Post Office Interest Rates 2024
Post Office Interest Rates
మీరు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్ చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్‌లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ లభిస్తున్నాయి వీటిల్లో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు కచ్చితమైన రాబడి వస్తుంది. రానున్న కాలంలోని అవసరాల కోసం ఇప్పటి నుంచే ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకోవాలని భావిస్తున్నారా? పిల్లల ఉన్నత చదువు లేదంటే వారి పెళ్లిళ్లు, లేదంటే రిటైర్మెంట్ ఇలా ఏదో ఒక అవసరం కోసం డబ్బులు దాచుకోవాలని ప్లాన్ వేస్తున్నారా? అత్యంత సురక్షితమైన 8 పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పధకాల వివరాలతో పాటు కొత్త వడ్డీ రేట్లను తెలుసుకొందాం రండి .
1. Post Office FD Interest Rate
పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్స్ తక్కువ పొదుపు ధ్వారా అందరికీ అందుబాటులో వుండే ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ గురించి తెలుసుకుందాము! ఎఫ్.డి ఫిక్స్డ్ అంటే డిపాజిట్ డిపోసిట్ , ఈ స్కీంలో ఏమిటంటే మీదగ్గర వున్నా అమౌంట్ ని ఒక్కసారే కొంత కాలానికి నిర్ణయించుకొని డిపాజిట్ చేస్తారు.మీయొక్క డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వము రెగ్యులర్ గా వడ్డీని అందిస్తుంది ఎప్పుడైతే మీ సేవింగ్ స్కీం సమయం పూర్తి అవుతుందో అప్పుడు అమలు మరియు దానిపై అప్పటి వరకు లభించిన వడ్డీని కలిపి మెచ్యూరిటీ గా మీకు అందివ్వడం జరుగుతుంది. రిస్క్ లేకుండా ఎంతైనా అమౌంట్ ను ఇన్వెస్ట్ చెయ్యడానికి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్ స్కీం ఒక బెస్ట్ ఆప్షన్.
ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు. పిల్లలు , పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే అకౌంట్ ఓపెంట్ చేసి డిపాజిట్ చెయ్యవచ్చు. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం యొక్క సమయం 1 సంవత్జ్సారాన్నికి, 2 సంవత్సరాలకు మరియు 5 సంవత్సరాలుగా ఉంటుంది. 4 సంవత్సరాల కాల పరిమితితో ఈ ఫిక్సడ్ డిపాజిట్ స్కీం ఉండదు కనీసం ఒక్కసారే 1000 రూపాయల నుండి అత్యధికంగా ఎంత అమౌంట్ ని ఐన డిపాజిట్ చేసుకోవచ్చు.
ఈ కొత్త రేట్లు 2024 నుంచి అమలులోకి వచ్చాయి ఒక సంవత్సర ఫిక్సడ్ డిపాజిట్ పై 6.90% , 2 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ పై 7.00% , 3 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ పై 7.00% మరియు 5 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ పై 7.50% అందివ్వడం జరుగుతుంది.
FD పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
2. Post Office RD Interest Rate
ఫ్రెండ్స్ సామాన్య వ్యక్తుల నుంచి కోటీశ్వరుల వరకు చాల తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికీ పోస్ట్ ఆఫీస్ రీకరింగ్ డిపాజిట్ స్కీం ఒక వరం, ఆర్.డి అంటే రీకరింగ్ డిపాజిట్ . ఈ స్కీం లో మీరు పెద్ద మొత్తం లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటె కనీసం నెలకి 1000 రూపాయలను డిపాజిట్ చేస్తూ కూడా స్కీం లో మీరు కొనసాగవచ్చు. ఈ చిన్న మొత్తం పై మ్యూచ్యువల్ ఫండ్స్ లో లభించే విధంగా చక్రవడ్డీ ని ప్రభుత్వం అందిస్తుంది.
తరువాత రీకరింగ్ డిపాజిట్ స్కీం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ప్రతి నెల మీరు చెల్లించే అమౌంట్ అనేది 100 అయితే 100 , 1000 అయితే 1000, 10000 అయితే 10000, ఇలా 10 సంవత్సరాలు ఒకే అమౌంట్ డిపాజిట్ చెయ్యాలన్నమాట. మీ డిపాజిట్ అమౌంట్ పై ఎప్పటికప్పుడు వడ్డీ ఆడ్ అవుతుంది. కంపెనీ ఇస్తుంది. చివరిలో ఈ మొత్తం, అమౌంట్ ని ఒక్కసారే మీకు మెచ్యూరిటీ గా పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది.
ఫ్రెండ్స్ రీకరింగ్ దేఫాస్ట్ స్కీం లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు ఎటువంటి వయసు పరిమితులు లేవు. పిల్లలకి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు చెయ్యడానికి రీకరింగ్ డిపాజిట్ స్కీం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి ప్రతినెలా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సేవింగ్ అకౌంట్ లో వున్నా అమౌంట్ ఆటో మాటిక్ గా కట్ అయ్యే సదుపాయం పోస్ట్ ఆఫీస్ రీకరింగ్ డిపాజిట్ సేవింగ్ స్కీం లో వుంది.
RD పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
Post office RD Scheme in Telugu & చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని పొందండి
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 6.70% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
3.post office interest rate PPF 2024
ఏదైతే మన యొక్క నిత్య జీవితం లో లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో అంటే సొంత ఇంటి కల, పిల్లల చదువు, వివాహం, వ్యాపారం ప్రారంభ పెట్టుబడి ఇటువంటి పెద్ద లక్ష్యాలను సాధించడానికి పోస్ట్ ఆఫీస్ పిపిఆఫ్ స్కీం మీకు చాల సహాయపడుతుంది. పిపిఆఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 1968 లోనే గవర్నమెంట్ అఫ్ ఇండియా ఈ స్కీం ని ప్రారంభించింది. ఇప్పటికి బెస్ట్ ప్లాన్ గా మెచ్యురిటీ ని పొందాలనుకుంటారో వారికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్ స్కీం మంచి అవకాశం ఎవరైతే పెద్దగా రిస్క్ లేకుండా, లాంగ్ టర్మ్ సేవింగ్ చేస్తూ గ్యారెంటెడ్ మెచ్యురిటీ పొందాలనుకుంటున్నారో వారికీ మంచి ప్లాన్.
ఇక స్కీం యొక్క ప్రయోజనాన్ని పరిశీలిస్తే సాధారణ పోస్ట్ ఆఫీస్ తో పాటు ఇతర బ్యాంక్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యవచ్చు ఒక సంవత్సరంలో కనీసం 500 రూపాయల నుంచి అత్యధికంగా లక్ష50 వేల వరకు మీరు డిపాజిట్ చేయవచ్చు. ఈ అమౌంట్ ని ఒకేసారి లేదా వీలు వున్నప్పుడు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లో సమయం 15 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అత్యవసర సమయంలో మీరు ఋణం కూడా పొందవచ్చు.
PPF పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
PPF Scheme in Telugu -& పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్&అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 7.10% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
4. post office interest rate MIS 2024
ఎవరైతే వారి యొక్క నెలవారీ జీతం, లేదా రెగ్యులర్ బిజినెస్ లో వచ్చు ఆదాయం తో సంబంధం లేకుండా ఒక ఫిక్సడ్ రెగ్యులర్ ఆదాయాన్ని ప్రతీ నెల కావాలనుకుంటున్నారో వారికీ పోస్ట్ ఆఫీస్ MIS స్కీం బెస్ట్ ఆప్షన్. MIS అంటే మంత్లీ ఇన్కమ్ స్కీం. ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్ స్కీం. అంటే ఈ స్కీం లో మీరు ఒకేసారి అమౌంట్ ని డిపాజిట్ చెయ్యాలి. మీ డిపాజిట్ అమౌంట్ ని ఆధారం చేసుకుని ప్రతినెలా వడ్డీని నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లో జమచేయడం జరుగుతుంది. అదికూడా 5 సంవత్సరాలు కంటిన్యూగా మరియు మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసారో అంత అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారు. ఇంకా డిపాజిట్ పై లభించే వడ్డీని మీకు నెలనెలా అందివ్వడం జరుగుతుంది.
ఎవరైనా సరే ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ని మరియు సింగల్ మరియు జాయింట్ అకౌంట్ రూపంలో ఓపెన్ చేయవచ్చు. MIS స్కీం సమయం 5 సంవత్సరాలుగా ఉంటుంది ఈ స్కీం లో ఒకేసారి కనీసం 1000 రూపాయలనుంచి సింగల్ అకౌంట్ అయితే అధికంగా 9 లక్షలు జాయింట్ అకౌంట్ అయితే అప్ టు 15 లక్షలు వరకు ఈ స్కీం లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు.
MIS పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 7.40% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
5. post office interest rate KVP 2024
పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన 5 వ సేవింగ్ స్కీం – కిసాన్ వికాస్ ప్లాన్ ఈ స్కీం లో మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంతే అమౌంట్ కి సమానంగా మెచ్యూరిటీ అనేది మీకు రావడం జరుగుతుంది అంటే 1000 రూపాయలను డిపాజిట్ చేస్తే 2000 , లక్షకి 2 లక్షల ఇలా మీ డబ్బును కొంత సమయానికి రెట్టింపు చేసి ఇవ్వడం ఈ స్కీం యొక్క ఉద్దేశ్యం. కిసాన్ వికాస్ ప్లాన్ లో కూడా మీరు చక్రవడ్డీని పొందవచ్చు. ప్రజలలో దీర్ఘకాలిక ఆర్ధిక క్రమశిక్షణ ను ప్రోత్సహించడం కొరకు 1988 లోనే ఈ స్కీం ను గవర్నమెంట్ ప్రారంభం చేసింది.
ఈ స్కీం ను పరిశీలిస్తే ప్రతి ఒక్కరు ఈ స్కీం లో అమోంట్ డిపాజిట్ చెయ్యవచ్చు ఇలా అకౌంట్ ఓపెన్ చెయ్యగానే మీకు ఒక సర్టిఫికెట్ ని అందివ్వడం జరుగుతుంది. కనీసం ఒక్కసారి 1000 రూపాయలనుంచి ఎంతైనా అమౌంట్ ను మీరు కేవీపీ స్కీం లో డిపాజిట్ చెయ్యవచ్చు.
KVP పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
Post Office KVP Scheme In Telugu &; &#;కట్టిన దానికి రెట్టింపు పొందండి & అర్హులు వీరే పూర్తి వివరాలు
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 7.50% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
6. scss 2024
ఫ్రెండ్స్ 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు అత్యధిక వడ్డీని అందిస్తుంది ప్రతినెలా రెగ్యులర్ ఇన్కమ్ భరోసాని అందించే కేంద్ర ప్రభుత్వ పధకం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం. ఒకవేళ మీదగ్గర ఎక్కువ అమౌంట్ ఉండి మీ ఇంట్లో అమ్మమ తాతయ్య లు ఉంటే వారి పేర్లపై అకౌంట్ ఓపెన్ చేసి ఈ ప్రయోజనాన్ని మీరు నేరుగా అకౌంట్ లో పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ స్కీం లో మీరు ఒకసారి కొద్దిగా అమౌంట్ ని డిపాజిట్ చేయాల్సివుంటుంది. ఆ అమౌంట్ ఆధారంగా చేసుకుని మీకు రెగ్యులర్ గా వడ్డీ అమౌంట్ ని గవర్నమెంట్ అకౌంట్ లో జమచేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీరు జమ చేసిన మొత్తం అమౌంట్ తిరిగి మీ అకౌంట్ లోకి రిటర్న్ చేస్తారు.
ఈ స్కీం ఫీచర్స్ మరియు బెనిఫిట్స్ ని గమనిస్తే 60 సంవత్సరాలు నిండిన సాధారణ వ్యక్తులు , గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్, వాలంటరీ రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఈ స్కీం కి అర్హులు. కనీసం డిపాజిట్ అమౌంట్ వచ్చి 1000 రూపాయలు, అత్యధిక డిపాజిట్ వచ్చి ఇది వరకు 15 లక్షలు మాత్రమే ఉండేది కానీ 2023 ఏప్రిల్ నుండి ఈ పరిమితిని ౩౦ లక్షల వరకు పెంచడం జరిగింది.
SCSS పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
SCSS new rules 2024 India &; ఈ మార్పులు తెలుసుకోకపోతే మొత్తం నష్టపోతారు
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 8.20% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
7. NSC 2024
సింగల్ డిపాజిట్ ధ్వారా తక్కువ సమయానికి చక్రవడ్డీని అందించే మరొక పోస్ట్ ఆఫీస్ NSC స్కీం అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్. ఈ పధకంలో పోస్ట్ ఆఫీస్ ధ్వారా ఒక సర్టిఫికెట్ మీకు లభిస్తుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఈ విధంగా పనిచేస్తుంది, ఈ పధకంలో ఒక్కసారే కొద్దిగా అమౌంట్ ను డిపాజిట్ చెయ్యాలి, స్కీం సమయం మొత్తం వడ్డీ లభిస్తుంది చివరిలో అసలు మరియు మొత్తం వడ్డీతో కూడిన మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ మీకు మెచ్యూరిటీ గా అందిస్తుంది.
తరువాత నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం లో అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి వయసు పరిమితులు లేవు ,ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల్లోపు చెవిటి, మూగ కల్గిన పిల్లలకి ముఖ్యంగా ఈ స్కీం లాభదాయకం. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యడమే కాకుండా జాయింట్ అకౌంట్ సదుపాయం కూడా పొందవచ్చు ఒక్కసారే కనీసం 1000 రూపాయల నుంచి అత్యధికంగా మీరు ఎంతైనా అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు అత్యధిక డిపాజిట్ పై పరిమితి వర్తించదు మరియు ఈ స్కీం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది.
NSC పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
Post Office NSC Scheme In Telugu & తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ అందించే పథకం
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 7.70% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.
8. SSY 2024
ఆడపిల్లలున్న తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువులని, వివాహం అని ఇతర ఖర్చులలు సహాయపడి వారికీ ఆర్ధిక భరోసాని ఇచ్చే ప్రభుత్వ పధకం సుకన్య సమృద్ధి యోజన. ప్రధానంగా బాలికల భవిష్యత్తుకి ఉపయోగపడే బెస్ట్ SSY స్కీం. ఈ స్కీం ద్వారా సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి అత్యధికంగా లక్ష 50 వేల రూపాయల మధ్య మీరు పొదుపు చెయ్యవచ్చు. డిపాజిట్ అమౌంట్ పై చక్రవడ్డీ లభిస్తుంది. ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజన స్కీం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడిపై మంచి ఆదాయం పొందవచ్చు.
ఇక స్కీం యొక్క బెనిఫిట్స్ ను పరిశీలిస్తే 100% ఖచ్చితమైన రిటర్న్ కి భరోసా ఉంటుంది 10 సంవత్సరాలలోపు వయస్సు కల్గిన ప్రతి ఒక్క ఆడపిల్ల కి ఈ స్కీం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో అత్యధికంగా ఇద్దరు పిల్లల ఈ స్కీం కి అర్హులు. కవలల సందర్భంలో ముగ్గురు పిల్లల వరకు ఉంటుంది. ఈ స్కీం యొక్క సమయం వచ్చి 21 సంవత్సరాలుగా ఉంటుంది. మీరు మాత్రం మొదటి 15 సంవత్సరాలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన 6 సంవత్సరాలు ఎటువంటి డిపాజిట్ చెయ్యకుండానే వారి అకౌంట్ లో అమౌంట్ ఆడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లభిచే మొత్తం అమౌంట్ 21 వ సంవత్సరం మెచ్యురిటీ గా పోస్ట్ ఆఫీస్ మీకు అందిస్తుంది.
ఒకవేళ 21 సంవత్సరాల్లోపు మధ్యలో మీకు అమౌంట్ అవసరం ఉంటే వివాహానికి సంబంధించి కొంత డబ్బును పొందవచ్చును.
NSC పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!
ప్రస్తుతం గవర్నమెంట్ అఫ్ ఇండియా 7.70% వడ్డీ ని ఈ స్కీమ్ లో అందివ్వడం జరుగుతుంది.