SBI Saral Jeevan Bhima In Telugu – 5 లక్షల భీమా నెలకు 1,68/- రూ||లకే కానీ వీరికి మాత్రమే, పూర్తి వివరాలు

                SBI Saral Jeevan Bhima In Telugu

SBI Saral Jeevan Bhima

IRDAI – ఇన్సూరెన్స్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్ మెంట్ అథారిటీ అఫ్ ఇండియా (  Insurance Regulatory And Development Authority Of India ).

ఇండియా లో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు యాజమాన్యం వహిస్తుంది. అయితే ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ ( Term Insurance ) మినహాయించి మిగిలిన,

 1.  ఎండోమెంట్ ఇన్సూరెన్స్          ( Endowment )
2.  మనీ బ్యాక్ ఇన్సూరెన్స్               ( Money Back )
3.  పిల్లలకు చిల్డ్రన్స్ ఇన్సూరెన్స్ ( Children Plans )
4. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్             ( Whole Life Insurance )
5. రిటైర్మెంట్ ఇన్సూరెన్స్              ( Retirement Plans )       పాలసీలు అందరికి అందుబాటులో ఉంటాయి.

కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో చాలా తక్కువ ప్రీమియం కే ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది, వ్యక్తి కుటుంబానికి అధిక ఆర్థిక ప్రయోజనం టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

 

  కానీ టర్మ్ ఇన్సూరెన్స్ సామాన్యులకి అందివ్వడం కుదరదు.

• ఇన్కమ్ టాక్స్ పరిధిలో ఉన్నవారు  ( ITR Returns Must ), పెద్ద వ్యాపారస్తులకి ( Business Mans )మాత్రమే అందిస్తారు.దీనితో పాటుగా హాస్పిటల్ ఆరోగ్య ( Health Check Up Report )వివరాలు జామచేయవలసి ఉంటుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం సామాన్యులకి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అందివ్వాలని IRDAI ని ఆదేశించింది. గవర్నమెంట్ ఆదేశం మేరకు 1 జనవరి 2021 నుంచి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సరళ జీవన్ భీమా ని ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నాయి.

 

ప్రస్తుతం SBI Life కి సంబందించిన సరళ జీవన్ భీమా పూర్తి వివరాలు, ప్రీమియం, స్కీం పనిచేసే విధానం గురించి తెలుసుకొందా!

సరళ జీవన్ భీమా ఒక  నాన్ లింక్డ్  పాలసీ  ( Non Linked ).అంటే ఈ పాలసీలో  మీరు చెల్లించే ప్రీమియం డబ్బులను  SBI లైఫ్ సంస్థ షేర్ మర్కెట్స్ లో  ఇన్వెస్ట్మెంట్ చెయ్యదు, కాబట్టి  మీ డబ్బులు ఈ పాలసీలో  భద్రంగా ఉంటాయి.

ఈ స్కీం యొక్క అధికారిక ప్రోడక్ట్ కోడ్ ( Product Code )- 2Q

 

• SBI లైఫ్ సరళ జీవన్ భీమా ఏ విధంగా పనిచేస్తుంది? ( How does work SBI Saral Jeevan Bhima?)

ఈ స్కీం లో పాలసీదారుడు నిర్ణయించుకొన్న పాలసీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లిస్తాడు. ఒకవేళ పాలసీ సమయం మధ్యలో ఏ కారణంగా నైనా మరణానికి గురిఅయినట్లయితే చెల్లించిన ప్రీమియం తక్కువే అయినప్పటికీ దానితో ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం భీమా రాసిని కుటుంబానికి అందజేయడం జరుగుతుంది.

 

• పాలసీ లో ఉన్న అతి  ముఖ్యమైన  ప్రయోజనాలు ఏమిటి?  ( Key Features Of SBI life Saral Jeevan Bhima )

1. ఆదాయం, చదువు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ తీసుకోవచ్చు. ( Income & Education Not Mandatory )

2.పాలసీ తీసుకొన్న వ్యక్తి కుటుంబానికి పూర్తి ఆర్థిక భద్రత లభిస్తుంది..( Financial Security )

3.అత్యధికముగా 70 సంవత్సరాల వరకూ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అందజేయబడుతుంది.( Long Term Coverage )

4. అవసరానికి తగిన విధంగా పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయం చేసుకోవచ్చు.( Flexibility )

5. డిపాజిట్ ప్రీమియం పై మరియు క్లెయిమ్ అమౌంట్ పై టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.( Tax Deduction )

6.సామాన్యులకి కూడా అర్ధం అయ్యేలా సులువుగా పాలసీని రూపొందించబడింది.( Easily Understood )

7. పాలసీలో ప్రీమియం  వేరు వేరు గా చెల్లించే విధంగా ఫ్లిక్సిబిలిటీ కల్పించబడింది.( Different PPT Options )

 

• ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు  (maximum Age ) = 65 సంవత్సరాలు.

కనుక 18  నుంచి 65 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

• సరళ జీవన్ భీమా ని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? (  Policy Term Of SBI Life Saral Jeevan Bhima ? )

కనీస పాలసీ సమయం వచ్చి  (Minimum Policy Period ) =5 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం     ( Maximum Policy Period ) = 40 సంవత్సరాలు.

కాబట్టి మీరు  ఈ పాలసీ యొక్క సమయాన్ని కనీసం 5 నుంచి 40 సంవత్సరాల మధ్య  నిర్ణయించుకోవచ్చు.

అంటే 5,10,15,20,25,30,….40 ఈ విధంగా!

 

• సరళ జీవన్ భీమా కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured Of SBI life Saral Jeevan Bhima ? )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి ( Minimum Basic Sum Assured ) = Rs 5, 00, 000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి                         ( Maximum Basic Sum Assured ) = Rs 25,00,000/-

ఈ పాలసీని 25 లక్షల కు మించి అందివ్వడం జరగదు.

 

• ఈ పాలసీ యొక్క  గరిష్ట మెట్యూరిటీ  సమయం ఎంత? ( Maximum Maturity Age of  Saral Jeevan Bhima ? )

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి ( Maximum maturity age )= 70 సంవత్సరాలు గా  ఉంటుంది.

అంటే ఈ పాలసీని మనం అత్యధికంగా  70 సంవత్సరాలు వచ్చే వరకూ మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది,  అంటే 50 సంవత్సరాల ఒక వ్యక్తికి  ఈ పాలసీ 20  సంవత్సరాలు  మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే  పాలాసియొక్క గరిష్ట  మెట్యూరిటీ  70  సంవత్సరాలు కాబట్టి.

 

SBI Annuity Deposit Scheme In Telugu – ప్రతి నెలా Rs.9,677/- రూ ||లు 3 సంవత్సరాల వరకు పొందండి

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

• సరళ జీవన్ భీమా పాలసీలో ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying )

ఈ స్కీం లో ప్రీమియం ని 3 రకాలుగా చెల్లించవచ్చు.

    1.సింగిల్ ప్రీమియం ( Single Premium Only One Time ).

ఈ ఆప్షన్ ద్వారా పాలసీకి సంబందించిన మొత్తం ప్రీమియం ఒక్కసారే పాలసీ దారుడు చెల్లించవచ్చు.

   2. రెగ్యులర్ ప్రీమియం ( Regular Premium )

అంటే ఎన్ని సంవత్సరాలు పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకొంటే అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం.

   3. లిమిటెడ్ ప్రీమియం ( Limited Premium )

ఈ ఆప్షన్ ద్వారా పాలసీదారుడు పాలసీ సమయం కంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు.

అయితే వేరు వేరు పాలసీ సమయానికి ఇవి వేరు వేరు గా వర్తిస్తాయి.

 

పాలసీ సమయం                ప్రీమియం చెల్లింపు విధానం

5  నుంచి 40 సం||ల మధ్య           =  సింగిల్ మరియు రెగ్యులర్                    ( Single & Regular).
10  నుంచి 40 సం||ల మధ్య         = లిమిటెడ్ ప్రీమియం 5 సం || రాలు .  ( Limited )
15 నుంచి 40 సం||ల మధ్య           = లిమిటెడ్ ప్రీమియం 10 సం || రాలు. ( Limited)

 

• సరళ జీవన్ భీమా పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Payment Mode Of  Saral Jeevan Bhima?)

ఒక్క సింగిల్ ప్రీమియం తప్ప మిగిలిన రెగ్యులర్ మ రియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారు
ఈ పాలసీలో  4 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి ఒకసారి    – Yearly
2. 6 నెలలకు ఒకసారి          – Half Yearly
3. 3 నెలలకు  ఒకసారి         – Quarterly
4. ప్రతినెలా                           – Monthly

ముఖ్య గమనిక :

ఈ ప్రీమియంని చెల్లించడానికి  పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.

లేదా  ఆన్ లైన్లో  గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు  ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం SBI లైఫ్ సంస్థ కల్పించింది.

 

Example :-

 

• సరళ జీవన్ భీమా పనిచేసే విధానం ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!( Example )

 

పాలసీదారుని పేరు                      – Mr.సురేష్ 
వయసు                                           – 25 సంవత్సరాలు
పాలసీ సమయం                           – 25 సంవత్సరాలు
సరళ జీవన్ భీమా                          – 5 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం        –  ప్రతినెలా
నెలసరి ప్రీమియం   – Rs 168/     – ( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )

సురేష్ ప్రతినెలా ఈ పాలసీలో  Rs 168/- రూపాయలు చొప్పున 25 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  = Rs 50,400/- అవుతుంది..

అయితే Mr. సురేష్ పాలసీ సమయం మధ్యలో సాధారణం గా లేదా ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే భీమా 5 లక్షలు కట్టిన ప్రీమియం తో సంబంధం లేకుండా నామినికి లేదా కుటుంబ సభ్యులకు అందివ్వడం జరుగుతుంది.

 

ముఖ్య గమనిక :- వెయిటింగ్ పీరియడ్ ( Waiting Period )

పాలసీ తీసుకొన్న 45 రోజుల తర్వాత పాలసీదారుడు మరణిస్తే మొత్తం భీమా 5 లక్షలు నామినికి లభిస్తాయి.

ఒకవేళ

మొదటి 45 రోజుల్లోపు పాలసీదారుడు మరణిస్తే చెల్లించిన ప్రీమియం మాత్రమే అందివ్వడం జరుగుతుంది.

 

• మెట్యూరిటీ ప్రయోజనం ( Maturity Benefit )

ఇది స్వచ్ఛమైన టర్మ్ ఇన్సూరెన్స్, ఇతర స్కీమ్స్ ల వలె పాలసీ సమయం ముగిసిన తరువాత ఎటువంటి మాత్యూరిటీ అమౌంట్ లభించదు.

 

ఫ్రీ లుక్ పీరియడ్  అంటే ఏమిటి? ( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై  మీరు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

•సరళ జీవన్ భీమా పాలసీలో  లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? (  Tax Benefits Of Saral Jeevan Bhima ?)

ఈ పాలసీలో పాలసీదారుడు  చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80c  వర్తిస్తుంది, కాబట్టి ప్రతీ సంవత్సరo Rs 1,50,000/- వరకూ  టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.

అదేవిధంగా పాలసీ లో లభించే మరణ ప్రయోజనం పై  ఇన్కమ్ టాక్స్ రూల్  అండర్ సెక్షన్ 10D  వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.

 

• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value Of SBI life Saral Jeevan Bhima ?)

 

ఇతర పాలసీల లో పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు  జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.

కానీ ఈ పాలసీకి సరెండర్ వర్తించదు.

 

• సరళ జీవన్ భీమా పాలసీని  ఎలా  తీసుకోవాలి? ఏ ఏ  డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది?
( How to Apply and  Which Documents Required?)

ఈ పాలసీని మీరు SBI Life ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో( Online ) తీసుకోవచ్చు.

లేదా

ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా  ( Offline ) తీసుకొనే సదుపాయం ఉంటుంది.

• కావలసిన డాకుమెంట్స్

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం
2. ఆధార్ కార్డు                –   (  Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
4. పాన్ కార్డు                    –  (   KYC  Verification )
5.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

 

https://www.sbilife.co.in/

ముగింపు  ( Conclusion )

SBI లైఫ్ సరళ జీవన్ పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *