Post Office Monthly Income Scheme In Telugu – ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం కొరకు ఒక్కసారే ఎంత డిపాజిట్ చెయ్యాలి?

       Post Office Monthly Income Scheme In Telugu

post office interest rate april 2023

దేశంలో ఉన్న  జాతీయ బ్యాంకుల వలె, పోస్ట్ ఆఫీస్ కూడా డబ్బు జమ చేయడానికి మరియు ఇతర లావాదేవీలకు విశ్వసనీయ ప్రదేశం గా పేరు తెచ్చుకుంది.  దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ అనేక శాఖల ద్వారా అనేక పొదుపు పథకాలు అందరికీ అందించబడతాయి.

ఆర్థిక భద్రత మరియు స్థిరమైన ఆదాయ వనరులు మనలో చాలా మందికి అవసరాలు. ఇటువంటి పెట్టుబడిదారులకు ఉత్తమమైన మార్గం పోస్ట్ ఆఫీస్ వారి నెలవారీ ఆదాయ పథకం లేదా MIS అని అంటారు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా  ఇలాంటి స్కీమే.  ఇక్కడ మీరు కొంత డిపాజిట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, ప్రతి నెలా నిర్ణీత వడ్డీని పొందుతారు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్  పేరు సూచించినట్లుగా, ప్రతి నెలా వడ్డీని అందిస్తుంది.  మీరు  ఏ పోస్ట్ ఆఫీస్ నుండి అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ ఆర్టికల్లో, మేము POMIS యొక్క పూర్తి  అంశాలను తెలియచేస్తాము

 

Post Office Monthly Income Scheme In Telugu - ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం కొరకు ఒక్కసారే ఎంత డిపాజిట్ చెయ్యాలి?

 

పోస్ట్ ఆఫీస్ MIS పథకం అంటే ఏమిటి? ( What Is MIS Scheme?)

Post Office Monthly Income Scheme  అంటే మంత్లీ ఇన్కమ్ స్కీం ( Monthly Income Scheme). పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పథకాలలో ఇది కూడా ఒకటి. ఈ స్కీం ద్వారా మీకు ప్రతీ నెల  రెగ్యులర్ ఆదాయం లభిస్తుంది అదికూడా పాలసీ సమయం మొత్తం.
ఎవరి దగ్గర ఐతే కొద్దిగ ఎక్కువ అమౌంట్ అధిక మొత్తం లో ఉందో, అలాగే సురక్షిత డిపాజిట్ చేసి ప్రతీ నెల రెగ్యులర్ ఆదయాన్ని పొందాలనుకొంటున్నారో వారికి ఇది మంచి పథకం.

 

MIS స్కీం ఎలా పనిచేస్తుంది, మరియు ప్రయోజనాలు ఏమిటి? ( How does work & Features Of MIS?)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది.
డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని, దానిపై లభించే వడ్డీరేట్ ని  ప్రతీ నెల మీకు  రెగ్యులర్ గా అందిస్తారు. పాలసీ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రారంభంలో జమా చేసిన మొత్తం డిపాజిట్ డబ్బులను మీకు యధావిధిగా వెనక్కి ఇవ్వడం ద్వారా ఈ స్కీం పూర్తి అవుతుంది.

 

  MIS  Scheme Eligibility & Benefits

 

ప్రయోజనాలు ( Benefits Of MIS Scheme?)

1. ఈ స్కీం ని  పోస్ట్ ఆఫీస్ ద్వారా స్వయంగా గవర్నమెంట్ నిర్వహిస్తుంది.

2. డిపాజిట్ డబ్బులకు 100% గవర్నమెంట్ సెక్యూరిటీ అందిస్తుంది.

3. క్రమం తప్పకుండా ప్రతీ నెల రెగ్యులర్ అమౌంట్ మీ ఖాతాలో జమా అవుతుంది.

4. స్కీం సమయం ముగియగానే డిపాజిట్ అమౌంట్ ని యాదవిధిగా రిటర్న్ చేస్తారు.

 

MIS అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి అర్హులు ఎవరు? ( Who Can Open the MIS Account?)

1. కేవలం భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. NRI లకు ఈ స్కీం ఇవ్వబడదు.

2. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ MIS అకౌంట్స్ ని ఓపెన్ చేసే అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

3.18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్  చెయ్యవచ్చు.

4. సింగిల్ అకౌంట్ ( Single ) మరియు  ఇద్దరు లేదా ముగ్గురు  వ్యక్తులు కలసి జాయింట్ ( joint )అకౌంట్ కూడా ఓపెన్ చెయ్యవచ్చు

5. 10 సంవత్సరాలు వయసు పైబడిన పిల్లలు స్వయంగా ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

6.చిన్నపిల్లల పేరు పై  అకౌంట్లో  అమౌంట్ డిపాజిట్ చేసి  తల్లితండ్రులు నిర్వహించవచ్చు.

 

MIS స్కీం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ లిమిట్స్ ఎంత? ( Deposit Limits Of MIS?)

ఈ స్కీం యొక్క కనీస డిపాజిట్  (Minimum Deposit  Amount ) = Rs. 1000/-

ఈ స్కీం లో అత్యధిక డిపాజిట్ వేరువేరుగా ఉంటుంది.

 

1. సింగల్ అకౌంట్  ( Single Account ) = Rs. 4,50,000/-

2.జాయింట్ అకౌంట్  ( Joint Account ) = Rs.9,00,000/-  ( 4,50,000 + 4,50,000 ) గా ఉంటుంది.
ఇంత కంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం ఉండదు.

 

MIS పథకం యొక్క సమయం ? ( MIS  Scheme Period )

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం యొక్క సమయం = 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంతకంటే తక్కువ గాని ఎక్కువ గాని నిర్ణయించుకొనే సదుపాయం ఉండదు.

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

Senior Citizens Saving Scheme In Telugu – “అత్యధిక వడ్డీని అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ పథకం” వీరికి మాత్రమే

ప్రస్తుతం MIS పథకంలో  వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( Rate Of Interest % )

పోస్ట్ ఆఫీస్ MIS  పథకంలో మీకు ప్రతీ 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రకటిస్తుంది. నిర్ణయించిన వడ్డీరేట్ కి అనుగుణంగా ప్రతినెలా అమౌంట్ మీకు అందించబడుతుంది.

 ( మార్చ్, జూన్, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలలో..) 

ముఖ్య గమనిక : ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్స్ గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి  క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.

ప్రస్తుతం స్కీం లో 6.60% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.

 

 

MIS స్కీం  యొక్క బెనిఫిట్స్ ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం!(Example )

 

ఏదైనా పథకం యొక్క లాభం అనేది డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేట్ ద్వారా ఒక్కసారే ఈ స్కీం లో  Rs.4,00,000/- డిపాజిట్ చేస్తే ప్రతీ నెల  ఎంత వస్తుందో గణిద్దాం.

పాలసీదారుని వయసు ( Age )              = 30 సంవత్సరాలు
డిపాజిట్  ( Deposit Amount )           = 4,00,000/-
ప్రస్తుత వడ్డీరేట్  ( Interest Now )      = 7.40%

ప్రతీ నెల లభించే అమౌంట్  ( Monthly ) = Rs.2,466/-

5 సంవత్సరాలకి లభించే మొత్తం వడ్డీ  ( total Interest )Rs.1,48,000/-
                                                         ( 2,466× 12 × 5  = Rs. 1,48,000/- )

స్కీం యొక్క 5 వ సంవత్సరం ప్రారంభంలో  డిపాజిట్ చేసిన  Rs= 4,00,000/- రిటర్న్ చేస్తారు.

.MIS అకౌంట్ ని అత్యవసర సమయంలో  మధ్యలో నిలిపివేసే సదుపాయం ఉంటుందా? (  MIS  Pre – Mature Closer? )

ఉంటుంది! అకౌంట్ ఓపెన్ చేసిన ఒక సంవత్సరం తర్వాత కావాలంటే స్కీం బంద్ చేసి అమౌంట్ రిటర్న్ పొందవచ్చు.

 

ముఖ్య గమనిక :-

1. 3 సంవత్సరాలలోపు  కనుక అకౌంట్ ని బంద్ చేస్తే డిపాజిట్ అమౌంట్ లో 2% ని సర్వీస్ చార్జెస్ రూపంలో కట్ చేసి మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది.

అంటే  Rs.4,00,000/- కి 2 శాతం  = Rs.8,000/-

 

2. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత   కనుక అకౌంట్ ని బంద్ చేస్తే డిపాజిట్ అమౌంట్ లో1 % ని సర్వీస్ చార్జెస్ రూపంలో కట్ చేసి మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది.

అంటే  Rs.4,00,000/- కి 1 శాతం  = Rs.4,000/-

 

• నామినీ ఫెసిలిటీ? ( Post Office Monthly Income Scheme)

ఈ పథకంలో  అమౌంట్ డిపాసిట్ చేసిన వ్యక్తి, పథకం మధ్యలో ఏదైనా కారణంగా అంటే  సాధారణంగా కానీ లేదా ఆక్సిడెంట్ కారణంగా గాని మరణిస్తే, డిపాజిట్ అమౌంట్  నామినీకి పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఆ తర్వాత ఈ పథకం నిలిపివేయబడుతుంది.

 

.MIS స్కీం లో టాక్స్ బెనిఫిట్ లభిస్తుందా? ( MIS Tax Benefits?)

ఈ స్కీం లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్ పై గాని, లేదా మీకు లభించే  వడ్డీరేట్ పై గాని ఎటువంటి టాక్స్ ప్రయోజనం ఉండదు. గవర్నమెంట్ రూల్స్ కి అనుగుణంగా టాక్స్ వర్తిస్తుంది.

 

MIS ఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( MIS Documents Required?)

1. అప్లికేషన్ ఫారం  ( Account Opening Form )
2.రెండు పాసుపోర్టు ఫొటోలు  ( 2 Photos )
3.ఆధార్ కార్డు          ( Adar Card )
4. పాన్ కార్డు             ( PAN  Card )

•   పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై   ( Address Proof )
1. కరెంటు బిల్      ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్     ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్  ( Bank Statement )
4. పాస్ పోర్ట్           ( Passport )

( ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది )

 

Post Office Monthly Income Scheme  గురించి తరచుగా అడుగు ప్రశ్నలు:-

 

1. జాయింట్ అకౌంట్  విషయంలో వ్యక్తిగత ఖాతాదారుడి వాటా ఎలా లెక్కించబడుతుంది?

జ. ప్రతి జాయింట్ అకౌంట్ హోల్డర్ కూడా  జాయింట్ అకౌంట్లో సమాన వాటాను కలిగి ఉంటారు.

2. నా MIS అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత నేను డిపాజిట్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోకూడదనుకుంటే ఏమి చేయాలి?

ఒకవేళ మీరు మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, అకౌంట్ మెచ్యూరిటీ తేదీ నుండి రెండు సంవత్సరాల కాలానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ప్రకారం డబ్బు అకౌంట్‌లో ఉండి సాధారణ వడ్డీని పొందుతుంది.

3. ఈ  MIS పథకం సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుందా?

అవును. సీనియర్ సిటిజన్లకు ఇది అనుకూలమైన పథకం, ఎందుకంటే వారి జీవితకాల పొదుపులను, ఈ అకౌంట్ లో జమ చేయవచ్చు మరియు వారి నెలవారీ ఖర్చులకు వడ్డీని పొందవచ్చు.

4.నేను ఒక నగరం నుండి మరొక నగరానికి మారవలసి వస్తే నా MIS అకౌంట్ నిర్వహణ ఎలా?

జ.ఒక నగరం నుండి మరొక నగరానికి మారిన సందర్భంలో, మీరు మీ POMIS  అకౌంట్ ను ప్రస్తుత నగరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు అదనపు ఖర్చు లేకుండా సులభంగా బదిలీ చేయవచ్చు.

5. మీరు  పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం  ( MIS )లో వడ్డీని ఎలా పొందుతారు?

జ. నెలవారీ ప్రాతిపదికన వడ్డీ చెల్లించబడుతుంది. ఉదాహరణకు మీరు 2021 జూన్ 6 న డబ్బు డిపాజిట్ చేస్తే,  మీరు  6 జూలై, 2021 నుండి  వడ్డీ డబ్బులు అందుకుంటారు.  మీరు జూన్ 6 న డబ్బు డిపాజిట్ చేసినందున ప్రతి నెలా 6 వ తేదీ చెల్లింపు  ఉంటుంది.

6.పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం లేదా MIS  యొక్క పదవీకాలం ఏమిటి ?

జ. గతంలో MIS మెచ్యూరిటీ కాలం 6 సంవత్సరాలు గా ఉండేది. ఇప్పుడు అది 5 సంవత్సరాలకు తగ్గించబడింది.

7. పోస్ట్ ఆఫీస్ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీం  లో నామినేషన్ సౌకర్యం  ఉందా?

జ. అవును, ఈ పధకం లో పెట్టుబడి పెట్టే సమయంలో  ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. అకౌంట్ తెరిచిన తర్వాత మీరు నామినేట్ చేయాలనుకుంటే, దరఖాస్తును వ్రాసి పాస్‌బుక్‌తో పాటు సంబంధిత పోస్టాఫీసులో అందజేయాలి.

8. అకాల ఉపసంహరణ అందుబాటులో ఉందా?

జ. అవును, కానీ ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఈ అవకాశం కలదు. మీరు ఒక సంవత్సరం తర్వాత విత్‌డ్రా చేస్తే, అప్పుడు వారు మీ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 2% తగ్గిస్తారు. మీరు 3 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేస్తే,  అప్పుడు వారు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుండి 1% పెనాల్టీగా తీసివేస్తారు.

9. డిపాజిటర్ మరణిస్తే ఏమి జరుగుతుంది?

జ. డిపాజిటర్ మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడు అకౌంట్ ను మూసివేయాలి.  వడ్డీతో పాటు డిపాజిట్ చేసిన మొత్తాన్ని  చట్టపరమైన వారసుడు లేదా నామినీకి చెల్లిస్తారు.

10. జాయింట్ అకౌంట్  విషయంలో డిపాజిటర్ మరణిస్తే ఏమి జరుగుతుంది?

జ. జాయింట్ అకౌంట్  విషయంలో ఒక  హోల్డర్ మరణించిన తర్వాత, ఆ MIS అకౌంట్  బ్రతికి ఉన్న ఖాతాదారుడి పేరు మీద ఒకే అకౌంట్ (సింగిల్ ) గా పరిగణించబడుతుంది. అప్పుడు జీవించి ఉన్న డిపాజిటర్ పెట్టుబడి గరిష్ట పరిమితి ప్రకారం, అకౌంట్  కొనసాగించవచ్చు. ఈ  పరిస్థితిలో పోస్టాఫీసు అదనపు డిపాజిట్‌ను కనుగొన్నట్లయితే, బతికి ఉన్న డిపాజిటర్ వెంటనే ఆ అదనపు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని తెలియజేస్తుంది.

 

ఖాతా బదిలీ సదుపాయం? ( Transfer Facility Of MIS Scheme?)

ఈ MIS  అకౌంట్ ని మీరు ఒక పోస్ట్ ఆఫీస్  బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్ కి  అతి సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

 

https://www.indiapost.gov.in/

 

 

• ముగింపు  ( Conclusion )

 

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *