC ప్రక్రియ కోసం గుర్తింపు రుజువులు అవసరం.

1. ఆధార్ కార్డు ( Aadar Card )
2. ఓటరు ID     ( Voter ID )
3. పాన్ కార్డు    ( Pan Card )
4. పాస్‌పోర్ట్       ( passport )
5. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License )

కెవిపి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా సరైన వివరాలతో నింపాలి.
జనన ధృవీకరణ పత్రం
చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం.

 

KVP గురించి తరచుగా అడిగే ప్రశ్నలు    ( Q & A)

Q.  పోస్ట్ ఆఫీస్ లో  డూప్లికేట్ కిసాన్ వికాస్ పత్రంను నేను పొందవచ్చా?
జ. పోగొట్టుకున్న, చిరిగిపోయిన లేదా దొంగిలించబడిన KVP సర్టిఫికేట్ విషయంలో, మీరు డూప్లికేట్ KVP సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, ఒరిజినల్ సర్టిఫికేట్ జారీ చేసిన సమయంలో  అతనికి/ఆమెకు ఇవ్వబడిన  గుర్తింపు స్లిప్‌ను అందించాల్సి ఉంటుంది.
 Q.  కిసాన్ వికాస్ పత్రం యొక్క మొత్తం ను,  నేను కొనుగోలు చేసిన  పోస్ట్ ఆఫీస్ వద్ద మాత్రమే ఎన్‌క్యాష్ చేయవచ్చా?
 జ. KVP సర్టిఫికెట్‌లను జారీ చేసిన పోస్ట్ ఆఫీస్‌లో సులభంగా క్యాష్ చేసుకోవచ్చు.  అత్యవసర పరిస్థితిలో, కొనుగోలుదారు దానిని ఇతర పోస్టాఫీసుల ద్వారా కూడా క్యాష్ చేసుకోవచ్చు.  అయితే, కొనుగోలుదారు ఎన్‌క్యాష్‌మెంట్ సమయంలో KVP సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు స్లిప్‌ను ఇవ్వాలి.
Q.  కిసాన్ వికాస్ పత్రాలను ప్రవాస భారతీయులు కొనుగోలు చేయవచ్చా?
జ. NRI లు KVP సర్టిఫికెట్‌లను కొనుగోలు చేయడానికి అర్హులు కాదు.

Q.  KVP ఖాతాను ఎలా బదిలీ చేయాలి?

జ. KVP ని ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్టాఫీసు కు లేదా ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చు.  ఒక పోస్టాఫీసు నుండి మరొక పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ అయితే, దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ని పోస్ట్ డైరెక్టర్ జనరల్‌కు అందజేయాలి.
 Q.  కిసాన్ వికాస్ పత్రం వడ్డీకి పన్ను విధించబడుతుందా?
జ. KVP పై లభించే  వడ్డీ కి ప్రతి ఆర్థిక సంవత్సరంలో  పన్ను విధించబడును మరియు ‘ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం’ ప్రకారం పన్ను వర్తించబడుతుంది.
 Q.  కిసాన్ వికాస్ పత్రం కోసం ఎవరు అప్లై చేయాలి?
జ. 100% భద్రత, దీర్ఘకాలిక పొదుపు, స్థిర వడ్డీ రేటు మరియు లోన్ కోసం మరియు  అదనపు పొదుపు పథకం కోసం చూస్తున్న వ్యక్తులు కిసాన్ వికాస్ పత్రానికి అప్లై  చేసుకోవచ్చు.

Q.  కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనం ఏమిటి?

జ. ఈ పథకం కింద ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. అయితే, తుది మెచ్యూరిటీ పన్ను మినహాయింపుల నుండి మినహాయించబడింది.

Q.  కిసాన్ వికాస్ పత్రంలో గరిష్ట పెట్టుబడి పరిమితి ఎంత?

జ.  KVP పథకంలో పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేదు.

ముగింపు  ( Conclusion ):-

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *