LIC Aadhaar Stambh Plan Details In Telugu ( 943 )
LIC Aadhaar Stambh
కేవలం పురుషుల కొరకు మాత్రమే LIC ప్రారంభం చేసిన ఎండోమెంట్ పాలసీ LIC ఆధార్ స్తంభ్, ఇది ఒక నాన్ లింక్డ్ – నాన్ పార్టిసిపేటెడ్ ప్లాన్ ( Non Linked N0n Participated) , షేర్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తోపాటు మెట్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. 2021 ఫిబ్రవరి లో LIC ఈ స్కీం ని లాంచ్ చేసింది, ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ 943, తక్కువ ప్రీమియం తో సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ ను ఆధార్ స్తంభ్ పాలసీ అందిస్తుంది, పాలసీ తీసుకోవడానికి ఎటువంటి మెడికల్ టెస్ట్ లు నిర్వహించడం జరగదు ఆధార్ కార్డు ఉంటే చాలు.ఇప్పుడు వివరాలు చూద్దాం .
ప్రయోజనాలు – Benefits Of LIC Aadhaar Stambh
1. ప్రత్యేకంగా తక్కువ ప్రీమియం రేట్స్ తో పురుషుల కొరకు ప్రారంభం చేయబడింది.
2. ఈ ఎండోమెంట్ పాలసీలో మెట్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్ పాలసీదారునికి లభిస్తాయి, ప్రాధమిక భీమా + లాయల్టీ అడిషన్ కలిపి మెట్యూరిటీ గా అందిస్తారు.
3. బేస్ పాలసీతో పాటుగా LIC ఆక్సిడెంట్ & టోటల్ పేర్మినెంట్ డిసబిలిటీ రైడర్ ను అదనంగా చేర్చుకోవచ్చు.
4. లోన్, సరెండర్ మరియు లాప్స్ పాలసీలకు రివైవల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండడటం జరుగుతుంది.
5.ప్రీమియం మరియు మెట్యూరిటీ & డెత్ క్లెయిమ్ పై టాక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.
LIC ఆధార్ స్తంభ్ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Eligibility ? )
• వయసు ( Age )
ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు( Minimum Age ) =8 సంవత్సరాలు
అత్యధికముగా (maximum Age ) = 55 సంవత్సరాలు.
• పాలసీ సమయం ? ( Policy Term ? )
కనీస పాలసీ సమయం (Minimum Policy Period ) = 10 సంవత్సరాలు
అత్యధిక పాలసీ సమయం వచ్చి ( Maximum Policy Period ) = 20 సంవత్సరాలు,
అందువల్ల పాలసీ సమయాన్ని10 – 20 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.
• పాలసీ యొక్క కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ( Sum Assured)
కనీస భీమా పరిమితి = Rs 75,000/-
అత్యధిక భీమా పరిమితి = Rs 3,00,000/-
కనీసం 75 వేలు నుంచి అత్యధికముగా 3, 00,000/- వరకూ
భీమా లభిస్తుంది
• పాలసీ యొక్క గరిష్ట మెట్యూరిటీ ( Maximum Maturity Age )
అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి= 70 సంవత్సరాలుగా ఉంటుంది అందువల్ల సంవత్సరాలలోపు పాలసీ ముగిసేవిధంగా చూసుకోవాలి.
• లోన్ సదుపాయం ( Loan Facility )
పాలసీదారుడు 2 సంవత్సరాలు పూర్తి ప్రీమియం ఎటువంటి అంతరాయం లేకుండా చెల్లిస్తే , అత్యవసర పరిస్థితుల్లో ప్రీమియం పై లోన్ పొందవచ్చు.
• ఫ్రీ లుక్ సమయం ( Free Look Period )
పాలసీ తీసుకున్న 15 రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ వ్యవధిలో, పాలసీదారులు పాలసీ నిబంధనలు మరియు షరతులను పరిశీలించి పాలసినీ క్లోజ్ చెయ్యవచ్చు ఈ సందర్బంగా మొత్తం ప్రీమియం రిటర్న్ లభిస్తుంది.
• పాలసీ విరమణ – Surrender Facility
LIC ఆధార్ స్తంభ్ ప్లాన్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు సరెండర్ చెయ్యవచ్చు దీని కొరకు కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది అప్పుడే పాలసీ సరెండర్ కి అనుమతి లభిస్తుంది.
•పాలసీలో ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying ?)
4 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం లభిస్తుంది.
1. వార్షిక – Yearly
2. అర్ధవార్షిక – Half Yearly
3. త్రయి మాసిక – Quarterly
4. ప్రతినెలా – Monthly
ఉదాహరణ – LIC Aadhaar Stambh Policy
పాలసీదారుడు పేరు – Mr .రాజు
వయసు ( Age ) – 30 సంవత్సరాలు
పాలసీ సమయం ( Policy Period ) – 20 సంవత్సరాలు
భీమా ( Bhima ) = 3 లక్షలు
ప్రీమియం సమయం ( Premium Payment ) = 20 సంవత్సరాలు
నెలసరి ప్రీమియం ( Monthly Premium ) = Rs 913/-
చెల్లించిన మొత్తం ప్రీమియం = Rs 2,14,696/-
వార్షిక టాక్స్ డెడక్షన్ = Rs 3,287/-
మెట్యూరిటీ ( Maturity Benefit )
Ms. రాజు కి 20 సంవత్సరాల పాలసీ సమయంలో ఎటువంటి రిస్క్ జరగకపోతే చివర్లో మెట్యూరిటీ ఈ కింద విధంగా లభించడం జరుగుతుంది.
ప్రాథమిక భీమా సమ్ అస్సుర్డ్ ( Basic Sum Assured ) = Rs 3,00,000/-
లాయల్టీ బోనస్ అడిషన్ ( Loyalty Bonus ) = Rs 9,75,000/-
మొత్తం ( Total Amount ) = Rs 3,97,500/- మెట్యూరిటీ గా రావడం జరుగుతుంది.
మరణ ప్రయోజనం ( Death Benefit )
20 సం||రాల ప్లాన్ సమయంలో Ms.రాజు కి ఎప్పుడు ఏవిధంగా రిస్క్ జరిగినా సరే నామినికి ఈ క్రింద విధంగా ప్రయోజనం అందిస్తారు.
1. ప్రాథమిక భీమా పై 110% ( Rs 3 లక్షల 30 వేలు )
2. వార్షిక ప్రీమియం కి 7 రేట్లుగా ( Rs 10,851 × 7 = Rs 75,957 )
3. చెల్లించిన మొత్తం ప్రీమియం పై 105% తో పాటుగా ఒకవేళ రైడర్ తీసుకొంటే ఆ అమౌంట్ ను కూడా కలిపి నామినికి అందివ్వడం జరుగుతుంది.
ఈ విధంగా పై 3 షరతులలో ఎందులో ఎక్కువ డబ్బులు లభిస్తే దానిని మాత్రమే డెత్ బెనిఫిట్ గా ఇస్తారు.
1. ఆక్సిడెంట్ డెత్ మరియు డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death And Disability Benefit Rider )
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారునికి ఆక్సిడెంట్ వల్ల రిస్క్ జరిగితే ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.
రైడర్ ను పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు మరియు చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలి ఉంటే అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది. పాలసీదారునికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
Also Read
ఒకవేళ Mr.రాజు ప్లాన్ మధ్యలో ఆక్సిడెంట్ కారణంచేత మరణిస్తే
ప్రాథమిక భీమా 3 లక్షలు, పాలసీ కొనసాగిన సమయంలో లభించే బోనస్ మరియు రైడర్ రూపంలో మరొక 3 లక్షలు కలిపి అదనంగా నామినీకి రావడం జరుగుతుంది ఈ రైడర్ కొరకు తక్కువ మొత్తంలో ప్రతి నెలప్రీమియం వసూలు చేయబడుతుంది.
ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్ – Tax Benefits
LIC Aadhaar Stambh ప్లాన్లో చెల్లించే ప్రీమియం మరియు లభించే మెట్యూరిటీ & డెత్ బెనిఫిట్ పై టాక్స్ ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోవచ్చు.
LIC మెట్యూరిటీ సెటిల్మెంట్ – ( Maturity Settlement )
మెట్యూరిటీ సెటిల్మెంట్ ద్వారా మెట్యూరిటీ డబ్బులను ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు లేదా వాయిదాల పద్దతిలో సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి మరియు సంవత్సరానికి ఒకసారి లభించేలా నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.అయితే ఈ ఎంపికను పాలసీదారుడు 3 నెలలు పాలసీ సమయం ఉండగానే LIC సంస్థకి తెలియచేయాలి.
కావాల్సిన డాకుమెంట్స్ – Required Documents
1. ఆధార్ కార్డు – Adhar Card
2. ఓటర్ ఐడి – Voter ID
3. రెండు ఫోటోలు – Two Photos
4. బ్యాంక్ పాస్ బుక్ – Bank Pass Book